MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • వరల్డ్‌ కప్‌లోనే టీమిండియాకి చుక్కలు చూపించిన ఐర్లాండ్... ఐర్లాండ్ టూర్‌ని తేలిగ్గా తీసుకుంటే...

వరల్డ్‌ కప్‌లోనే టీమిండియాకి చుక్కలు చూపించిన ఐర్లాండ్... ఐర్లాండ్ టూర్‌ని తేలిగ్గా తీసుకుంటే...

వరుసగా రెండో ఏడాది రెండు జట్ల ఫార్ములాని ప్రయోగించేందుకు సిద్ధమైంది బీసీసీఐ. ఇంతకుముందు విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత ప్రధాన జట్టు ఇంగ్లాండ్ టూర్‌కి వెళితే, శిఖర్ ధావన్ కెప్టెన్సీలో మరో జట్టు శ్రీలంకలో పర్యటించింది. ఇప్పుడు రోహిత్ కెప్టెన్సీలో మెయిన్ టీమ్ ఇంగ్లాండ్‌లో ఉంటే, మరో జట్టు హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలో ఐర్లాండ్‌లో పర్యటిస్తోంది...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jun 24 2022, 06:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

జూన్ 26న, జూన్ 28న ఐర్లాండ్‌తో డబ్లీన్‌తో రెండు టీ20 మ్యాచుల సిరీస్ ఆడనుంది భారత జట్టు. ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆకట్టుకున్న యంగ్ ప్లేయర్లతో పాటు దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, సంజూ శాంసన్ వంటి సీనియర్లు ఈ టూర్‌లో కీలక పాత్ర పోషించబోతున్నారు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

క్రికెట్ ప్రపంచంలో పసికూనగా గుర్తింపు తెచ్చుకున్న ఐర్లాండ్‌ని తేలిగ్గా తీసుకోవచ్చా? వాస్తవానికి ఐర్లాండ్ ఈ మధ్య కాలంలో పెద్దగా అదిరిపోయే పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్నా 2007 వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌ని ఓడించి, దాయాది టీమ్‌కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది...  సూపర్ 12 రౌండ్‌లోకి అర్హత సాధించిన ఐర్లాండ్, అత్యుత్తమ పర్ఫామెన్స్ నమోదు చేసింది.

38

ఆ తర్వాత 12 ఏళ్లకు 2019 వన్డే వరల్డ్ కప్‌లోనూ ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్, సగటు టీమిండియా అభిమాని గుండెల్లో రైళ్లు పరుగట్టేలా చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్, 15 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 89 పరుగులు చేయడం, 39 ఓవర్లు ముగిసే సమయానికి 206/4 పరుగులు చేయడంతో అందరూ అవాక్కయ్యారు.

48

అయితే ఆ తర్వాత వరుస వికెట్లు కోల్పోయిన ఐర్లాండ్ జట్టు 49 ఓవర్లలో 259 పరుగులకి ఆలౌట్ అయ్యింది. రోహిత్ శర్మ 64, శిఖర్ ధావన్ 100, విరాట్ కోహ్లీ 44, అజింకా రహానే 33 పరుగులు చేయడంతో 36.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి ఘన విజయం అందుకుంది టీమిండియా...

58

2018లోనూ ఐర్లాండ్‌లో పర్యటించింది భారత జట్టు. ఆ పర్యటనలో రెండింట్లోనూ ఘన విజయాలు అందుకుంది ఐర్లాండ్. రోహిత్ 97, శిఖర్ ధావన్ 74 పరుగులు చేయడంతో 20 ఓవర్లలో 208 పరుగులు చేసింది భారత జట్టు. రైనా 10, ధోనీ 11, హార్ధిక్ పాండ్యా 6 పరుగులు చేయగా ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి డకౌట్ అయ్యాడు... కుల్దీప్ యాదవ్ 4, యజ్వేంద్ర చాహాల్ 3 వికెట్లు తీయడంతో ఐర్లాండ్ 132 పరుగులకి పరిమితమై 76 పరుగుల తేడాతో ఓడింది.

68

రెండో టీ20లో విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ ఓపెనింగ్ వచ్చారు. కెఎల్ రాహుల్ 36 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 70 పరుగులు చేయగా విరాట్ కోహ్లీ 9 పరుగులకే అవుట్ అయ్యాడు. సురేష్ రైనా 45 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 69 పరుగులు చేయగా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు...

78

మనీశ్ పాండే 21, హార్ధిక్ పాండ్యా 9 బంతుల్లో ఓ ఫోర్, 4 సిక్సర్లతో 32 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. భారత జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. ఐర్లాండ్ 12.3 ఓవర్లలో 70 పరుగులకి ఆలౌట్ అయ్యింది. యజ్వేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్ మూడేసి వికెట్లు తీయగా ఉమేశ్ యాదవ్ 2 వికెట్లు తీశాడు. 

88

ఇప్పటిదాకా ఐర్లాండ్, టీమిండియా మధ్య మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచులు జరగగా అన్నింట్లోనూ భారత జట్టు విజయాలు అందుకుంది. అయితే తేలిగ్గా తీసుకుంటే మాత్రం టీమిండియాకి చుక్కలు చూపించగల సత్తా ఉన్న జట్టు ఐర్లాండ్... 

About the Author

CR
Chinthakindhi Ramu
Latest Videos
Recommended Stories
Recommended image1
Lalit Modi: డైమండ్స్ క్వీన్.. సుస్మితా సేన్ సీక్రెట్ లవ్ స్టోరీ బయటపెట్టిన లలిత్ మోదీ !
Recommended image2
Team India Schedule: ఐపీఎల్ అయిపోయింది.. అసలు ఆట ఇప్పుడే మొదలైంది! 2027 వరల్డ్ కప్ దాకా భారత్‌కు నో రెస్ట్
Recommended image3
IPL 2026 Most Runs: ఐపీఎల్ 2026లో అత్యధిక రన్స్ చేసిన టాప్ 5 బ్యాటర్లు వీరే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved