ఆ సమయంలో మళ్లీ ఆడతానని అనుకోలేదు, ఐపీఎల్‌లో అతని వల్లే... రవిచంద్రన్ అశ్విన్ కామెంట్స్...
ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన కాన్పూర్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో మూడు, రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్, ఒకే మ్యాచ్‌లో రెండు రికార్డులు బ్రేక్ చేశాడు...
అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా హర్భజన్ సింగ్ (417 వికెట్లు) రికార్డును అధిగమించిన రవిచంద్రన్ అశ్విన్, అత్యధిక టెస్టు వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గా నిలిచాడు...
భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే (619 టెస్టు వికెట్లు), కపిల్ దేవ్ (434 వికెట్లు) తర్వాత అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా మూడో స్థానంలో నిలిచాడు రవిచంద్రన్ అశ్విన్...
అంతేకాకుండా న్యూజిలాండ్‌పై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా బిషన్ సింగ్ బేడీ 57 వికెట్ల రికార్డును అధిగమించాడు రవిచంద్రన్ అశ్విన్...
‘నిజం చెప్పాలంటే గత రెండేళ్లలో నా జీవితంలో, నా కెరీర్‌లో జరిగిన విషయాలు చూసిన తర్వాత నేను మళ్లీ టెస్టు క్రికెట్ ఆడతానని అనుకోలేదు...
లాక్‌డౌన్, కరోనా విపత్తు కారణంగా చాలా భయాందోళనలకు గురయ్యాను. 2020 ఫిబ్రవరిలో జరిగిన క్రిస్ట్‌చర్చ్ టెస్టులో నేను ఆడలేదు...
ఆ తర్వాత కరోనా కారణంగా క్రికెట్ జరగలేదు. దాదాపు ఏడు నెలలు ఇంట్లోనే గడిపాను. ఆ సమయంలో నేను మళ్లీ క్రికెట్ ఆడతానని అనుకోలేదు...
అప్పటికే వన్డే, టీ20 జట్టులో చోటు కోల్పోయాను. ఇక ఉన్న టెస్టులకి కూడా దూరమైతే క్రికెటర్‌గా నా కెరీర్ ముగిసిపోయేనట్టే అనుకున్నాను...
అయితే దేవుడి పుణ్యాన, పరిస్థితులు చక్కబడ్డాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌కి వచ్చిన తర్వాత శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో ఆడడం చాలా రిలీఫ్‌గా అనిపించింది. ఆ తర్వాత టెస్టుల్లోకి రీఎంట్రీ ఇచ్చాను.. టీ20ల్లోకి కూడా...’ అంటూ చెప్పుకొచ్చాడు రవిచంద్రన్ అశ్విన్...
ఐపీఎల్ పర్ఫామెన్స్ కారణంగా టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి ఎంపికైన రవిచంద్రన్ అశ్విన్, మొదటి రెండు మ్యాచుల్లో ఆడకపోయినా ఆ తర్వాత మూడు మ్యాచుల్లోనూ చక్కగా రాణించాడు...
నాలుగేళ్ల తర్వాత పొట్టి ఫార్మాట్‌లోకి రీఎంట్రీ ఇచ్చినా టీ20 వరల్డ్ కప్ పర్ఫామెన్స్ కారణంగా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కి కూడా ఎంపికై ఆకట్టుకునే పర్ఫామెన్స్ ఇచ్చాడు రవిచంద్రన్ అశ్విన్...
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో నాలుగు వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగు టెస్టుల్లోనూ ఆడలేదు. ఆ సమయంలో కోహ్లీకి, అశ్విన్‌కి గొడవలు జరిగాయని టాక్ వినిపించిన విషయం తెలిసిందే...