Champions Trophy: ఇండియా vs న్యూజిలాండ్.. పిచ్ రిపోర్టు, వాతావరణం వివరాలు ఇవిగో
India vs New Zealand: ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడుతుంది. అయితే, పిచ్ రిపోర్టు, వాతావరణం ఎలా ఉండనుంది? ఇరు జట్ల టీమ్స్ ప్లేయింగ్ 11 వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

India vs New Zealand, Champions Trophy 2025: దుబాయ్‌లో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆదివారం జరిగే చివరి గ్రూప్ A మ్యాచ్‌లో భారత్-న్యూజిలాండ్ తలపడతాయి. ఈ రెండు జట్లు ఇప్పటికే సెమీ-ఫైనల్స్ కు చేరుకున్నాయి. సెమీ-ఫైనల్స్‌కు ముందు జరిగే ఈ మ్యాచ్ లో ఎలాగైనా విజయం సాధించి ముందుకు సాగాలని రెండు జట్లు భావిస్తున్నాయి.
team India, cricket, IND
IND vs NZ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది?
IND vs NZ మ్యాచ్ ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు టాస్‌తో ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్, నెట్‌వర్క్ 18 ఛానెల్‌లలో టీవీలో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. అలగే, JioHotstarలో IND vs NZ మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు.
Team India (Photo:X/@BCCI)
IND vs NZ మ్యాచ్ పిచ్ రిపోర్ట్
దుబాయ్‌లో పిచ్ పగటిపూట బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది, ఎందుకంటే కొత్త బంతి బ్యాట్‌పైకి చక్కగా వస్తుంది. మ్యాచ్ ముందుకు సాగుతున్న సమయంలో అంటే మధ్య ఓవర్లలో స్పిన్నర్ల ప్రభావం ఉంటుంది. బ్యాటర్లు పరుగులు రాబట్టడానికి కష్టపడాల్సి ఉంటుంది. పిచ్ స్లో గా మారుతుంది మ్యాచ్ ముందుకు సాగుతున్న కొద్ది కాబట్టి బ్యాటింగ్ కు కష్టమవుతుంది. వెలుతురులో ఛేజింగ్ కష్టమవుతుంది. అందువల్ల, ముందుగా బ్యాటింగ్ చేసే జట్టు 280 కంటే ఎక్కువ స్కోరును చేస్తే రెండవ ఇన్నింగ్స్‌లో ఛేజింగ్ జట్టుకు గెలుపు అవకాశాలు తక్కువగా ఉంటాయి. టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ ను ఎంచుకునే అవకాశముంది. అయితే, దుబాయ్ లో భారత్, న్యూజిలాండ్ లకు మంచి రికార్డులే ఉన్నాయి.
IND vs NZ మ్యాచ్ - దుబాయ్ వాతావరణం ఎలా ఉండనుంది?
ఆదివారం దుబాయ్ వాతావరణ సూచన ప్రకారం సాధారణంగా ఉంటుంది. ఎండలు అధికంగా ఉండటంతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదుకావచ్చు. వర్షం పడే అవకాశం లేదు కాబట్టి మ్యాచ్ కు ఎలాంటి అంతరాయం కలిగే అవకాశం లేదు.
Image Credit: Getty Images
భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ ప్లేయింగ్ 11 అంచనాలు:
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.
న్యూజిలాండ్: విల్ యంగ్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మాట్ హెన్రీ, కైల్ జామిసన్, విలియం ఓ'రూర్కే.