MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Cricket
  • IND vs BAN: బంగ్లాపై భారత్ గురి.. గెలుపు మనదే.. ఎందుకంటే?

IND vs BAN: బంగ్లాపై భారత్ గురి.. గెలుపు మనదే.. ఎందుకంటే?

India vs Bangladesh: ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్ తో తన తొలి మ్యాచ్ లో భారత్  తలపడుతుంది. గతంలో రెండుసార్లు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత్, ఈసారి కూడా గెలవాలని చూస్తోంది. 

3 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Feb 20 2025, 10:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Image Credit: Getty Images

Image Credit: Getty Images

India vs Bangladesh: ఐసీసీ మెన్స్ క్రికెట్ ప్రపంచ కప్ 2023ఫైనలిస్ట్, గత ఏడాది ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచ కప్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో సత్తా చాటాలని చూస్తోంది. ఎలాగైనా మిని వరల్డ్ కప్ గా గుర్తింపు పొందిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవాలని టోర్నీలో అడుపెడుతోంది. తన తొలి మ్యాచ్ టీమిండియా బంగ్లాదేశ్ తో ఆడనుంది. బంగ్లాపై గెలిచి శుభారంభం చేయాలని చూస్తోంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Image Credit: Getty Images

Image Credit: Getty Images

భారత జట్టు బలం వారే

ఈసారి రోహిత్ శర్మ జట్టులో కీలక బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లేడు. ఇది భారత్ కు పెద్ద దెబ్బని చెప్పాలి. అయితే, మిగతా బౌలింగ విభాగానికి తోడుగా బలమైన బ్యాటింగ్ విభాగం భారత్ అవకాశాలను మెగుగైన స్థితిలో ఉంచుతున్నాయి. ఈ మెగా టోర్నీకి ముందు విరాట్ కోహ్లీ ఫామ్ లోకి  రావడం కూడా భారత్ కు అనుకూలించే అంశం. విరాట్ కోహ్లీ బ్యాట్ పనిచేస్తే ఐసీసీ టోర్నమెంట్లలో అతన్ని అడ్డుకోవడం ఏ జట్టుకైనా కష్టమే కాబట్టి భారత్ కింగ్ కోహ్లీపై భారీ అంచనాలే పెట్టుకుంది. 

కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ ఇటీవల ఇంగ్లాండ్ పై అద్భుతమైన బ్యాటింగ్ తో సెంచరీలు సాధించి ఫామ్ ను అందుకున్నారు. శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా కూడా అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు. విరాట్ కోహ్లీ బ్యాట్ నుండి అర్ధ సెంచరీ కనిపించింది. అలాగే, స్పిన్ బౌలింగ్ పై కూడా రోహిత్ శర్మ నమ్మకం పెట్టుకున్నారు. 

 

34
Indian Fans

Indian Fans

బంగ్లాదేశ్ కూడా స్పిన్ బాగా ఆడగలదు. పెద్ద టోర్నీల్లో సంచలనం సృష్టించగలదు. 2007లో భారత్ పై గెలిచిన స్ఫూర్తితో బరిలోకి దిగుతోంది. అనుభవమున్న ఆటగాళ్లు రాణిస్తారని ఆశిస్తోంది.

ఇరు జట్ల ప్రదర్శనలు, రీసెంట్ ఫామ్ ఎలా ఉంది? 

భారత్: ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లో భారత్ అద్భుతమైన ప్రదర్శనతో సిరీస్ ను కైవసం చేసుకుంది. మంచి ఫామ్ లో ఉంది. ఇటీవల ముగిసిన వన్డే సిరీస్ లో 3-0తో  ఇంగ్లాండ్ ను వైట్ వాష్ చేసింది. అంతకుముందు, ఐదు మ్యాచ్ ల T20I సిరీస్ లో ఇంగ్లాండ్ ను 4-1తో ఓడించింది. గత నెలలో ఏడు విజయాలు సాధించింది. ఇది జట్టుకు బలమైన నమ్మకాన్ని ఇస్తుంది.

బంగ్లాదేశ్: బంగ్లాదేశ్ ఫామ్ అంచనా వేయడం కష్టం. డిసెంబర్ నుంచి క్రికెట్ ఆడలేదు. వెస్టిండీస్ పర్యటనలో 3-0 తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత జరిగిన టీ20 సిరీస్ ను గెలుచుకుంది. నవంబర్ లో యూఏఈలో ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన వన్డే సిరీస్ లో 2-1తో ఓడిపోయింది. కానీ, ఈ జట్టులోని ప్లేయర్లు రాణిస్తే ఎలాంటి జట్టుపైన అయిన సంచలనాలు సాధించగల టీమ్. 

వీరిపైనే అందరి చూపు:

టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా లేకపోవడంతో అర్ష్ దీప్ సింగ్ బౌలింగ్ పై ఎక్కువ దృష్టి ఉంటుంది. 26 ఏళ్ల అర్ష్ దీప్ సింగ్ కొత్త బంతితో రాణిస్తాడు. అతను బుమ్రా స్థానాన్ని భర్తీ చేయగలడు. అయితే, టీ20 క్రికెట్ లో దుమ్మురేపే బౌలింగ్ తో అదరగొట్టిన అర్ష్ దీప్ సింగ్ కు వన్డేల్లో పెద్దగా అనుభవం లేదు. అతను 9 వన్డేల్లో 23.00 సగటుతో 14 వికెట్లు తీశాడు.

ఇక బంగ్లాదేశ్ విషయానికి వస్తే మెహిదీ హసన్ మిరాజ్.. 27 ఏళ్ల ఈ ఆల్ రౌండర్ మంచి ఫామ్ లో ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో రాణించాలంటే అతను అన్ని విభాగాల్లోనూ సత్తా చాటాలి. వెస్టిండీస్ పర్యటనలో 3 వన్డేల్లో 50.66 సగటుతో 152 పరుగులు చేశాడు. టీ20 సిరీస్ లో 8 వికెట్లు తీశాడు. అతనిపై బంగ్లా టీమ్ భారీ అంచనాలే పెట్టుకుంది. 

44
Champions Trophy

Champions Trophy

IND vs BAN: ఇప్పటివరకు భారత్ దే పై చేయి 

భారత్-బంగ్లాదేశ్ టీమ్స్ 41 వన్డే మ్యాచ్‌లు ఆడాయి. ఈ మ్యాచ్‌లలో భారత జట్టు 32 విజయాలు సాధించగా, బంగ్లాదేశ్ జట్టు 8 విజయాలు సాధించింది. ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు. ఇక దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్ జట్టు వన్డే ఫార్మాట్‌లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడింది. అందులో 5 విజయాలు సాధించగా, ఒక మ్యాచ్ టై అయింది.

ఛాంపియన్స్ ట్రోఫీ: భారత్-బంగ్లాదేశ్ జట్లు 

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్ దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.

బంగ్లాదేశ్: నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), సౌమ్య సర్కార్, తంజిద్ హసన్, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, ఎండీ మహ్ముదుల్లా, జాకెర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్, రిషద్ హొస్సేన్, టాస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, నసుమ్ అహ్మద్, తంజిమ్ హసన్ సాకిబ్, నహీద్ రాణా.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
పాకిస్తాన్
విరాట్ కోహ్లీ
రోహిత్ శర్మ
వాతావరణం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved