ఇండియా-ఇంగ్లాండ్ టీ20, వన్డే సిరీస్ ఎప్పుడు? ఎక్కడ లైవ్ స్ట్రీమ్ చూడాలి?
India vs England: ఇంగ్లాండ్ జట్టు భారత్‌లో పర్యటించి టీ20, వన్డే సిరీస్‌లను ఆడనుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్, మ్యాచ్‌లు ప్రారంభమయ్యే సమయం, లైమ్ స్ట్రీమ్ వివరాలు ఇలా ఉన్నాయి.
ఇండియా-ఇంగ్లాండ్ సిరీస్
ఇటీవలే భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాతో 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆడింది. ఇందులో ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలిచి, 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఒక మ్యాచ్ డ్రా అయ్యింది. జట్టు ఓటమికి కారణమైన కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కోచ్ గౌతమ్ గంభీర్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
'మిని ప్రపంచ కప్' అని పిలువబడే ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఇండియా జట్టు తన స్వదేశంలో ఇంగ్లాండ్‌తో 5 టి20, 3 వన్డే మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఇండియా-ఇంగ్లాండ్ మధ్య జరిగే తొలి టి20 మ్యాచ్ కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జనవరి 22న జరగనుంది.
ఇండియా vs ఇంగ్లాండ్ టీ20 సిరీస్ పూర్తి షెడ్యూల్ ఇవే
ఇండియా-ఇంగ్లాండ్ మధ్య జరిగే తొలి టీ20 మ్యాచ్ కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జనవరి 22న జరగనుంది. రెండో టీ20 మ్యాచ్ చెన్నై చిదంబరం స్టేడియంలో 25న జరుగుతుంది. 3వ టీ20 28న రాజ్‌కోట్‌లో, 4వ టీ20 మ్యాచ్ 31న పూణేలో, 5వ టీ20 ఫిబ్రవరి 2న ముంబైలో జరుగుతాయి.
మొదటి మ్యాచ్ - 22 జనవరి - కోల్‌కతా
రెండో మ్యాచ్ - 25 జనవరి - చెన్నై
మూడో మ్యాచ్ - 28 జనవరి - రాజ్‌కోట్
నాలుగో మ్యాచ్ - 31 జనవరి - పూణే
ఐదవ మ్యాచ్ - 2 ఫిబ్రవరి - ముంబై.
వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్ ఫిబ్రవరి 6న నాగ్‌పూర్‌లో, 2వ వన్డే 9న కటక్‌లో, 3వ వన్డే 12న అహ్మదాబాద్‌లో జరుగుతాయి.
భారత్ vs ఇంగ్లండ్ వన్డే సిరీస్ షెడ్యూల్ 2025
ఫిబ్రవరి 6 - మొదటి వన్డే, నాగ్‌పూర్ (మధ్యాహ్నం 1:30 నుండి)
9 ఫిబ్రవరి - రెండవ వన్డే, కటక్ (మధ్యాహ్నం 1:30 నుండి)
12 ఫిబ్రవరి - మూడవ వన్డే, అహ్మదాబాద్ (మధ్యాహ్నం 1:30 నుండి)
ఇంగ్లాండ్ జట్టు
భారత్ vs ఇంగ్లండ్ సిరీస్ ఎక్కడ లైవ్ స్ట్రీమ్ చూడవచ్చు?
ఇండియా-ఇంగ్లాండ్ టీ20 మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు, వన్డేలు మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ టీ20, వన్డే సిరీస్ మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్ ఛానెళ్లలో చూడవచ్చు. స్టార్ స్పోర్ట్స్ తెలుగులో తెలుగు కామెంటరీతో మ్యాచ్‌లను చూడవచ్చు. అలాగే, డిస్నీ+ హాట్‌స్టార్ యాప్, వెబ్ సైట్ లో కూడా భారత్ vs ఇంగ్లాండ్ మ్యాచ్ లను ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు.
ఇంగ్లాండ్ తో సిరీస్ కోసం భారత టీ20 జట్టు
ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు బీసీసీఐ భారత జట్టును అధికారికంగా ప్రకటించింది. ఇంగ్లండ్‌తో భారత జట్టు టీ20 సిరీస్, ఆ తర్వాత వన్డే సిరీస్ కూడా ఆడనుంది. ఇంగ్లండ్ తో సిరీస్ ముగిసిన తర్వాత భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీలోకి అడుగుపెట్టనుంది. కాబట్టి టీమిండియాకు ఇంగ్లండ్ తో జరిగే సిరీస్ చాలా ముఖ్యమైంది.
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్) , రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్.
India England Series
ఇంగ్లాండ్ జట్టు ప్రకటన
ఈ సిరీస్‌లకు ఇంగ్లాండ్ జట్టును ప్రకటించారు. ఇంగ్లాండ్ జట్టుకు టీ20, వన్డే సిరీస్‌లకు జోస్ బట్లర్ కెప్టెన్‌గా నియమితులయ్యారు.
ఇంగ్లాండ్ టీ20, వన్డే జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, జాకబ్ బెథెల్, లియామ్ లివింగ్‌స్టోన్, రెహాన్ అహ్మద్, జేమీ ఓవర్టన్, బ్రైడన్ కార్స్, జేమీ స్మిత్, ఫిలిప్ సాల్ట్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, సాకిబ్ మహమూద్.