MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IND vs ENG: ఎవడు కొడితే బాల్ స్టేడియం బయటపడుద్దో వాడే రోహిత్ శర్మ !

IND vs ENG: ఎవడు కొడితే బాల్ స్టేడియం బయటపడుద్దో వాడే రోహిత్ శర్మ !

India vs England: భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. కేవలం 30 బంతుల్లోనే ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుప‌డుతూ తుఫాను హాఫ్ సెంచ‌రీ కొట్టాడు. వన్డే క్రికెట్‌లో రోహిత్‌కు ఇది 48వ అర్ధ సెంచరీ. ఆ తర్వాత దానిని 76 బంతుల్లో సెంచరీగా మార్చాడు.  

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Feb 09 2025, 08:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Rohit Sharma

Rohit Sharma

Rohit Sharma: ఎవ‌డు కొడితే బాల్ స్టేడియం బయ‌ట ప‌డుద్దో వాడే రోహిత్ శ‌ర్మ‌.. అవును నిజ‌మే భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌చ్చాడు. అద్భుత‌మైన భారీ సిక్స‌ర్ల‌తో క‌ట‌క్ లో ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. అద‌రిపోయే షాట్స్ తో స్టేడియాన్ని హోరెత్తించాడు. కేవ‌లం 30 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ పూర్తి చేశాడు. 

ఆదివారం కటక్‌లో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన హాఫ్ సెంచరీతో తిరిగి ఫామ్ లోకి వ‌చ్చాడు. ఈ సీనియ‌ర్ స్టార్ ఓపెనర్ తన సిగ్నేచర్ స్ట్రోక్‌లతో అద‌ర‌గొడుతూ ప్రేక్షకులను అలరించాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

భార‌త్ ముందు భారీ టార్గెట్ 

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉన్న భారత్ ఈ మ్యాచ్ లో ముందుగా బౌలింగ్ చేసింది. ఇంగ్లాండ్‌ను 304 పరుగులకు ఆలౌట్ చేసింది. ఇంగ్లాండ్ ప్లేయ‌ర్ల‌లో జో రూట్ (69), బెన్ డకెట్ (65) అద్భుతమైన అర్ధ సెంచరీలు సాధించారు. దీనితో పాటు, లియామ్ లివింగ్‌స్టోన్ 32 బంతుల్లో రెండు ఫోర్లు, సిక్సర్లతో 41 పరుగులు చేశాడు. హ్యారీ బ్రూక్ (31), కెప్టెన్ జోస్ బట్లర్ (34) కూడా పరుగులు చేయ‌డంతో ఇంగ్లాండ్ 304 ప‌రుగులు చేసింది. 

35
Image Credit: Getty Images

Image Credit: Getty Images

ధ‌నాధ‌న్ బ్యాటింగ్.. సెంచరీతో అద‌ర‌గొట్టిన రోహిత్ శ‌ర్మ 

భారీ టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన భార‌త జ‌ట్టుకు హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ‌, శుభ్ మ‌న్ గిల్ లు శుభారంభం అందించారు. దూకుడుగా ఆడుతూ ఇంగ్లాండ్ బౌలింగ్ పై అటాక్ చేశారు. మ‌రీ ముఖ్యంగా చాలా కాలంగా విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న రోహిత్ శ‌ర్మ అద్భుత‌మైన షాట్స్ తో ఇన్నింగ్స్ ను మొద‌లు పెట్టి ఫామ్ ను అందుకున్నాడు. 

రోహిత్ కేవలం 30 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. భారత్ ఛేజింగ్‌లోని రెండవ ఓవర్‌లో పేసర్ గస్ అట్కిన్సన్ బౌలింగ్ ను చిత్తుచేస్తూ వరుసగా బంతుల్లో ఫోర్, సిక్స్ కొట్టాడు. మొదటి ఐదు ఓవర్లలోనే మరో రెండు సిక్సర్లు కొట్టాడు. మరో అద్భుతమైన సిక్సర్ తో  దానిని సెంచరీగా మార్చాడు. 

45

కొంత స‌మ‌యం నిలిచిపోయిన మ్యాచ్ 

రోహిత్ శ‌ర్మ మంచి ట‌చ్ లో సూప‌ర్ షాట్స్ కొడుతున్న స‌మ‌యంలో మ్యాచ్ కు బ్రేక్ ప‌డింది. స్టేడియం ప్ల‌డ్ లైట్లు ఆగిపోవ‌డంతో మ్యాచ్ ను కొద్దిసేపు ఆపారు. మ‌ళ్లీ మ్యాచ్ మొద‌లైన త‌ర్వాత రోహిత్ శ‌ర్మ అదే జోరు కొన‌సాగించాడు. రోహిత్ తన నాల్గవ ఫోర్‌తో పాటు మ‌రిన్ని సిక్స‌ర్లు బాది హాఫ్ సెంచ‌రీ పూర్తి చేశాడు. 

55

బ్యాట్ తోనే స‌మాధాన‌మిచ్చిన రోహిత్

తొలి వన్డేలో రోహిత్ కేవలం రెండు పరుగులు మాత్రమే చేశాడు. దీనికి ముందు ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ దారుణ‌మైన ఫామ్ తో ఇబ్బంది ప‌డ్డాడు. కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. కానీ ఆదివారం జరిగిన ఇన్నింగ్స్ రోహిత్ త‌న పై వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌కు బ్యాట్ తోనే స‌మాధాన‌మిచ్చాడు. 

ప్ర‌స్తుతం 76 బంతుల్లో 100 పరుగుల మార్కును అందుకున్నాడు. తన ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు. రోహిత్ ఫామ్ ను అందుకోవ‌డంతో భార‌త అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. రోహిత్ కు తోడుగా శుభ్ మ‌న్ గిల్ సైతం బ్యాట్ తో అద‌ర‌గొట్టాడు. 52 బంతులు ఆడి 60 ప‌రుగులు చేసిన త‌ర్వాత అత‌ను ఔట్ అయ్యాడు. ఆ త‌ర్వాత బ్యాటింగ్ కు వ‌చ్చిన విరాట్ కోహ్లీ మ‌రోసారి నిరాశ‌ప‌రిచాడు. కేవ‌లం 5 ప‌రుగుల‌కే పెవిలియ‌న్ కు చేరాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
విరాట్ కోహ్లీ
క్రికెట్
రోహిత్ శర్మ

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs ENG: వైభవ్ సూర్యవంశీ గురించి నాకు తెలియదు.. శ్రేయాస్ అయ్యర్ షాకింగ్ కామెంట్స్
Recommended image2
Team India: వరల్డ్ కప్ పోయింది.. ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ కొట్టాల్సిందే.. ఐదుగురు కొత్త ప్లేయర్లకు బంపర్ ఛాన్స్ !
Recommended image3
Ben Stokes: సడన్ షాక్ ఇచ్చిన ఇంగ్లండ్ కెప్టెన్.. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు బెన్ స్టోక్స్ సడన్ రిటైర్మెంట్ ఎందుకిచ్చాడు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved