బ్రిస్బేన్ టెస్టు : అందరిచూపు రోహిత్, కోహ్లీల పైనే
India vs Australia Brisbane Gabba Test : బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మూడో మ్యాచ్ బ్రిస్బేన్ లోని గబ్బా వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ లో రోహిత్, కోహ్లీలు రాణిస్తారా? ఆసీస్ కు భారత్ షాకిస్తుందా?
BCCI/X
ప్రస్తుతం టీమిండియా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఏం చేస్తారోననే చర్చ క్రికెట్ సర్కిల్ లో నడుస్తోది. ఎందుకంటే క్రికెట్ లో పరుగులు వరద పారించి ఎన్నో రికార్డులు సాధించిన ఈ ప్లేయర్లు ఇప్పుడు ఫామ్ తో ఇబ్బంది పడుతున్నారు. పరుగులు చేయడానికి, బౌలర్లను ఎదుర్కొవడానికి తీవ్రంగా కష్టపడుతున్నారు. అయితే, వీరి బ్యాచ్ నుంచి కొన్ని టెస్టుల నుంచి పెద్ద ఇన్నింగ్స్ రావడం లేదు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 టెస్టు సిరీస్‌లోని మూడో మ్యాచ్ శనివారం బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ లో అందరి చూపు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలపైనే ఉంది. సిరీస్ 1-1తో సమంగా ఉండటంతో ఐదు మ్యాచ్ ల సిరీస్ ఫలితాన్ని మార్చడంతో పాటు ప్రస్తుత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టు స్థానంలో బ్రిస్బేన్ టెస్టు కీలక పాత్ర పోషించనుంది.
Getty Images
ట్రావిస్ హెడ్ తోనే భారత్ కు తలనొప్పి
భారత్‌కు, కీలకమైన ఆంశం ఆస్ట్రేలియా బ్యాటింగ్ బలహీనతను దెబ్బకొట్టడం. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో ఉన్న ట్రావిస్ హెడ్ ను తక్కువ స్కోర్ కే పరిమితం చేస్తే ఆసీస్ జట్టు పెద్దగా పరుగులు చేయలేకపోవచ్చు. కోహ్లీ మాదిరిగానే స్టీవ్ స్మిత్ తో పాటు పలువురు ఆసీస్ ప్లేయర్లు ఈ సిరీస్‌లో పరుగులు చేయడానిక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మన బౌలింగ్ విభాగం బాగా పనిచేస్తే ఆసీస్ పెద్ద స్కోర్లు చేయడం కష్టమే. కాబట్టి ఇది భారత్ కు అనుకూలించే అశం.
Getty Images
బుమ్రా బౌలింగ్ మెరుపులు.. రోహిత్-కోహ్లీలు బ్యాట్ కు పనిచెప్తారా?
బౌలింగ్ విషయానికొస్తే, భారత్ జట్టు బౌలింగ్ విభాగాన్ని జస్ప్రీత్ బుమ్రా తన భుజాలపై వేసుకున్నాడు. అతను సిరీస్‌లోని అందరు బౌలర్‌లను అధిగమించాడు. అద్భుతమైన బౌలింగ్ తో ఆసీస్ కు చుక్కలు చూపిస్తున్నాడు. బ్రిస్బేన్ టెస్టులో కూడా అదే జోరును కొనసాగించాలని చూస్తున్నాడు.
బుమ్రాకు మరోవైపు నుంచి అవసరమైన సాయం భారత స్టార్ బ్యాటర్లు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, రన్ మిషన్ విరాట్ కోహ్లీల బ్యాట్ నుంచి పరుగులు రావడం. ఈ సిరీస్ లో ఇప్పటివరకు ఈ ఇద్దరు స్టార్ల నుంచి పెద్ద స్కోర్ల ఇన్నింగ్స్ లు రాలేదు. ఇది భారత్ కు ప్రతికూలంగా మారుతున్న అంశం. దీంతో బ్రిస్బేన్ లో ఏం చేస్తారనేది ఆసక్తిని పెంచుతోంది.
Getty Images
రోహిత్-కోహ్లీలు గబ్బాను హీటెక్కిస్తారా?
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల ప్రస్తుత ఫామ్ పై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సీనియర్ స్టార్ ప్లేయర్లు గత కొన్ని టెస్టులుగా పెద్దగా పరుగులు చేయడం లేదు. దీంతో వీరిపై విమర్శలతో పాటు టెస్టు క్రికెట్ రిటైర్మెంట్ అశం తెరమీదకు వస్తోంది. అయితే, గబ్బాలో అదరిపోయే ఇన్నింగ్స్ లతో ఫామ్ ను అందుకోవాలని చూస్తున్నారు. ఎందుకంటే వీరికి గబ్బా కలిసొచ్చిన వేదిక. ఇదివరకు ఇక్కడ మెరుగైన ఇన్నింగ్స్ లను ఆడారు. 2021లో ఇక్కడ అద్భుతన ప్రదర్శన చేసిన భారత జట్టు ఇప్పుడు కూడా అదే తరహా తో ముందుకు నడిపించాలని ఈ ఇద్దరు స్టార్లు లక్ష్యంగా పెట్టుకున్నారు.