ఆసియా కప్ 2025: భారత్-పాకిస్తాన్ మధ్య 3 మ్యాచ్‌లు
India vs Pakistan: ఆసియా కప్ 2025లో భారత్-పాకిస్తాన్ మధ్య మూడు సార్లు మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. ఫైనల్‌లో కలిస్తే మూడోసారి తలపడతాయి. ఆసియా కప్ లో మొత్తంగా భారత్ దే పైచేయిగా ఉంది.

సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ 2025 ప్రారంభం
ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9న ప్రారంభం కానుంది. ఈసారి కూడా అభిమానుల భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ జట్లు ఉన్నాయి. గ్రూప్ బీలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ లు ఉన్నాయి.
భారత జట్టు తన మొదటి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న యూఏఈతో ఆడనుంది. పాకిస్తాన్ జట్టు తన తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 12న ఒమన్‌తో ఆడుతుంది. కానీ అభిమానులంతా ఎదురుచూస్తున్న బిగ్ ఫైట్ మాత్రం సెప్టెంబర్ 14న భారత్-పాకిస్తాన్ మధ్య జరగనుంది.
KNOW
ఆసియా కప్ 2025 లో భారత్ మ్యాచ్‌ల షెడ్యూల్
భారత్ గ్రూప్ దశలో మూడు మ్యాచ్‌లు ఆడుతుంది. సెప్టెంబర్ 10న యూఏఈతో ఈ టోర్నీలో తొలి మ్యాచ్ ను ఆడనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 14న ఎంతో ఆసక్తిని పెంచుతున్న మ్యాచ్ లో పాకిస్తాన్‌తో తలపడనుంది. సెప్టెంబర్ 19న ఒమన్‌తో పోటీపడుతుంది. ఈ మూడు మ్యాచ్‌లలో విజయాలు సాధిస్తే సూపర్ ఫోర్‌లో స్థానం ఖాయం అవుతుంది.
ఆసియా కప్ 2025 లో పాకిస్తాన్ మ్యాచ్‌ల షెడ్యూల్
పాకిస్తాన్ సెప్టెంబర్ 12న ఒమన్‌తో ఆసియా కప్ లో తొలి మ్యాచ్ ఆడుతుంది. సెప్టెంబర్ 14న భారత్‌తో తలపడనుంది. గ్రూప్ స్టేజ్ లో చివరి మ్యాచ్ లో సెప్టెంబర్ 17న యూఏఈతో పోటీ పడనుంది. ఈ మ్యాచ్‌లలో కనీసం రెండు విజయాలు సాధిస్తే పాకిస్తాన్ కూడా సూపర్ ఫోర్‌కి అర్హత సాధిస్తుంది.
భారత్-పాకిస్తాన్ తలపడే మూడు అవకాశాలు ఏంటి?
ఈ ఆసియా కప్‌లో భారత్-పాకిస్తాన్ జట్లు ఒకసారే కాకుండా మూడు సార్లు తలపడే అవకాశముంది. ఆ వివరాలు గమనిస్తే..
1. మొదటి మ్యాచ్: సెప్టెంబర్ 14న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్-పాకిస్తాన్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది.
2. రెండో ఫైట్ : రెండు జట్లు సూపర్ ఫోర్‌లోకి ప్రవేశిస్తే, సెప్టెంబర్ 21న మళ్లీ తలపడతాయి.
3. మూడవ మ్యాచ్ : రెండు జట్లు ఫైనల్‌లోకి చేరితే, సెప్టెంబర్ 28న మూడవసారి తలపడే అవకాశం ఉంటుంది.
అభిమానులకు పండగే !
ఆసియా కప్ 2025లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లు అత్యంత ఆసక్తికరంగా మారనున్నాయి. ఒకసారి కాకుండా మూడు సార్లు ఈ జట్లు తలపడితే, క్రికెట్ అభిమానులకు ఇది నిజమైన పండుగ కానుంది. ఫైనల్‌లో ఈ రెండు జట్లు తలపడితే, ఆసియా కప్ 2025 మరింత రసవత్తరంగా మారనుంది.