IND vs SL : గెలిచే మ్యాచ్ ఓడారు.. వారిపై రోహిత్ శర్మ ఫైర్..
IND vs SL 1st ODI Match Highlights : తొలి వన్డేలో భారత్-శ్రీలంక మధ్య గట్టి పోటీ కనిపించింది. రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్ చివరికి టై అయింది.
Rohit Sharma, cricket
India vs Sri Lanka 1st ODI Match Highlights : భారత్-శ్రీలంక మధ్య జరిగిన తొలి వన్డే చివరి వరకు తీవ్ర ఉత్కంఠను రేపింది. ఇరు జట్లు చివరి క్షణం వరకు గెలుపుకోసం పోటీ పడ్డాయి. అయితే, శ్రీలంక సూపర్ బౌలింగ్ తో చివరికి మ్యాచ్ టై గా ముగిసింది.
India , Cricket, virat kohli
శ్రీలంక అద్భుత బౌలింగ్ ముందు భారత్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరారు. టీమిండియా పూర్తి ఓవర్లు కాకముందే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో భారత్ కు మంచి శుభారంభం అందించాడు. అతను ఔట్ అయిన తర్వాత మ్యాచ్ పూర్తిగా మారిపోయింది.
india, cricket
భారత ప్లేయర్లు వరుసగా వికెట్లు సమర్పించుకుంటూ జట్టును కష్టాల్లోకి నెట్టారు. 15 బంతుల్లో భారత్ విజయానికి కేవలం ఒక పరుగు కావాల్సి ఉండగా.. వరుసగా రెండు వికెట్లు పడ్డాయి. దీంతో భారత్ ఆలౌట్ అయింది. ఇరు జట్లు 230 పరుగుల చేయడంలో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇప్పుడు సిరీస్‌ను కైవసం చేసుకోవాలంటే చివరి రెండు వన్డేల్లో టీమిండియా గెలవాల్సిందే.
india, cricket, Gill
మ్యాచ్ టై కావడంపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ 'స్కోరు సాధించవచ్చు, కానీ అక్కడకు చేరుకోవాలంటే మీరు బాగా బ్యాటింగ్ చేయాలి. ప్రారంభం బాగానే ఉంది. ఆ తర్వాత వికెట్లు కోల్పోయాము కానీ, మళ్లీ గేమ్ లోకి వచ్చాము. కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ భాగస్వామ్యంతో గెలుపు ముంగిటకు వచ్చాము కానీ, ముగింపు కాస్త నిరాశపరిచిందని' చెప్పాడు.
అలాగే, 'శ్రీలంక బాగా ఆడింది. ఇది న్యాయమైన ఫలితం. పిచ్ అలాగే ఉంది, మీరు వచ్చి మీ షాట్‌లు ఆడగలిగే ప్రదేశం కాదు. కష్టపడి ఆడాలి. రెండు జట్లకు వేర్వేరు సమయాల్లో గేమ్ అనుకూలంగా సాగింది. మనం ఆ ఒక్క పరుగు సాధించి ఉండాల్సింది' అని భారత బ్యాటర్లను ఉద్దేశించి రోహిత్ కామెంట్స్ చేశాడు.
India , Cricket, virat kohli
48వ ఓవర్‌లో భారత్‌కు 2 వికెట్లు మిగిలి ఉండగా విజయానికి 1 పరుగు మాత్రమే కావాలి. శ్రీలంక స్పిన్ బౌలర్ చరిత్ అసలంక చేతిలో బంతి ఉంది. రెండు వరుస బంతుల్లో ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లను ట్రాప్ చేసి మ్యాచ్‌ని టై చేశాడు. టీమిండియా తరుపున రోహిత్ శర్మ 58 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు, అది ఫలించలేదు. అసలంక, హసరంగ చెరో 3 వికెట్లు తీశారు. కౌంటర్ యాక్షన్‌లో టీమ్‌ఇండియా కూడా శుభారంభం చేసినా విరాట్, గిల్, శ్రేయాస్ వంటి బ్యాట్స్‌మెన్ రాణించలేకపోయారు.