బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు... తిలక్ వర్మ-సంజూ శాంసన్ సరికొత్త రికార్డులు
IND vs SA : దక్షిణాఫ్రికాతో జరిగిన 4వ టీ20 మ్యాచ్ లో అభిషేక్ శర్మ ఎదురుదాడి చేసి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత తిలక్ వర్మ, సంజూ శాంసన్ పరుగుల సునామీ సృష్టించారు. వీరి ఇద్దరి దెబ్బకు సౌతాఫ్రికాకు ఏం చేయాలో అర్థం కాలేదు.
Sanju Samson, Tilak Varma
IND vs SA : జోహన్నెస్‌బర్గ్‌లో భారత క్రికెట్ జట్టు పరుగుల సునామీ సృష్టించింది. అద్భుతమైన ఆటతో కొత్త రికార్డులు నమోదుచేసింది. మరీ ముఖ్యంగా సంజూ శాంసన్, తిలక్ వర్మలు దుమ్మురేపే ఇన్నింగ్స్ ఆడారు. వీరికి తోడు అభిషేక్ శర్మ కొద్దిసేపే గ్రౌండ్ లో ఉన్న ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. తిలక్ వర్మ, సంజూ శాంసన్‌ల సెంచరీలతో భారత్ ప్రోటీస్ జట్టు ముందు భారీ టార్గెట్ ను ఉంచింది. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 283 పరుగుల భారీ స్కోరు సాధించింది.
Sanju and Tilak
సౌతాఫ్రికా బౌలింగ్ ను ఉతికిపారేసిన భారత్
అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మలు దక్షిణాఫ్రికా బౌలింగ్ ను ఉతికిపారేశారు. ఫోర్లు, సిక్సర్లు బాది పరుగుల వర్షం కురిపించారు. సౌతాఫ్రికా బౌలర్లకు చెమటలు పట్టించారు. శాంసన్ 51 బంతుల్లో సెంచరీ పూర్తి చేయగా, తిలక్ 41 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. వీరి బ్యాటింగ్ ముందు స్టార్ బౌలర్లు కూడా ఏమీ చేయలేకపోయారు. సౌతాఫ్రికా బౌలర్లలో సిపమ్లా ఒక వికెట్ తీసుకున్నాడు కానీ, అతని నాలుగు ఓవర్లలో 58 పరుగులు ఇచ్చాడు. మార్కో జాన్సెన్ 42, గెరాల్డ్ కోయెట్జీ 43, సిమెలన్ 47, కేశవ్ మహారాజ్ 42, ఐడెన్ మార్క్రామ్ 30 పరుగులు ఇచ్చారు.
Tilak Varma, Sanju Samson, IND vs SA
సంజూ శాంసన్, తిలక్ వర్మ ధనాధన్ ఇన్నింగ్స్
సంజూ శాంసన్, తిలక్ వర్మ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు సెంచరీలతో నాటౌట్‌గా నిలిచారు. తిలక్ 120 పరుగుల ఇన్నింగ్స్‌లో 10 సిక్స్‌లు, 9 ఫోర్లు బాదాడు. శాంసన్ 109 పరుగుల ఇన్నింగ్స్‌లో 9 సిక్స్‌లు, 6 ఫోర్లు కొట్టాడు. వీరిద్దరినీ ఔట్ చేయడంలో ఆఫ్రికాకు చెందిన ఏ బౌలర్ విజయవంతం కాలేదు. 18 బంతుల్లో 36 పరుగులు చేసి ఔట్ అయిన అభిషేక్ శర్మ రూపంలో భారత్ ఏకైక వికెట్ పడింది. అతని వికెట్ ను సిపమ్లా తీసుకున్నాడు. కానీ, అతని బౌలింగ్ ను తిలక్ వర్మ, సంజూ శాంసన్ చీల్చిచెండాడారు.
Tilak Varma
సంజూ శాంసన్, తిలక్ వర్మ కొత్త రికార్డులు
గ్రౌండ్ లోకి అడుగుపెట్టిన వెంటనే సౌతాఫ్రికా బౌలింగ్ ను ఉతికిపారేయడం మొదలుపెట్టారు సంజూ శాంసన్, తిలక్ వర్మలు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ సెంచరీలు కొట్టారు. ఫోర్లు, సిక్సర్లతో సౌతాఫ్రికా బౌలింగ్ ను చిత్తుచేశారు. ఒకే మ్యాచ్ లో డబుల్ సెంచరీల రికార్డుతో భారత్ చరిత్ర సృష్టించింది. ఒక అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లో రెండు సెంచరీలు నమోదుకావడం ఇదే తొలిసారి. అలాగే, వరుసగా రెండు సెంచరీలు బాదిన ప్లేయర్ల లిస్టులోకి తిలక్ వర్మ చేరాడు. ఇప్పటివరకు భారత్ తరఫున టీ20 క్రికెట్ లో బ్యాక్ టూ బ్యాక్ సెంచరీలు బాదిన ప్లేయర్లుగా సంజూ శాంసన్, తిలక్ వర్మలు ఘనత సాధించారు. వీరిద్దరి సూపర్ ఇన్నింగ్స్ లతో భారత్ టీ20 క్రికెట్ లో తమ రెండో అత్యధిక స్కోర్ (283/1 Ind vs SA జోహన్నెస్‌బర్గ్ 2024 *) ను నమోదుచేసింది. సౌతాఫ్రికాపై భారత్ కు ఇదే అత్యధిక స్కోరు.
అభిషేక్ శర్మ కూడా ఉన్నంత సేపు బ్యాట్ తో దాడి చేశాడు
ఈ మ్యాచ్ లో ఆరంభం నుంచి ఫుల్ జోష్‌లో ఉన్న అభిషేక్ శర్మ 36 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. అయితే, అతను క్రీజులో ఉన్న సమయం తక్కువే అయినా సూపర్ నాక్ అని చెప్పాలి. కేవలం 18 బంతుల్లోనే 200 స్ట్రైక్ రేటులో 36 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాదాడు. అభిషేక్ శర్మ ఔటైనా భారత బ్యాటింగ్‌కు పెద్దగా తేడా లేదు. శాంసన్, తిలక్ తమ సునామీ బ్యాటింగ్‌ను కొనసాగించి 12వ ఓవర్‌లోనే భారత్ స్కోరును 150 మార్కును దాటించారు. 20 ఓవర్లలో భారత్ ఒక వికెట్ కోల్పోయి 283 పరుగులు చేసింది.