- Home
- Sports
- Cricket
- 50 యావరేజ్, 140 స్ట్రైయిక్ రేటు.. అయినా తప్పిస్తారా! మంచిది... కపిల్‌దేవ్‌కి ఉస్మాన్ ఖవాజా కౌంటర్...
50 యావరేజ్, 140 స్ట్రైయిక్ రేటు.. అయినా తప్పిస్తారా! మంచిది... కపిల్‌దేవ్‌కి ఉస్మాన్ ఖవాజా కౌంటర్...
మూడు ఫార్మాట్లలోనూ పరుగుల వరద పారించిన విరాట్ కోహ్లీ అవసరం ఇప్పుడు టీమిండియాకి లేదంటున్నారు చాలా మంది మాజీ క్రికెటర్లు, క్రికెట్ ఎక్స్‌పర్ట్స్.. 2022 సీజన్‌లో విరాట్ నుంచి ఆశించిన పర్పామెన్స్ రాకపోవడం, కోహ్లీ లేని మ్యాచుల్లో జట్టులోకి వచ్చిన రిజర్వు ప్లేయర్లు అదరగొట్టడంతో టీ20ల్లో కోహ్లీ ప్లేస్‌పై పెద్ద చర్చే జరుగుతోంది...

2022 సీజన్‌లో టీమిండియా తరుపున 16 టీ20 మ్యాచులు ఆడిన విరాట్కోహ్లీ 27 సగటుతో 432 పరుగులు చేశాడు. ఇందులో 4 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి...
Image credit: Getty
అయితే ఒక్క మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేస్తే, ఆ తర్వాత రెండు మ్యాచుల్లో సింగిల్ డిజిట్ స్కోరుకే అవుట్ అవుతున్నాడు విరాట్ కోహ్లీ. టాపార్డర్‌లో విరాట్ కోహ్లీ ఫెయిల్యూర్, టీమిండియాకి పెద్ద ఇబ్బందిగా మారింది...
తాను టీమిండియా మేనేజ్‌మెంట్‌లో ఉంటే విరాట్ కోహ్లీని టీ20 టీమ్‌కి ఎంపిక చేయనని భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా కామెంట్ చేశాడు. ఇప్పుడు టీ20 టీమ్‌కి కోహ్లీ అవసరం లేదని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు...
‘టెస్టుల్లో నెం.2గా ఉన్న బౌలర్ రవిచంద్రన్ అశ్విన్‌ని పక్కనబెట్టి బరిలో దిగిన భారత జట్టు, టీ20ల్లో విరాట్ కోహ్లీని పక్కనబెట్టడంలో తప్పేం ఉంది. కేవలం ప్లేయర్ల పేరు, ప్రతిష్టల కారణంగా ఎన్ని రోజులు ఆడించగలం...
ప్లేయర్ల ప్రస్తుత ఫామ్‌ని దృష్టిలో పెట్టుకుని టీమ్‌ని సెలక్ట్ చేయాలి. రెండు మ్యాచుల్లో ఫెయిల్ అయితే పర్వాలేదు, వరుసగా ఫెయిల్ అవుతూ ఉంటే ఏ ప్లేయర్‌ని కొనసాగిస్తూ రావాల్సిన అవసరం లేదు...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్...
కపిల్ దేవ్ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ). ఐసీసీ పోస్టుపై స్పందించిన ఆస్ట్రేలియా బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా.. ‘యావరేజ్ 50, స్ట్రైయిక్ రేటు 140 దాకా ఉంది. అయినా పక్కనబెడతారా? గుడ్ కాల్.. ఆస్ట్రేలియా దీన్ని కచ్ఛితంగా అంగీకరిస్తుంది...’ అంటూ కామెంట్ చేశాడు...
భారత క్రికెటర్ విరాట్ కోహ్లీకి స్వదేశంలో కంటే విదేశాల్లో ఎక్కువ ఫాలోవర్లు ఉన్నారు. విరాట్ ప్లేయర్‌గా, కెప్టెన్‌గా ఏం చేయగలడో మనవాళ్ల కంటే ఫారిన్ ప్లేయర్లకే ఎక్కువగా తెలుసని ఉస్మాన్ ఖవాజా కామెంట్‌తో మరోసారి అర్థమయ్యిందని అంటున్నారు కోహ్లీ ఫ్యాన్స్...