MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Sports
  • Cricket
  • బౌలింగ్, బ్యాటింగ్ లో ఊచ‌కోత‌.. ఇంగ్లాండ్ పై భార‌త్ ఘ‌న‌విజ‌యం

బౌలింగ్, బ్యాటింగ్ లో ఊచ‌కోత‌.. ఇంగ్లాండ్ పై భార‌త్ ఘ‌న‌విజ‌యం

IND vs ENG: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భార‌త్ బౌలింగ్, బ్యాటింగ్ లో ఊచ‌కోత సాగించింది. ఆల్ రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఇంగ్లాండ్ ను చిత్తు చేసింది. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jan 22 2025, 10:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

IND vs ENG: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అభిషేక్ శ‌ర్మ‌, సంజూ శాంస‌న్ సూప‌ర్ ఇన్నింగ్స్ అద‌గొట్ట‌డంతో 13వ ఓవ‌ర్ లోనే భార‌త్ విజ‌యాన్ని అందుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

సూప‌ర్ బౌలింగ్ తో ఇంగ్లాండ్ బ్యాట‌ర్ల‌ను ఇబ్బంది పెట్టిన భార‌త్

కోల్ క‌తా లోని ఈడెన్ గార్డెన్ లో జ‌రిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భార‌త కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్ ఈ మ్యాచ్ లో తొలుగ బౌలింగ్ చేయాడానికి నిర్ణ‌యించుకున్నాడు. టీమిండియా నుంచి సూప‌ర్ బౌలింగ్ రావ‌డంతో ఇంగ్లాండ్ ప‌రుగులు చేయ‌డానికి ఇబ్బంది ప‌డింది.

ఇంగ్లాండ్ బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ జోష్ బ‌ట్ల‌ర్ ఒక్క‌డే చెప్పుకోద‌గ్గ ప‌రుగులు చేశారు. ఒక వైపు వికెట్లు ప‌డుతుంటే మ‌రో వైపు బ‌ట్ల‌ర్ ఫోర్లు, సిక్స‌ర్ల‌లో త‌న‌దైన షాట్స్ ఆడుతూ 68 ప‌రుగులు ఇన్నింగ్స్ ఆడాడు. త‌న ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, 2 సిక్స‌ర్లు బాదాడు. 20 ఓవ‌ర్ల‌లో ఆలౌట్ అయిన ఇంగ్లాండ్ 132 ప‌రుగులు చేసింది. 

36

టీమిండియా బౌల‌ర్లు కూడా అద‌ర‌గొట్టారు. అలాగే, అద్భుత‌మైన క్యాచ్ ల‌తో మంచి ఫీల్డింగ్ క‌నిపించింది.  భార‌త్ తరఫున హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ తలో 2 వికెట్లు తీసుకున్నారు. వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు తీశారు. కీలక సమయంలో అవసరమైన వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

46
Image Credit: Getty Images

Image Credit: Getty Images

భార‌త్ ఊచ‌కోత.. అభిషేక్ శ‌ర్మ విధ్వంసం 

133 ప‌రుగులు స్వ‌ల్ప టార్గెట్ తో బ్యాటింగ్ మొద‌లుపెట్టిన భార‌త్ కు ఓపెన‌ర్లు సంజూ శాంస‌న్, అభిషేక్ శ‌ర్మ‌లు అద్భుత‌మైన ఆరంభం అందించారు. సంజూ శాంస‌న్ 26 ప‌రుగులు ఇన్నింగ్స్ ఆడాడు. అభిషేక్ శ‌ర్మ ఇంగ్లాండ్ బౌలింగ్ ను చిత్తు చేస్తూ హాఫ్ సెంచరీ కొట్టాడు.

56
Abhishek Sharma-Sanju Samson

Abhishek Sharma-Sanju Samson

232 స్ట్రైక్ రేటులో బ్యాటింగ్ కొన‌సాగించిన టీమిండియా యంగ్ ప్లేయర్ అభిషేక్ శ‌ర్మ 79 ప‌రుగులు ఇన్నింగ్స్ ఆడాడు. త‌న ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 8 సిక్స‌ర్లు బాదాడు.

తిల‌క్ వ‌ర్మ 19* ప‌రుగులు, హార్దిక్ పాండ్యాలు 3* ప‌రుగులు చేసి 13వ ఓవ‌ర్ లో భార‌త్ కు విజ‌యాన్ని అందించారు. 133-3 ప‌రుగుల‌తో విజ‌యాన్ని అందుకున్న భార‌త్ ఈ సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 జనవరి 25న జరగనుంది.

66

చ‌రిత్ర సృష్టించిన అర్ష్ దీప్ సింగ్ 

భార‌త స్టార్ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ ఈ మ్యాచ్‌లో చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్ లో అత్య‌ధిక వికెట్లు తీసుకున్న భార‌త బౌల‌ర్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ లో రెండు వికెట్లు తీయడంలో టీ20 ఇంటర్నేషనల్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.

96 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్న యుజ్వేంద్ర చాహల్ రికార్డును బ్రేక్ చేశాడు. ఈ ఫార్మాట్‌లో అర్ష్‌దీప్ సింగ్ ఇప్పటి వరకు 97 వికెట్లు పడగొట్టాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు

Latest Videos
Recommended Stories
Recommended image1
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image2
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Recommended image3
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved