India: చరిత్ర సృష్టించిన భారత్.. టీ20ల్లో అత్యధిక విజయాలతో పాకిస్థాన్‌ను వెనక్కి నెట్టిన టీమిండియా
Team india: ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ లో విజయం సాధించడంతో టీ20 ఫార్మాట్ లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా టీమిండియా అవతరించింది. భారత్ ఇప్పటివరకు 213 టీ20 మ్యాచ్ లను ఆడగా, అందులో 136 మ్యాచ్ లలో విజయం సాధించగా, 67 మ్యాచ్ లలో ఓడింది. భారత జట్టు విజయాల శాతం 63.84 గా ఉంది.
India v Australia
రాయ్ పూర్ లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20లో భారత్ 20 పరుగుల తేడాతో విజయం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచ రికార్డును నెలకొల్పింది.
India , Cricket,
టీ20 ఫార్మాట్ లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా టీమ్ ఇండియా అవతరించింది. భారత్ ఇప్పటివరకు 213 టీ20 మ్యాచ్లు ఆడగా, అందులో 136 మ్యాచ్ లలో విజయం సాధించగా, 67 మ్యాచ్ లలో ఓడింది. భారత జట్టు విజయాల శాతం 63.84 గా ఉంది.
136 టీ20 విజయాలు సాధించిన భారత జట్టు 135 విజయాలు సాధించి ప్రత్యర్థి పాకిస్థాన్ ను వెనక్కి నెట్టింది. అత్యధిక విజయాల జాబితాలో ఇండియా, పాకిస్థాన్ తర్వాత న్యూజిలాండ్ (102), ఆస్ట్రేలియా (95), దక్షిణాఫ్రికా (95)లు టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన టాప్-5 జట్ల జాబితాలో ఉన్నాయి.
ఆస్ట్రేలియాపై 3-1తో సిరీస్ గెలవడంతో భారత్ 14 స్వదేశీ టీ20ల సిరీస్ లో అజేయంగా నిలిచింది. చివరిసారిగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ లో భారత్ 0-2 తేడాతో ఓడిపోయింది.
టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్ల వివరాలు గమనిస్తే.. భారత్ మొత్తం 213 మ్యాచ్ లను ఆడగా, 136 విజయాలు సాధించింది. దాయాది పాకిస్థాన్ మొత్తం 226 మ్యాచ్ లను ఆడగా, 135 విజయాలు సాధించి ఈ లిస్టులో రెండో స్థానంలో ఉంది.
న్యూజిలాండ్ మొత్తం 200 టీ20 మ్యాచ్ లను ఆడగా, వాటిలో 102 విజయాలు సాధించింది. ఆ తర్వాతి స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా 181 మ్యాచ్ లను ఆడగా, 95 గెలిచింది. సౌతాఫ్రికా మొత్తం 171 మ్యాచ్ లను ఆడి, 95 విజయాలు సాధించింది.