ఆస్ట్రేలియాను ఫాలో అవుతున్న టీమిండియా... ఇంగ్లాండ్ సిరీస్‌లో నలుగురిలో ముగ్గురు మనవాళ్లే...
కరోనా వైరస్ కారణంగా క్రికెట్‌లో అనేక మార్పులు సంభవించాయి. ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియాల్లో మ్యాచులు నిర్వహిస్తూ ఉంటే... క్రికెటర్లు బయటకి వెళ్లకుండా హోటల్ గదులకే పరిమితం కావాల్సి వస్తోంది. అంతేనా ఆటను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తే అంపైర్ల విషయంలో కరోనా అనేక సమస్యలు తెచ్చింది.
ఆస్ట్రేలియా పర్యటనలో చాలా నిర్ణయాలు ఆసీస్ టీమ్‌కి అనుకూలంగా వచ్చాయి. రెండో టెస్టులో టిమ్ పైన్ రనౌట్ విషయంలో దుమారం రేగిన సంగతి తెలిసిందే...
నాలుగు టెస్టుల సిరీస్‌లో అంపైర్ల నిర్ణయాలు భారత జట్టుకు పెద్ద చేటు చేయకపోయినా... అనేక సార్లు ఇబ్బందులకు గురి చేశాయి.
దీనికి కారణం ఈ మ్యాచులకు అంపైరింగ్ చేసిన వాళ్లు ఆస్ట్రేలియన్లే కావడం కూడా ఓ కారణమని చాలామంది నెటిజన్లు విమర్శించారు...
కరోనా నిబంధనల కారణంగా ప్రయాణ సమస్యలతో పాటు క్వారంటైన్ రూల్ అమలులో ఉండడం ఈ కష్టానికి కారణం.
కరోనా రూల్స్ కారణంగా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో నిర్వహించే మ్యాచులకు స్థానిక అంపైర్లను నియమించే అవకాశం కల్పించింది ఐసీసీ...
ఈ రూల్ కారణంగానే ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి టెస్టులో పురుషుల క్రికెట్‌లో తొలిసారి ఓ మహిళా అంపైర్ విధులు నిర్వహించిన విషయం తెలిసిందే.
స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరగబోతున్న నాలుగు టెస్టులు సిరీస్‌కి ముగ్గురు భారత అంపైర్లు విధులు నిర్వహించబోతున్నారు... అయితే వీరిలో ఇద్దరు తొలిసారి టెస్టుల్లో అంపైరింగ్ చేయబోతున్నారు...
ఐసీసీ ఎలైట్ ప్యానెల్‌లోని నితిన్ మీనన్‌తో పాటు వీరేందర్ శర్మ, అనిల్ చౌదరి... నాలుగు టెస్టుల సిరీస్‌కు అంపైర్లుగా వ్యవహారించబోతున్నారు...
వీరిలో నితిన్ మీనన్‌కి 24 వన్డేలు, 16 టీ20 మ్యాచులతో పాటు మూడు టెస్టులకి అంపైరింగ్ చేసిన అనుభవం ఉండగా.. వీరేందర్ శర్మ రెండు వన్డేలు, ఓ టీ20, అనిల్ చౌదరి 20 వన్డేలు, 28 టీ20లకు అంపైరింగ్ చేశారు...
మొదటి రెండు టెస్టులు చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగబోతున్న సంగతి తెలిసిందే.
ఇందుకోసం ఇప్పటికే ఇరుజట్ల ఆటగాళ్లు చెన్నై చేరుకుని, అక్కడి లీలా ప్యాలెస్ హోటెల్‌లో క్వారంటైన్‌లో గడుపుతున్నారు. వీరితో పాటే అంపైర్లు, సహాయక సిబ్బంది కూడా క్వారంటైన్‌లో ఉన్నారు...