ఇక రహానే తప్పుకుని, అతనికి అవకాశం ఇవ్వాలి... ముంబై టెస్టులో విరాట్ కోహ్లీకి...
టీమిండియాకి ఎన్నో టెస్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన అజింకా రహానే, ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. మెల్‌బోర్న్ టెస్టులో సెంచరీ తర్వాత అతని నుంచి అలాంటి ఒక్క ఇన్నింగ్స్ కూడా రాలేదు...
టీమిండియా రెగ్యూలర్ టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకోవడంతో వైస్ కెప్టెన్ అజింకా రహానే కెప్టెన్‌గా వ్యవహరించాడు. టెస్టు కెప్టెన్‌గా అద్భుతమైన రికార్డు ఉన్న రహానే, బ్యాట్స్‌మెన్‌గా మాత్రం ఫెయిల్ అయ్యాడు...
మెల్‌బోర్న్ టెస్టులో సెంచరీ చేసి, ఆడిలైడ్ పరాజయం తర్వాత భారత జట్టు కమ్‌బ్యాక్ ఇవ్వడానికి కారణమైన అజింకా రహానే, గత 2019-21 సీజన్ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు...
అయితే ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌తో పాటు ఇంగ్లాండ్ టూర్‌లో చెప్పుకోదగ్గ పరుగులు చేయలేకపోయిన అజింకా రహానే... గత 20 టెస్టుల్లోనూ 20 సగటుతో పరుగులు చేశాడు...
టీమిండియాలో ప్లేస్ ఉండాలంటే తప్పక రాణించాల్సిన పరిస్థితుల్లోనూ కాన్పూర్ టెస్టులో రహానే బ్యాటింగ్ ఫెయిల్యూర్ కొనసాగింది. తొలి ఇన్నింగ్స్‌లో 63 బంతుల్లో 6 ఫోర్లతో 35 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు రహానే...
అయితే రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం మళ్లీ షరా మామూలే. 15 బంతుల్లో 4 పరుగులు చేసి స్పిన్నర్ అజాజ్ పటేల్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు రహానే...
అదీకాకుండా విరాట్ కోహ్లీ గైర్హజరీతో ఐదో స్థానంలో ఆరంగ్రేటం చేసిన శ్రేయాస్ అయ్యర్, తొలి టెస్టులోనే అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేశాడు...
ఆరంగ్రేట టెస్టులో ఓ సెంచరీ, హాఫ్ సెంచరీ చేసిన మొట్టమొదటి భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన శ్రేయాస్ అయ్యర్, అజింకా రహానేకి కొత్త చిక్కులు తెచ్చిపెట్టాడు...
శ్రేయాస్ అయ్యర్ ఫెయిల్ అయి ఉంటే, ముంబై టెస్టులో అతన్ని తప్పించి... ఐదో స్థానంలో వైస్ కెప్టెన్ అజింకా రహానే, నాలుగో స్థానంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కి వచ్చేవాళ్లు...
ఇప్పుడు తొలి టెస్టులో అదరగొట్టిన శ్రేయాస్ అయ్యర్‌కి రెండో టెస్టులో చోటు కల్పించాలంటే అజింకా రహానే లేదా ఛతేశ్వర్ పూజారాలను తప్పించాల్సిన పరిస్థితి...
అజింకా రహానేతో పోలిస్తే ఛతేశ్వర్ పూజారా కాస్త మెరుగ్గానే పరుగులు చేస్తున్నాడు. ఈ ఏడాది రహానే యావరేజ్ 20గా ఉంటే, పూజారా 36 సగటుతో పరుగులు చేశాడు... తొలి టెస్టులోనూ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 26, రెండో ఇన్నింగ్స్‌లో 22 పరుగులు చేశాడు పూజారా...
‘రహానే చాలా అద్భుతమైన ప్లేయర్. కానీ ఇప్పుడు అతను దూకుడుగా ఆడాలని ప్రయత్నించి, అవుట్ అవుతున్నట్టుగా నాకు అనిపిస్తోంది. అతని ఆటలో ఉండే సహజత్వం లోపించింది...
ఇప్పుడున్న పరిస్థితుల్లో శ్రేయాస్ అయ్యర్‌ని తప్పించడం సమంజసం కాదు. ముంబై టెస్టులో విరాట్ కోహ్లీ జట్టులోకి రావాలంటే అజింకా రహానే తప్పుకోవాల్సిందే...
అజింకా రహానేకి కమ్‌బ్యాక్ ఇచ్చే సత్తా, సామర్థ్యం ఉన్నాయి. ముఖ్యంగా టెస్టుల్లో రహానే చాలా టెక్నికల్ ప్లేయర్. రెండో టెస్టులో రహానేని తప్పించనంత మాత్రాన అది అతని కెరీర్‌కి ముగింపు కాదు...
కేవలం ఒక్క టెస్టుకి పక్కనబెట్టినట్టే అవుతుంది. తొలి టెస్టులో సెంచరీ చేసిన అయ్యర్‌లాంటి ప్లేయర్‌ని పక్కనబెట్టలేరు కదా. రహానే తిరిగి తన స్థానాన్ని చేజిక్కుకోగలడు...’ అంటూ చెప్పుకొచ్చాడు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డానియల్ విటోరీ...