MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Cricket
  • ఆసియా కప్ 2025: జెర్సీ స్పాన్సర్ లేకుండా ఆడనున్న టీమిండియా?

ఆసియా కప్ 2025: జెర్సీ స్పాన్సర్ లేకుండా ఆడనున్న టీమిండియా?

Team India: డ్రీమ్11 కంపెనీ టీమిండియా జెర్సీ స్పాన్సర్‌షిప్ నుంచి తప్పుకోవడంతో, 2025 ఆసియా కప్‌లో భారత జట్టు స్పాన్సర్ లేని జెర్సీతో బరిలోకి దిగనుంది. ఆన్‌లైన్ గేమింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 2025 కారణంగా డ్రీమ్11 ఈ నిర్ణయం తీసుకుంది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 31 2025, 11:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
స్పాన్సర్ లేని టీం ఇండియా!
Image Credit : ANI

స్పాన్సర్ లేని టీం ఇండియా!

ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లో జరుగనుంది. ఇది 17వ  మెన్స్ టీ20 ఆసియా కప్ టోర్నీ. మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. 19 మ్యాచ్‌లు జరగనున్నాయి.

అయితే, టీమిండియా జెర్సీ స్పాన్సర్ అయిన డ్రీమ్11 వైదొలగడంతో, వచ్చే నెలలో ప్రారంభం కానున్న 2025 ఆసియా కప్‌లో ప్లేయర్లు ప్రధాన స్పాన్సర్ లోగో లేని జెర్సీలు ధరించి ఆడనున్నారు.

DID YOU
KNOW
?
ఆసియా కప్ లో భారత్
ఆసియా కప్ లో భారత్ ఇప్పటివరకు 8 సార్లు ఛాంపియన్ గా నిలిచింది. ఈ టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్టుగా కొనసాగుతోంది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
డ్రీమ్11 వైదొలగడానికి కారణమేంటి?
Image Credit : Getty

డ్రీమ్11 వైదొలగడానికి కారణమేంటి?

గత వారం పార్లమెంట్‌లో ఆమోదం ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదం పొందిన "ఆన్‌లైన్ గేమింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 2025" కారణంగా డ్రీమ్11 భారత్ ప్రధాన స్పాన్సర్ నుంచి తప్పుకుంది. ఎందుకంటే ఈ యాక్ట్ ప్రకారం మనీతో సంబంధం ఉన్న ఆన్ లైన్ గేమ్స్ ను నిర్వహించకూడదు. డ్రీమ్ 11 తమ వెబ్‌సైట్‌లో డబ్బుతో కూడిన ఆన్‌లైన్ గేమింగ్ పోటీలను నిలిపివేస్తున్నట్లు కూడా ప్రకటించింది.

"కొత్త చట్టం కారణంగా, డ్రీమ్11 లేదా అలాంటి ఇతర గేమింగ్ కంపెనీలతో బీసీసీఐ ఒప్పందాన్ని కొనసాగించడం కష్టం. అందుకే ఒక అడ్డంకి వచ్చింది. డ్రీమ్11తో ఒప్పందం కొనసాగుతుందని నేను అనుకోవడం లేదు. వేరే మార్గం ఏమైనా ఉందా అని చూస్తున్నాం" అని బీసీసీఐ కార్యదర్శి సైకియా తెలిపారు.

35
కొత్త స్పాన్సర్ కోసం చూస్తున్న బీసీసీఐ
Image Credit : Getty

కొత్త స్పాన్సర్ కోసం చూస్తున్న బీసీసీఐ

ఈ క్రమంలోనే బీసీసీఐ అధ్యక్షుడు రాజీవ్ శుక్లా నాయకత్వంలో గురువారం అత్యవసర సమావేశం జరిగింది. కొత్త స్పాన్సర్ కోసం వెతకడం గురించి చర్చించారు. అయితే, దీని కోసం ఎలాంటి గడువును నిర్ణయించలేదు. సెప్టెంబర్ 9న ఆసియా కప్ ప్రారంభం కానున్నందున, అప్పటిలోగా కొత్త స్పాన్సర్ ఒప్పందం కుదరడం కష్టమని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.

45
డ్రీమ్11 కంపెనీ ఒప్పందం
Image Credit : Getty

డ్రీమ్11 కంపెనీ ఒప్పందం

డ్రీమ్11 కంపెనీ, 2023 జూలైలో, బైజూస్ స్థానంలో టీం ఇండియా ప్రధాన స్పాన్సర్‌గా, మూడు సంవత్సరాలకు 358 కోట్ల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుంది.

ఒప్పందంలో ఒక ప్రత్యేక నిబంధన ఉంది. ప్రభుత్వ కొత్త చట్టం కారణంగా డ్రీమ్11 ప్రధాన వ్యాపారానికి ఆటంకం ఏర్పడితే, వారు బీసీసీఐకి ఎలాంటి జరిమానా చెల్లించాల్సిన అవసరం లేదు. దీని కారణంగా డ్రీమ్11 ఎలాంటి జరిమానా లేకుండా వైదొలిగిందని చెబుతున్నారు.

55
ప్రపంచ కప్ వరకు స్పాన్సర్ దొరుకుతుందా?
Image Credit : Getty

ప్రపంచ కప్ వరకు స్పాన్సర్ దొరుకుతుందా?

బీసీసీఐ రానున్న 2027 వన్డే ప్రపంచ కప్ వరకు కొత్త స్పాన్సర్ కోసం చూస్తోంది. కానీ, కొత్త చట్టం కారణంగా, పెద్ద కంపెనీలు ఆసక్తి చూపించడం ఆలస్యం కావచ్చు. అందుకే, ఆసియా కప్‌లో భారత ఆటగాళ్ళు స్పాన్సర్ లేని జెర్సీలతో ఆడతారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఆసియా కప్ 2025
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India ODI captain: గిల్ ఔట్.. న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా కొత్త వన్డే కెప్టెన్
Recommended image2
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘనవిజయం.. ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా
Recommended image3
Asian Games: బంగ్లాదేశ్ బౌలింగ్ ను దంచికొట్టిన షెఫాలీ వర్మ.. సూపర్ సెంచరీతో రికార్డుల మోత
Related Stories
Recommended image1
ఆసియా కప్ 2025: జపాన్‌పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ.. సూపర్-4లో స్థానం
Recommended image2
Salman Nizar : ఒకే ఓవర్ లో 40 పరుగులు.. 12 బంతుల్లో 11 సిక్సర్లు.. సునామీని మించిన బ్యాటింగ్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved