అయ్యారే అయ్యర్, తొలి టెస్టులోనే చరిత్ర సృష్టించిన శ్రేయాస్... రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ...
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకోవడం, కెఎల్ రాహుల్ గాయపడడంతో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో అవకాశం దక్కించుకున్నాడు శ్రేయాస్ అయ్యర్. లక్కీగా వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా ఒడిసి పట్టుకున్నాడు ఈ ముంబై క్రికెటర్...
వాస్తవానికి తొలి టెస్టులో శ్రేయాస్ అయ్యర్‌ను ఆడించాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావించలేదు. కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్‌లను ఓపెనర్లుగా ఆడించి, మిడిల్ ఆర్డర్‌లో శుబ్‌మన్ గిల్‌ని ప్రయత్నించాలని చూసింది...
అయితే తొలి టెస్టు ఆరంభానికి ముందు కెఎల్ రాహుల్ గాయపడడంతో అనుకోకుండా కాన్పూర్ టెస్టు తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు శ్రేయాస్ అయ్యర్...
తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసి, ఆరంగ్రేటం టెస్టులో శతాధిక స్కోరు చేసిన 16వ భారత బ్యాట్స్‌మెన్‌గా, స్వదేశంలో ఈ ఫీట్ సాధించిన 10వ క్రికెటర్‌గా నిలిచిన అయ్యర్, రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆకట్టుకున్నాడు...
ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానే, మయాంక్ అగర్వాల్, శుబ్‌మన్ గిల్ వంటి కీ ప్లేయర్లు ఫెయిల్ అయిన చోట, రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ నమోదుచేశాడు శ్రేయాస్ అయ్యర్...
ఆరంగ్రేటం టెస్టులోనే ఓ సెంచరీ+ ఓ హాఫ్ సెంచరీ నమోదుచేసిన మొట్టమొదటి భారత బ్యాట్స్‌మెన్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు శ్రేయాస్ అయ్యర్...
తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో 50+ స్కోర్లు చేసిన మూడో భారత బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్. ఇంతకుముందు 1934లో దిల్వార్ హుస్సేన్, 1971లో సునీల్ గవాస్కర్ మాత్రమే ఈ ఫీట్ సాధించారు...
తొలి ఇన్నింగ్స్‌లో 105, రెండో ఇన్నింగ్స్‌లో 65 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్... ఆరంగ్రేటం టెస్టులో 170 పరుగులు చేసి తొలి టెస్టులో అత్యధిక పరుగులు చేసిన మూడో భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు...
శిఖర్ ధావన్ 187, రోహిత్ శర్మ 177 పరుగులు చేసి టాప్‌లో ఉండగా, శ్రేయాస్ అయ్యర్ 170 పరుగులతో టాప్ 3లో నిలిచాడు. ధావన్, రోహిత్ ఒకే ఇన్నింగ్స్‌లో ఆ పరుగులు చేయగా, శ్రేయాస్ అయ్యర్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 170 రన్స్ చేశారు...
ఆరంగ్రేటం టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో 100+ కి పైగా బంతులు ఎదుర్కొన్న రెండో భారత బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్. ఇంతకుముందు 2018లో మయాంక్ అగర్వాల్ ఈ ఫీట్ సాధించాడు...
ఓవరాల్‌గా కాన్పూర్ టెస్టులో 296 బంతులు ఎదుర్కొన్న శ్రేయాస్ అయ్యర్, మహ్మద్ అజారుద్దీన్ (322), సౌరవ్ గంగూలీ (301), రోహిత్ శర్మ (301), ప్రవీణ్ అమ్రే (299) తర్వాత అత్యధిక బంతులు ఎదుర్కొన్న భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు...