MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IND vs ENG: ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా ఓటమికి 5 ముఖ్య కారణాలు ఇవే

IND vs ENG: ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా ఓటమికి 5 ముఖ్య కారణాలు ఇవే

England vs India: కార్డిఫ్‌లో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లాండ్‌ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టీమిండియా ఓటమికి దారితీసిన 5 ప్రధాన కారణాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 17 2026, 07:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
చేజేతులా మ్యాచ్ పోగొట్టుకున్న టీమిండియా.. కార్డిఫ్‌లో అసలు ఏం జరిగిందంటే?
Image Credit : X/BCCI

చేజేతులా మ్యాచ్ పోగొట్టుకున్న టీమిండియా.. కార్డిఫ్‌లో అసలు ఏం జరిగిందంటే?

కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్ లో జరిగిన రెండో వన్డేలో టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఇప్పుడు 1-1తో సమం అయింది. మొదటి మ్యాచ్‌లో ఈజీగా గెలిచిన భారత్, ఈసారి మాత్రం చేతులెత్తేసింది.

మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 44 ఓవర్లలో కేవలం 233 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ 44.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఈజీగా ఛేజ్ చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ 99 పరుగులతో అజేయంగా నిలిచి టీమిండియాకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోవడానికి గల 5 ప్రధాన కారణాలు గమనిస్తే..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఘోరమైన బ్యాటింగ్ పతనం
Image Credit : X/BCCI

ఘోరమైన బ్యాటింగ్ పతనం

టీమిండియా ఒక దశలో సూపర్ పొజిషన్‌లో ఉంది. 30 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 180/3. ఇక్కడి నుంచి భారీ స్కోరు సాధిస్తుందని అభిమానులు ఆశించారు. కనీసం 300 లేదా 310 పరుగులు చేయడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ, ఆ తర్వాతే సీన్ రివర్స్ అయింది. భారత్ కేవలం 60 పరుగుల వ్యవధిలోనే చివరి 7 వికెట్లను కోల్పోయింది. మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ ఘోరంగా విఫలమయ్యాయి. తోకముడిచిన బ్యాటర్లు క్రీజులో ఎక్కువసేపు నిలబడలేకపోయారు. దీనివల్ల ఇంగ్లాండ్‌కు చిన్న టార్గెట్ మాత్రమే ఇవ్వగలిగారు.

36
కీలక ప్లేయర్ వాషింగ్టన్ సుందర్ గాయం
Image Credit : X/Sundarwashi5

కీలక ప్లేయర్ వాషింగ్టన్ సుందర్ గాయం

ఈ మ్యాచ్‌లో టీమిండియాకు తగిలిన అతిపెద్ద దెబ్బ వాషింగ్టన్ సుందర్ ఇంజూరీ. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మిడ్-ఆఫ్‌కు సింగిల్ రన్ తీస్తూ సుందర్ గాయపడ్డాడు. ఇది మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. సుందర్ గాయం వల్ల టీమిండియా బౌలింగ్ ప్లాన్స్ పూర్తిగా దెబ్బతిన్నాయి. మెయిన్ బౌలర్లను వరుసగా వాడాల్సి వచ్చింది. దీనివల్ల ప్రెషర్ బిల్డ్ చేసే ఛాన్స్ పోయింది. ఒక కీ ప్లేయర్ ఇంజూరీ కావడం టీమిండియా మొమెంటంను దెబ్బతీసింది.

46
టాప్ ఆర్డర్ వైఫల్యం, రోహిత్ శర్మ ఫామ్
Image Credit : X/BCCI

టాప్ ఆర్డర్ వైఫల్యం, రోహిత్ శర్మ ఫామ్

లార్డ్స్‌లో జరిగే ఫైనల్ డిసైడర్‌కు వెళ్లేముందు రోహిత్ శర్మ ఫామ్ ఇప్పుడు టీమిండియాకు పెద్ద టెన్షన్‌గా మారింది. ఈ సిరీస్‌లో రోహిత్ ఇంకా తన రిథమ్ అందుకోలేదు. మరోవైపు శుభ్‌మన్ గిల్ కూడా మంచి స్టార్ట్ లభించినా, కవర్‌లో ఫీల్డర్‌కు నేరుగా క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. టాప్ ఆర్డర్ నుంచి సరైన భాగస్వామ్యాలు రాకపోవడం, కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడం భారత్ స్కోరును కట్టడి చేసింది. విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ రాణించినా భారీ ఇన్నింగ్స్‌లుగా మార్చలేకపోయారు.

56
అడ్డుగోడగా జో రూట్.. అజేయ ఇన్నింగ్స్
Image Credit : X/BCCI

అడ్డుగోడగా జో రూట్.. అజేయ ఇన్నింగ్స్

ఇంగ్లాండ్ రన్ ఛేజ్‌లో జో రూట్ ఒక గోడలా నిలబడ్డాడు. కేవలం 234 పరుగుల టార్గెట్ ఉండడంతో జో రూట్ ఎలాంటి రిస్క్ తీసుకోకుండా చాలా కూల్‌గా ఆడాడు. టీమిండియా బౌలర్లు అతడిని అవుట్ చేయడానికి చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయ్యాయి. రూట్ చేత ఎలాంటి తప్పు చేయించలేకపోయామని మ్యాచ్ తర్వాత గిల్ కూడా ఒప్పుకున్నాడు. 99 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన రూట్, సింగిల్స్ రొటేట్ చేస్తూ మ్యాచ్‌ను ఇంగ్లాండ్ వైపు మార్చాడు.

66
ఇంగ్లాండ్ పేసర్ల పక్కా ప్లానింగ్
Image Credit : X/BCCI

ఇంగ్లాండ్ పేసర్ల పక్కా ప్లానింగ్

ఈ పిచ్‌పై ఇంగ్లాండ్ పేసర్లు జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. వీరిద్దరూ తలో మూడు వికెట్లు తీసి భారత బ్యాటింగ్‌ను గట్టి దెబ్బ కొట్టారు. సామ్ కరన్, విల్ జాక్స్ కూడా మిడిల్ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి రన్ రేట్ పెరగకుండా కట్టడి చేశారు. పిచ్ కండిషన్స్ అనుకూలించడంతో ఎక్స్‌ట్రా సీమర్‌తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ వ్యూహం పక్కాగా వర్కవుట్ అయింది.

ఈ ఓటమితో వన్డే సిరీస్ ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్‌గా మారింది. లార్డ్స్ లో ఆదివారం జరగబోయే మూడో వన్డే ఇప్పుడు సిరీస్ డిసైడర్‌గా నిలవనుంది. మరి ఆఖరి పోరులోనైనా భారత్ పుంజుకుని సిరీస్ కొడుతుందో లేదో చూడాలి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs West Indies: భారత్ ఓటమికి అసలు కారణాలు ఇవే
Recommended image2
రాంచీలో ర‌ఫ్ఫాడించిన షాయ్ హోప్.. టీమిండియాపై వెస్టిండిస్‌ సంచ‌ల‌న విజ‌యం
Recommended image3
virat kohli: ఆ ఆశ్ర‌మానికి వెళ్లినందుకు కోహ్లికి రూ. 5 కోట్లు ఇచ్చారా.? అస‌లేం జ‌రిగిందంటే
Related Stories
Recommended image1
Axar Patel: మంట పుట్టించిన అక్షర్ పటేల్.. సచిన్, పాండ్యా రికార్డులు బ్రేక్
Recommended image2
South Kashmir of Andhra: దక్షిణ కాశ్మీరం.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే.. పాపికొండలు ఎందుకు అంత స్పెషల్?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved