అంచనాలు పెంచి - టీమిండియాను ముంచేశారు
India vs New Zealand: బెంగళూరులో చెత్త ప్రదర్శనతో ఓటమిపాలైన తర్వాత కూడా భారత జట్టు తన తీరును మార్చుకోలేదు. దీంతో ఇప్పుడు పూణేలో కూడా ఘోరంగా న్యూజిలాండ్ చేతిలో చిత్తు అయింది.
India vs New Zealand: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత జట్టు ఘోరంగా ఓడిపోయింది. దీంతో 12 సంవత్సరాల తర్వాత స్వదేశంలో ఆడుతున్న టెస్ట్ సిరీస్‌ను కూడా కోల్పోయింది. అదే సమయంలో న్యూజిలాండ్‌కు ఈ విజయం చారిత్రాత్మకం. ఎందుకంటే న్యూజిలాండ్ జట్టు భారత్‌కు వచ్చి టెస్టు సిరీస్ గెలవడం ఇదే తొలిసారి.
పుణె టెస్టులో టీమిండియా 113 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఒక్క యశస్వి జైస్వాల్ మినహా భారత ఆటగాళ్లు ఎవరూ కూడా వారి స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయారు. మరి ముఖ్యంగా భారీ అంచనాలు పెంచిన ఐదుగురు ఆటగాళ్లు మొత్తానికి టీమిండియాను ముంచేశారు. సిరీస్ ను కోల్పోవడానికి కారణం అయ్యారు. ఆ వివరాలు గమనిస్తే..
విరాట్ కోహ్లీ - రోహిత్ శర్మలపై భారీ అంచనాలు
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు భారత జట్టులోని స్టార్ ప్లేయర్లు ఒంటిచేత్తో జట్టుకు అనేక విజయాలు అందించారు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలపై అందరూ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ముఖ్యంగా తొలి మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో 70 పరుగుల ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ, ఈ మ్యాచ్‌లో అతని బ్యాట్ పూర్తిగా నిశ్శబ్దంగా మారిపోయింది. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 18 పరుగులు మాత్రమే చేశాడు.
అలాగే, కెప్టెన్ రోహిత్ శర్మ కూడా మరోసారి అభిమానులను నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఖాతా కూడా తెరవలేకపోయాడు. రెండో ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ 8 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ ఇద్దరు అనుభవజ్ఞులైన బ్యాట్స్‌మెన్‌ల దారుణ ఫామ్ టీమిండియాను తీవ్రంగా నిరాశ పరిచింది.
రిషబ్ పంత్ హిట్ షో కనిపించలేదు
టీమిండియా చాలా మ్యాచ్‌లలో రిషబ్ పంత్ ఎక్స్ ఫ్యాక్టర్ అని నిరూపించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా అతను కొంత చరిష్మా ప్రదర్శిస్తాడని జట్టు అతనిపై భారీ అంచనాలు పెట్టుకుంది, కానీ చివరకు అది జరగలేదు.
మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ స్కోరు 70/4గా ఉన్నప్పుడు రిషబ్ పంత్ బ్యాటింగ్‌కు వచ్చినప్పటికీ అతను ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. 19 బంతుల్లో 18 పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. అదే సమయంలో రెండో ఇన్నింగ్స్‌లో 3 బంతులు ఆడినా ఖాతా తెరవకుండానే రనౌట్ అయ్యాడు. అతని ఈ వికెట్ కూడా మ్యాచ్‌లో పెద్ద మలుపుగా మారింది.
అశ్విన్ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వలేదు
ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ ప్లేయింగ్-11లో చోటు దక్కించుకున్నాడు. ఈ యువ ఆల్‌రౌండర్ కెప్టెన్ నిర్ణయం సరైనదేనని నిరూపించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు, రెండవ ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసి అశ్విన్‌కు పనిని సులభతరం చేశాడు. అయితే అశ్విన్ నుంచి జట్టుకు మంచి బ్యాటింగ్ అవసరమైనప్పుడు అతను తన అత్యుత్తమ ప్రదర్శన చేయలేకపోయాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అశ్విన్ 22 పరుగులు మాత్రమే చేశాడు.
సర్ఫరాజ్ ఖాన్ బ్యాట్ ఆడలేదు
గత మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ అంతర్జాతీయ కెరీర్‌లో తొలి సెంచరీ సాధించిన సర్ఫరాజ్ ఖాన్.. ఈ మ్యాచ్‌లో పెద్ద ఇన్నింగ్స్ ను ఆడలేదు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ తడబడిన భారత్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యత అతనిపైనే ఉన్న సమయంలో ఘోరంగా విఫలం అయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 11 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 9 పరుగులు చేసి సర్ఫరాజ్ ఖాన్ ఔటయ్యాడు.
శుభ్ మన్ గిల్ పెద్ద ఇన్నింగ్స్ లను ఆడలేకపోయాడు
మరో భారత యంగ్ స్టార్ ప్లేయర్ శుభ్ మన్ గిల్ కూడా ఈ మ్యాచ్ లో పెద్ద ఇన్నింగ్స్ లను ఆడలేక పోయాడు. తొలి ఇన్నింగ్స్ లో గిల్ 30 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్ లో 23 పరుగులు చేశాడు. అతని నుంచి భారీ ఇన్నింగ్స్ ల అంచనాలు పెట్టుకుంది భారత్. అది జరగకపోవడంతో టీమిండియా ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది.
ఈ విజయంతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ లో కివీస్ 2-0 తిరుగులేని ఆధిక్యంలో సిరీస్ ను కైవసం చేసుకుంది. న్యూజిలాండ్ జట్టు తొలిసారి భారత్‌లో టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో మూడో, చివరి టెస్టు నవంబర్ 1 నుంచి ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది.