- Home
- Sports
- Cricket
- నాకు సెంచరీ వద్దు! లేక లేక బిర్యానీ దొరికింది... 200-250 కొట్టేయ్! విరాట్ కోహ్లీపై సునీల్ గవాస్కర్...
నాకు సెంచరీ వద్దు! లేక లేక బిర్యానీ దొరికింది... 200-250 కొట్టేయ్! విరాట్ కోహ్లీపై సునీల్ గవాస్కర్...
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మొదటి మూడు మ్యాచులు చప్పగా సాగిన తర్వాత అహ్మదాబాద్ టెస్టు అసలు సిసలు మజాని అందిస్తోంది. ఆస్ట్రేలియా మొదటి 2 రోజులు బ్యాటింగ్ చేసి 480 పరుగులు చేయగా టీమిండియా ధీటుగా బదులిచ్చే దిశగా పరుగులు పెడుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 283 పరుగులు చేసిన భారత జట్టు, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకి 191 పరుగుల దూరంలో ఉంది...

Virat Kohli
మొదటి 3 టెస్టుల్లో హాఫ్ సెంచరీ మార్కును అందుకోలేకపోయిన విరాట్ కోహ్లీ, నాలుగో టెస్టులో 59 పరుగులు చేశాడు. టెస్టు క్రికెట్‌లో 424 రోజుల తర్వాత వచ్చిన 50+ స్కోరు ఇది. చివరిగా టెస్టు కెప్టెన్‌గా ఉన్నప్పుడు సౌతాఫ్రికా టూర్‌లో హాఫ్ సెంచరీ చేశాడు విరాట్ కోహ్లీ...
Virat Kohli
బ్యాటింగ్‌కి అనుకూలిస్తున్న పిచ్ మీద బంతి చక్కగా బ్యాటుపైకి వస్తోంది. దీంతో విరాట్ కోహ్లీ ఈ అవకాశాన్ని వాడుకుని మూడున్నరేళ్లుగా అందకుండా ఊరిస్తున్న టెస్టు సెంచరీని పూర్తి చేసుకోవాలని కోరుకుంటున్నారు అభిమానులు... అయితే టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాత్రం మరోలా స్పందించాడు..
‘పిచ్ ఎలా ప్రవర్తిస్తుందో చూసిన తర్వాత విరాట్ కోహ్లీ వచ్చి హాఫ్ సెంచరీ చేశాడు. అయితే ఈ హాఫ్ సెంచరీని డబుల్ సెంచరీగా మలిస్తే బాగుంటుంది. అది జరిగితే టీమిండియాకి మొదటి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం దక్కుతుంది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాని త్వరగా ఆలౌట్ చేసి గెలిచే ఛాన్స్ ఉంటుంది..
Virat Kohli
ఆకలితో అలమటిస్తూ, తినడానికి ఏదైనా దొరుకుతుందా? అని వెతుకుతున్న వాడికి బిర్యానీ దొరికితే ఎలా ఉంటుంది... దాన్ని అలా వదిలేస్తాడా? కొన్నేళ్లుగా విరాట్ కోహ్లీ టెస్టుల్లో సెంచరీ చేయలేదు. కాబట్టి ఇప్పుడు అతను 250 కొడితే ఆ లెక్క సరిపోతుంది...’ అంటూ కామెంట్ చేశాడు సునీల్ గవాస్కర్..
Virat Kohli
2020 జనవరిలో విరాట్ కోహ్లీ టెస్టు సగటు 58కి పైగా ఉండేది. టెస్టుల్లో 27 సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, అప్పటికి 25 హాఫ్ సెంచరీలు మాత్రమే చేశాడు... అప్పటికి హాఫ్ సెంచరీల కంటే సెంచరీలు ఎక్కువున్న ప్లేయర్ కూడా కోహ్లీయే. అయితే ఆ తర్వాత కోహ్లీ పర్ఫామెన్స్ పడిపోతూ వచ్చింది...
Image credit: PTI
2023 మార్చి సమయానికి విరాట్ కోహ్లీ టెస్టు సగటు 48కి దిగజారింది. ఈ మూడేళ్లలో జో రూట్ 12 సెంచరీలు బాదితే, స్టీవ్ స్మిత్ 5 సెంచరీలు చేశాడు. విరాట్ కోహ్లీ మాత్రం ఒక్క సెంచరీ అందుకోలేక 27 టెస్టు సెంచరీల దగ్గరే ఆగిపోయాడు..