కుల్దీప్ యాదవ్‌పై ఎందుకింత చిన్నచూపు... అక్షర్ పటేల్ కోలుకోవడంతో రెండో టెస్టుకి...
కుల్దీప్ యాదవ్... కెరీర్ ఆరంభంలో టీమిండియాలో కీ ప్లేయర్. అరుదైన చైనామెన్ యాక్షన్‌తో బౌలింగ్ చేసే కుల్దీప్ యాదవ్, అంతర్జాతీయ క్రికెట్‌లో రెండు హ్యాట్రిక్స్ తీసిన మొట్టమొదటి భారత బౌలర్‌గానూ రికార్డు క్రియేట్ చేశాడు...

వన్డేల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేసిన కుల్దీప్ యాదవ్, కొన్నాళ్లుగా టీమిండియాలో సరైన ఛాన్సులు అందుకోలేకపోతున్నాడు...
వన్డే వరల్డ్ కప్ 2019 టోర్నీ తర్వాత కుల్దీప్ యాదవ్... భారత జట్టు ఆడే మెజారిటీ సిరీస్‌లకు ఎంపికయ్యాడు. అయితే తుదిజట్టులో ఆడిన మ్యాచులు మాత్రం వేళ్ల మీద లెక్కపెట్టుకోవచ్చు...
ఆస్ట్రేలియా టూర్ 2020-21 సిరీస్‌లో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా గాయపడినా.. తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు కుల్దీప్ యాదవ్. ఒక్క టెస్టు కూడా ఆడకుండానే టూర్‌ని ముగించాడు...
స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో లేదనుకుండా ఓ టెస్టులో కుల్దీప్ యాదవ్‌ను ఆడించిన టీమిండియా మేనేజ్‌మెంట్, మళ్లీ అతన్ని పక్కనబెట్టేసింది...
శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో, తొలి టెస్టులో తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయిన కుల్దీప్ యాదవ్, పింక్ బాల్ టెస్టుకి ముందు ఊహించని షాక్ తగిలింది...
స్పిన్నర్ అక్షర్ పటేల్ గాయం నుంచి కోలుకోవడంతో కుల్దీప్ యాదవ్‌ని రెండో టెస్టు జట్టు నుంచి తప్పించింది భారత టీమ్ మేనేజ్‌మెంట్...
తొలి టెస్టులో జయంత్ యాదవ్ అటు బ్యాటుతో కానీ, ఇటు బంతితో కానీ చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు... జయంత్ యాదవ్ స్థానంలో అక్షర్ పటేల్ తుదిజట్టులోకి రావచ్చు..
స్వదేశంలో ఆడిన 5 టెస్టుల్లో 36 వికెట్లు తీసి, ఐదు మ్యాచుల్లోనూ ఐదేసి వికెట్లు తీసిన అక్షర్ పటేల్, బెంగళూరు టెస్టులో బరిలో దిగడం ఖాయంగా మారింది.
అసలే రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, యజ్వేంద్ర చాహాల్, వాషింగ్టన్ సుందర్, రవి భిష్ణోయ్‌ల కారణంగా తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నాడు కుల్దీప్ యాదవ్...
ఇప్పుడు అక్షర్ పటేల్ కూడా కుల్దీప్ యాదవ్‌కి పోటీ రావడంతో ఈ చైనామన్ బౌలర్, తుదిజట్టులో చోటు దక్కించుకోవడం అనుమానంగా మారింది...
ఇప్పటికే బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన కుల్దీప్ యాదవ్, ఆశలన్నీ ఐపీఎల్ 2022 సీజన్‌పైనే పెట్టుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఆడనున్న కుల్దీప్, అక్కడ కూడా అక్షర్ పటేల్‌తో పోటీపడబోతున్నాడు.