MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ప్ర‌పంచ క్రికెట్ లో తొలి జ‌ట్టుగా భార‌త్ స‌రికొత్త రికార్డు

ప్ర‌పంచ క్రికెట్ లో తొలి జ‌ట్టుగా భార‌త్ స‌రికొత్త రికార్డు

India's record for most sixes: బెంగుళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో భారత్ - న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఘోరంగా విఫ‌ల‌మైన టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న‌తో ముందుకు సాగుతోంది. ఈ క్ర‌మంలోనే స‌రికొత్త రికార్డు సాధించింది.   

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 19 2024, 08:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Rohit Sharma

Rohit Sharma

India's record for most sixes: బెంగుళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ జ‌ట్లు తొలి టెస్ట్ లో త‌ల‌ప‌డుతున్నాయి. మూడో రోజు స్టంప్స్ ప్రకటించే చివ‌రి నిమిషంలో భారత్ విరాట్ కోహ్లి (70) వికెట్ కోల్పోయింది. దీంతో భారత్ మూడు వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. సర్ఫరాజ్ 70 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. తొలి ఇన్నింగ్స్ లో భార‌త్ కేవ‌లం 46 ప‌రుగుల‌కే ఘోరంగా ఆలౌట్ అయింది. 

ఇక న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో  రచిన్ రవీంద్ర సెంచరీ (134 ప‌రుగులు) సాధించాడు. టిమ్ సౌథీ అర్ధ సెంచరీ (65 ప‌రుగులు) ఇన్నింగ్స్ ఆడాడు. డేవాన్ కాన్వే 91 ప‌రుగుల‌తో రాణించాడు. దీంతో కీవీస్ జ‌ట్టు తొలి ఇన్నింగ్స్ లో 402 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. ఇక భారత్ తన రెండో ఇన్నింగ్స్‌ను వేగంగా ప్రారంభించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

తొలి ఇన్నింగ్స్ లో ఘోరంగా విఫ‌ల‌మైన భార‌త్ రెండో ఇన్నింగ్స్ ను వికెట్లు కాపాడుకుంటేనే ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ ను మొద‌లుపెట్టింది. మూడో రోజు ఆట ముగిసిసే స‌మాయానికి భార‌త్ 231-3 ప‌రుగులు చేసింది. ఇంకా 125 ప‌రుగులు వెనుక‌బ‌డి ఉంది. 35 పరుగుల వద్ద య‌శ‌స్వి జైస్వాల్ ఔటయ్యాడు. 52 పరుగుల వద్ద కెప్టెన్ రోహిత్ శర్మ దురదృష్టవశాత్తు ఔటయ్యాడు. విరాట్ కోహ్లీ 70 ప‌రుగులు చేసి ఔట్ అయ్యాడు. స‌ర్ఫ‌రాజ్ ఖాన్ 70 ప‌రుగుల‌తో నాటౌట్ గా క్రీజులో ఉన్నాడు. నాలుగు, ఐదో రోజు ఆట భార‌త్ కు కీల‌కం కానుంది. 

ఒక ఏడాదిలో అత్యధిక సిక్సర్ల రికార్డు భారత్ సొంతం

ఇదే క్ర‌మంలో భార‌త్ అంత‌ర్జాతీయ క్రికెట్ లో మ‌రో సరికొత్త రికార్డు సాధించింది. ఒక క్యాలెండర్ ఇయర్‌లో టెస్టుల్లో 100 సిక్సర్లు బాదిన తొలి జట్టుగా భారత్ నిలిచింది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఈ ఘ‌న‌త సాధించింది. శుక్రవారం జరిగిన టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లి 147 ఏళ్లలో తొలిసారిగా భారత్ తరఫున మైలురాయిని బద్దలు కొట్టాడు. బంగ్లాదేశ్‌ సిరీస్‌లో 2022 నుంచి ఏడాదిలో అత్యధిక సిక్సర్లు బాదిన ఇంగ్లండ్ రికార్డు (89)ను రోహిత్ శర్మ సేన అంతకుముందు అధిగమించింది.

35

అత్యధిక సిక్సర్లలో టాప్ లో యశస్వి జైస్వాల్ 

2021లో 87 సిక్స‌ర్ల‌ను కొట్టి ఆల్-టైమ్ చార్ట్‌లలో భారతదేశం మూడవ స్థానంలో ఉంది. న్యూజిలాండ్ 2014లో 81, 2013లో 71 సిక్సర్లతో మొదటి ఐదు స్థానాల్లో నిలిచింది. భారతదేశం కూడా ఈ సంవత్సరం అన్ని ఫార్మాట్లలో 300 సిక్సర్లకు చేరువైంది. ఈ ఘనత సాధించడం వరుసగా మూడవ సంవత్సరం కావ‌డం విశేషం. 

ఈ ఏడాది టెస్టుల్లో 29 సిక్సర్లు బాదిన యశస్వి జైస్వాల్ భారత ప్లేయ‌ర్ల‌లో అగ్రస్థానంలో ఉన్నాడు. శుభ్‌మన్ గిల్ 16 సిక్స‌ర్లు, కెప్టెన్ రోహిత్ శ‌ర్మ 11 సిక్సర్లు బాది జైస్వాల్ త‌ర్వాత ఉన్నారు.  2014లో 33 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉన్న కివీ మాజీ బ్యాటర్ బ్రెండన్ మెకల్లమ్‌తో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక టెస్టు సిక్సర్లు కొట్టిన రికార్డును జైస్వాల్ ఇదివ‌ర‌కు బ్రేక్ చేశాడు.

45

కాగా, ప్రస్తుతం వీరేంద్ర సెహ్వాగ్ (91) పేరిట ఉన్న ఓవరాల్ టెస్ట్ సిక్సర్ల రికార్డును రోహిత్ (88) కూడా చేరువలో ఉన్నాడు . కేవలం ముగ్గురు బ్యాటర్లు - బెన్ స్టోక్స్, మెకల్లమ్, ఆడమ్ గిల్‌క్రిస్ట్ - టెస్ట్ క్రికెట్‌లో 100 సిక్సర్లను పూర్తి చేశారు. 

ఏడాదిలో అత్యధిక టెస్టు సిక్సర్లు కొట్టిన జట్లు

102* – భారతదేశం (2024)
89 – ఇంగ్లాండ్ (2022)
87 – భారతదేశం (2021)
81 – న్యూజిలాండ్ (2014)
71 – న్యూజిలాండ్ (2013)

55

టెస్టు క్రికెట్ లో అత్య‌ధిక  సిక్స‌ర్లు బాదిన ప్లేయ‌ర్లు ఏవ‌రు? 

టెస్టు క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టినవారిలో బెన్ స్టోక్స్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు 106 మ్యాచ్‌లు ఆడిన స్టోక్స్ 131 సిక్సర్లు బాదాడు. అయితే, స్టోక్స్ మినహా టాప్-5లో ప్ర‌స్తుతం క్రికెట్ ఆడుతున్న ప్లేయ‌ర్లు ఎవ‌రూ ఈ లిస్టులో లేరు. టెస్టు క్రికెట్ లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్ల లిస్టులో న్యూజిలాండ్ మాజీ స్టార్ ప్లేయర్ బ్రెండన్ మెకల్లమ్ రెండో స్థానంలో ఉన్నాడు. మెకల్లమ్ తన కెరీర్ లో 101 టెస్టు మ్యాచ్ లను ఆడి 107 సిక్సర్లు బాదాడు.

మెకల్లమ్ తర్వాత ఆస్ట్రేలియన్ మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ ఆడమ్ గిల్ క్రిస్ట్ 100 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ 98 సిక్సర్లతో నాల్గో స్థానంలో ఉన్నాడు. సౌత్ ఆఫ్రికా లెజెండరీ ఆల్ రౌండర్ జాక్ కల్లిస్ 97 సిక్సర్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. వీరి తర్వాత భారత ఢాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 91 సిక్సర్లతో ఆరో స్థానంలో ఉన్నారు. టీమ్ సౌథీ 7, బ్రియాన్ లారా 8, కేయిర్న్స్ 9, రోహిత్ శర్మ 10వ స్థానంలో ఉన్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
బెంగళూరు
క్రికెట్
భారత దేశం
రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ
 
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs NZ: చేతులెత్తేసిన బ్యాట‌ర్లు.. టీమిండియా ఓటమికి కారణాలు ఇవే
Recommended image2
Glenn Phillips: గ్లెన్ ఫిలిప్స్ మెరుపు సెంచరీ... రికార్డులు బద్దలు కొట్టిన కీవీస్ స్టార్
Recommended image3
Hardik Pandya: హార్దిక్ పాండ్యా కోసం బిగ్ ప్లాన్.. ముగ్గురు స్టార్లను ఇచ్చేస్తున్న సీఎస్‌కే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved