- Home
- Sports
- Cricket
- అప్పుడు కెప్టెన్‌గా, ఇప్పుడు హెడ్ కోచ్‌గా... రాహుల్ ద్రావిడ్, టీమిండియా హెడ్ కోచ్‌గా ఏ ముహుర్తాన..
అప్పుడు కెప్టెన్‌గా, ఇప్పుడు హెడ్ కోచ్‌గా... రాహుల్ ద్రావిడ్, టీమిండియా హెడ్ కోచ్‌గా ఏ ముహుర్తాన..
రవిశాస్త్రి తర్వాత భారీ అంచనాలతో టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నాడు రాహుల్ ద్రావిడ్. అండర్19 హెడ్ కోచ్‌గా సాధించిన సక్సెస్‌కి తోడు రవిశాస్త్రి హయాంలో టీమిండియా ఐసీసీ ట్రోఫీ గెలవలేకపోవడంతో రాహుల్ ద్రావిడ్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే రిజల్ట్ మాత్రం అలా లేదు..

Virat Kohli Rahul Dravid
రాహుల్ ద్రావిడ్ కోచ్‌గా ఏ నిమిషాన బాధ్యతలు తీసుకున్నాడో కానీ 2021 టీ20 వరల్డ్ కప్ నుంచి ఇప్పటివరకూ టీమిండియాకి 9 మంది కెప్టెన్లు మారారు. క్రికెట్ చరిత్రలో ఇంత తక్కువ సమయంలో ఇంత ఎక్కువ మంది కెప్టెన్లను మార్చినా జట్టు టీమిండియా ఒక్కటే..
రాహుల్ ద్రావిడ్ కోచింగ్‌లో సౌతాఫ్రికా టూర్‌లో వన్డే సిరీస్‌లో క్లీన్ స్వీప్ అయిన టీమిండియా, ఆసియా కప్ 2022 టోర్నీ ఫైనల్‌కి కూడా అర్హత సాధించలేకపోయింది. టీ20 వరల్డ్ కప్ 2022 సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్ చేతుల్లో 10 వికెట్ల తేడాతో ఓడింది..
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో టాస్ గెలిచినా, మ్యాచ్ గెలవలేకపోయింది టీమిండియా. గత 11 ఏళ్లలో స్వదేశంలో ఓడిన రెండో టెస్టు ఇది కాగా టాస్ గెలిచిన తర్వాత హోమ్ గ్రౌండ్‌లో టీమిండియా మ్యాచ్ ఓడిపోవడం ఇదే తొలిసారి. చివరిగా 2012లో మాహీ కెప్టెన్సీలో ఇలా జరిగింది..
బంగ్లాదేశ్ పర్యటనలో వన్డే సిరీస్ గెలవలేకపోయిన టీమిండియా, న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్టులో ఆఖరి వికెట్ తీయలేక మ్యాచ్‌ని డ్రా చేసుకుంది. సౌతాఫ్రికా పర్యటనలో మొదటిసారిగా నాలుగో ఇన్నింగ్స్‌లో టీమిండియాపై 200+ పరుగులను ఛేదించింది ప్రత్యర్థి జట్టు..
Team India
వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టు నాలుగు రోజుల పాటు సాగినా టీమిండియా గెలవలేకపోయింది. వెస్టిండీస్ బ్యాటర్లు, టీమిండియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోగలిగారు. 2016 తర్వాత టీమిండియాపై ఓ టెస్టును డ్రా చేసుకుంది వెస్టిండీస్..
వన్డే వరల్డ్ కప్ టోర్నీకి కూడా అర్హత సాధించని జట్టుపై టీమిండియా వన్డే ఓడిపోవడం... భారత పరువు తీసేసింది. అక్కడితో ఆగకుండా వెస్టిండీస్‌పై టీ20 సిరీస్‌లో మొదటిసారిగా రెండు మ్యాచులు ఓడిపోయింది టీమిండియా..
ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే చివరిగా 2006లో వెస్టిండీస్ పర్యటనలో 3 మ్యాచులు ఓడిపోయింది భారత జట్టు. అప్పుడు టీమిండియా కెప్టెన్‌గా ఉన్నది రాహుల్ ద్రావిడే. ఆ పర్యటనలో ఐదు వన్డేల సిరీస్‌ని 4-1 తేడాతో కోల్పోయింది భారత జట్టు...
India vs West Indies
ఆ తర్వాత 2023 వెస్టిండీస్ పర్యటనలో ఇప్పటికే ఓ వన్డే, రెండు టీ20లు ఓడింది భారత జట్టు. మిగిలిన 3 టీ20లను గెలవకపోతే కెప్టెన్‌గా, కోచ్‌గా వెస్టిండీస్‌లో సిరీస్ కోల్పోయిన చెత్త రికార్డును మూటకట్టుకున్నాడు రాహుల్ ద్రావిడ్..