IND vs AUS : టీమిండియాకు మళ్లీ షాక్
India vs Australia: విశాఖపట్నంలో ఆదివారం జరిగిన మహిళల వన్డే ప్రపంచ కప్ మ్యాచ్‌లో భారత్, డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా తలపడ్డాయి. ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. ఈ టోర్నీలో ఇండియాకు వరుసగా రెండో ఓటమి.

భారత్ vs ఆస్ట్రేలియా : హై స్కోరింగ్ మ్యాచ్
India vs Australia: 2025 మహిళల ప్రపంచ కప్ ఆతిథ్య జట్టు భారత్ ఈ టోర్నమెంట్‌లో వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి తర్వాత, ఆస్ట్రేలియా చేతిలో ఒక ఓవర్ మిగిలి ఉండగానే భారత్ మూడు వికెట్ల తేడాతో ఓడిపోయింది.
విశాఖపట్నం లో 2025 మహిళల వన్డే ప్రపంచ కప్‌లో ఆదివారం జరిగిన 13వ లీగ్ మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 48.5 ఓవర్లలో 330 పరుగులు చేసింది. ఇది మహిళల ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియాపై అత్యధిక స్కోరు.
అయితే, లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలివుండగానే ఆస్ట్రేలియా ఛేదించి భారత్ కు షాక్ ఇచ్చింది. 49 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 331 పరుగులు చేసి, భారత్‌ను మూడు వికెట్ల తేడాతో ఓడించింది.
భారత బ్యాటింగ్.. మంధాన సెంచరీ
ఓపెనర్లు రాణించడంతో భారత జట్టుకు మంచి ప్రారంభం లభించింది. స్మృతి మంధాన 80 పరుగులు చేశారు. ప్రతికా రావల్ 75 పరుగులు నాక్ ఆడారు. దీంతో తొలి వికెట్‌కు 155 పరుగుల భాగస్వామ్యాం లభించింది. హర్లీన్ డియోల్ 38, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ 22, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ కలిపి 32 పరుగులు చేశారు. అయితే, చివరి ఓవర్లలో భారత బ్యాట్స్ మెన్లు వచ్చినవారు వచ్చినట్టుగా పెవిలియన్ కు చేరారు. దీంతో ఓవర్లు పూర్తి కాకముందే 330 పరుగులకు ఆలౌట్ అయింది.
ఆస్ట్రేలియా రన్ ఛేజ్.. కెప్టెన్ అలిస్సా హీలీ సూపర్ సెంచరీ
లక్ష్యాన్ని ఛేదించడంలో ఆస్ట్రేలియాకు మంచి ఆరంభం వచ్చింది. ముఖ్యంగా కెప్టెన్ అలిస్సా హీలీ అద్భుతమైన సెంచరీ నాక్ ఆడారు. 142 పరుగుల సెంచరీ ఇన్నింగ్స్ తో కంగారుల విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆష్లీ గార్డనర్ 45 పరుగుల నాక్ ఆడారు. ఫోబ్ లిచ్‌ఫీల్డ్ 40 పరుగులు, ఎల్లీస్ పెర్రీ 47 పరుగులు చేశారు.
భారత బౌలర్లలో శ్రీచరణి మూడు, అమంజోత్ కౌర్, దీప్తి శర్మ తలా రెండు వికెట్లు తీసుకున్నారు. బౌలింగ్ లో పెద్దగా ప్రభావం చూపించకపోవడం, ఫీల్డింగ్ లో చిన్న పొరపాట్ల కారణంగా భారత్ ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది.
భారత జట్టు సెమీస్ కు చేరేనా?
ఈ ఓటమి భారత జట్టుకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. వరుసగా రెండో ఓటమి. ఇప్పుడు భారత్ సెమీఫైనల్ చేరేందుకు మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో అన్ని గెలవాలి. ఫీల్డింగ్ లో పొరపాట్లు, చివరి ఓవర్లలో బ్యాట్స్ మెన్ల తక్కువ స్కోరు విశాఖలో భారత్ ను దెబ్బకొట్టాయి. ప్రస్తుతం భారత్ నాలుగు మ్యాచ్‌లలో రెండు గెలిచి, రెండు ఓడిపోయింది.
మహిళల ప్రపంచ కప్ 2025 పాయింట్ల పట్టిక
ఆస్ట్రేలియా నాలుగు మ్యాచ్‌లలో మూడు విజయాలతో 7 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. భారత్ ఇప్పుడు మూడు మ్యాచ్‌లలో నాలుగు పాయింట్లతో మూడవ స్థానంలో ఉంది. నెట్ రన్ రేట్ కూడా తగ్గింది (0.682). దక్షిణాఫ్రికా నాల్గవ స్థానంలో, న్యూజిలాండ్ ఐదో స్థానంలో ఉన్నాయి. బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్ వరుసగా చివరి మూడు స్థానాల్లో ఉన్నాయి.