బెంగళూరు టెస్టులో ఇదే జరిగితే న్యూజిలాండ్ పై భారత్ గెలుపు పక్కా
IND vs NZ: న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు రెండో ఇన్నింగ్స్ లో భారత ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సర్ఫరాజ్ ఖాన్ హాఫ్ సెంచరీలు సాధించారు. తొలి ఇన్నింగ్స్ ఘోరంగా 46 పరుగులకే ఆలౌట్ అయిన భారత్.. రెండో ఇన్నింగ్స్ లో మెరుగైన ప్రదర్శన చేస్తోంది.
IND vs NZ: బెంగుళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో భారత్ - న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మూడో రోజు శుక్రవారం ముగిసింది. స్టంప్స్ ప్రకటించేలోపే భారత్ విరాట్ కోహ్లి (70) వికెట్ కోల్పోయింది. దీంతో భారత్ మూడు వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. సర్ఫరాజ్ 70 పరుగులు చేసి నాటౌట్ గా ఉన్నాడు.
తొలి ఇన్నింగ్స్‌లో ఘోరంగా 46 పరుగులకు ఆలౌట్ అయి భారత్ చెత్త రికార్డు సాధించింది. ఆ తర్వాత న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 402 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో ఘోరంగా విఫలమైన భారత్ రెండో ఇన్నింగ్స్ లో మాత్రం వికెట్లు పడకుండా న్యూజిలాండ్ బౌలర్ల నుంచి పరుగులు రాబట్టింది. బెంగళూరు టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా మంచి పునరాగమనం చేసింది.
మూడో రోజు భారత్ బ్యాటర్ల సూపర్ షో
మ్యాచ్ మూడో ఆటలో మొత్తంగా న్యూజిలాండ్ 402 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్ అద్భుత ప్రదర్శన కనబరిచారు. అయితే, రోజు చివరి బంతికి విరాట్ కోహ్లీ 70 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటవడంతో పెద్ద షాక్ తగిలింది. అయితే ఈ మ్యాచ్‌లో గెలిచే సత్తా టీమ్ ఇండియాకు ఉంది.
మూడో రోజు ఆట ముగిసే వరకు భారత్ స్కోరు 231/3 పరుగులు. క్రీజులో సర్ఫరాజ్ ఖాన్ 70 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 125 పరుగుల వెనుకంజలో ఉన్నప్పటికీ మ్యాచ్‌లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే చేయాల్సిన మూడు పనులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సర్ఫరాజ్ ఖాన్ భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంటుంది
తొలి ఇన్నింగ్స్‌లో ఖాతా తెరవకుండానే ఔటైన స్టార్ బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ ఖాన్.. రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతమైన బ్యాటింగ్ చూశాడు. యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ అవుట్ అయిన తర్వాత ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్తే పెద్ద బాధ్యత అతని భుజాలపై ఉంది. విరాట్ కోహ్లీతో కలిసి అతను చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు.
మూడో రోజు ఆట ముగిసే వరకు సర్ఫరాజ్ 70 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. నాలుగో రోజు అతను ఈ పరుగులను సెంచరీగా, ఆపై డబుల్ సెంచరీగా మలచడంలో సఫలమైతే, ఈ మ్యాచ్‌లో భారత్ గెలుపు దిశగా పయనించవచ్చు.
భారత్ 600-650 పరుగులు చేస్తే గెలిచే ఛాన్స్
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్ ఇప్పటికే ఔట్ అయ్యారు. నాలుగో రోజు సర్ఫరాజ్ ఖాన్ బ్యాటింగ్‌కు దిగనున్నాడు. వీరితో పాటు రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లు బ్యాటింగ్‌లో రాణించి భారీ స్కోరు చేస్తే భారత్ గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.
ఈ బ్యాట్స్‌మెన్ ధైర్యంగా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. టీమిండియా రెండవ ఇన్నింగ్స్‌లో 600-650 పరుగుల స్కోరును చేస్తే భారత్ మెరుగైన స్థతిలో ఉంటుంది. అంటే దీని కారణంగా న్యూజిలాండ్ ముందు నాల్గవ ఇన్నింగ్స్‌లో 250-300 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచవచ్చు. ఇదే జరిగితే భారత్ మ్యాచ్‌లో విజయం సాధించడం అంత కష్టమైన విషయమేమీ కాదు.
భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేయాలి
న్యూజిలాండ్‌కు 200 పరుగులకు పైగా లక్ష్యాన్ని అందించడంలో భారత్ సఫలమైతే, గెలిపించే బాధ్యత భారత బౌలర్లపై ఉంటుంది. ఈ పరిస్థితిలో కివీ జట్టు భారత ఫాస్ట్ బౌలర్లను, ప్రపంచ నంబర్-1 స్పిన్ జోడీ అశ్విన్-జడేజాలు కీలక పాత్ర పోషించే అవకాశముంది. వీరు రాణిస్తే భారత్ గెలుపు పక్కా.
అయితే, ఇప్పటివరకు మ్యాచ్ సాగిన పరిస్థితులు గమనిస్తే భారత్ కంటే న్యూజిలాండ్ ముందంజలో ఉంది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 46 పరుగులకే ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ తన తొలి ఇన్నింగ్స్ తో 402 పరుగులు చేసింది. టీమిండియా తన రెండో ఇన్నింగ్స్ లో 231-3 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. యశస్వి జైస్వాల్ 35 పరుగులు, విరాట్ కోహ్లీ 70 పరుగులు, రోహిత్ శర్మ 52 పరుగులు చేసి ఔట్ అయ్యారు. 70* పరుగులతో సర్ఫరాజ్ ఖాన్ క్రీజులో ఉన్నాడు. ఇంకా భారత జట్టు 125 పరుగులు వెనుకబడి ఉంది.