విరాట్ కోహ్లీ కాదు, ధోనీ తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అతనే బెస్ట్ కెప్టెన్... అజింకా రహానే లేని లోటు..
టీమిండియా మోస్ట్ సక్సెస్‌ఫుల్ టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ. 68 టెస్టుల్లో 40 విజయాలు అందుకున్న విరాట్ కోహ్లీ, మోస్ట్ సక్సెస్‌ఫుల్ వరల్డ్ టెస్టు కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉన్నా, దాన్ని మిస్ చేసుకున్నాడు... అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కాదు...
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 13 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించిన మహేంద్ర సింగ్ ధోనీ, 8 టెస్టు విజయాలు అందుకున్నాడు. భారత్‌లో ఆసీస్‌ను 4-0 తేడాతో వైట్ వాష్ చేసిన ధోనీ, 2014లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మధ్యలోనే టెస్టులకు రిటైర్మెంట్ ఇచ్చాడు....
మహేంద్ర సింగ్ ధోనీకి ముందు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక టెస్టు విజయాలు అందుకున్న భారత కెప్టెన్ సౌరవ్ గంగూలీ. దాదా కెప్టెన్సీలో 9 టెస్టులు ఆడిన భారత జట్టు, 3 విజయాలు అందుకుంది. ఈ మూడు విజయాల్లో రెండు స్వదేశంలో రాగా, 2003-04 ఆస్ట్రేలియా పర్యటనలో ఆడిలైడ్‌లో టెస్టు గెలిచాడు గంగూలీ...
విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 10 టెస్టులు ఆడిన భారత జట్టు. ధోనీ గాయపడడంతో 2014 ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్టులో తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు విరాట్ కోహ్లీ. ఈ మ్యాచ్‌లో 361 పరుగులు టార్గెట‌్‌తో బరిలో దిగిన భారత జట్టు, 48 పరుగుల తేడాతో ఓడింది...
2016-17 స్వదేశంలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 2 టెస్టులు నెగ్గిన విరాట్ కోహ్లీ, 2018-19 ఆస్ట్రేలియా పర్యటనలో ఓ టెస్టు నెగ్గాడు. ఆడిలైడ్ టెస్టు పరాజయం తర్వాత పెటర్నిటీ లీవ్ ద్వారా స్వదేశానికి తిరిగి వచ్చేశాడు విరాట్ కోహ్లీ..
టెస్టు కెప్టెన్‌గా ఒక్క పరాజయం కూడా ఎదురుకోని అజింకా రహానే, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 4 టెస్టులకు కెప్టెన్సీ చేసి 3 విజయాలు అందుకున్నాడు. మోస్ట్ సక్సెస్‌ఫుల్ విన్నింగ్ పర్సెంటేజ్ ఉన్న కెప్టెన్ కూడా అజింకా రహానేనే...
2017లో ధర్మశాలలో జరిగిన నాలుగో టెస్టుకి కెప్టెన్సీ చేసిన అజింకా రహానే, ఆ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకున్నాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ పెటర్నిటీ లీవ్ ద్వారా స్వదేశానికి వచ్చేయడంతో 2020-21 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి కెప్టెన్‌గా వ్యవహరించాడు...
Image credit: PTI
మెల్‌బోర్న్ టెస్టులో సెంచరీ చేసి భారత జట్టుకి ఘన విజయం అందించాడు అజింకా రహానే. ఆ తర్వాత బ్రిస్బేన్ టెస్టులోనూ చారిత్రక విజయం అందించాడు. సిడ్నీలో జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది.
అజింకా రహానే మరో టెస్టుకి కెప్టెన్సీ చేసి గెలిచి ఉంటే, ధోనీ తర్వాత అత్యధిక విజయాలు అందుకున్న భారత కెప్టెన్‌గా నిలిచేవాడు.. అయితే పేలవ ఫామ్‌తో రహానేని తుది జట్టు నుంచి తప్పించింది బీసీసీఐ.