IND vs AUS : 5 పరుగులకే విరాట్ ఔట్.. కోహ్లీ చేసిన పెద్ద తప్పు అదే !
IND vs AUS: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా పెర్త్ టెస్టు తొలిరోజు మొదటి ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీని ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజిల్‌వుడ్ పెవిలియన్ కు పంపాడు. కేవలం 5 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్ అయి అభిమానులను తీవ్ర నిరాశ పరిచాడు.
IND vs AUS: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గత కొంత కాలంగా టెస్టు క్రికెట్ లో పెద్ద ఇన్నింగ్స్ లు ఆడలేకపోతున్నాడు. అతని ఫామ్ జట్టు మేనేజ్‌మెంట్‌కు ఆందోళన కలిగించే అంశంగా మారింది. అయితే, మంచి బ్యాటింగ్ రికార్డు ఉండటంతో ఆస్ట్రేలియాలో మళ్లీ పరుగుల ట్రాక్ లోకి వస్తాడని అందరూ భావించారు. కానీ, పెర్త్ టెస్టులో కూడా మరోసారి నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5 పరుగులకే విరాట్ ఔటయ్యాడు. దీంతో మరోసారి విరాట్ కోహ్లీ టార్గెట్ గా విమర్శలు వస్తున్నాయి.
Virat Kohli
హేజిల్‌వుడ్ బౌలింగ్ లో విరాట్ కోహ్లీ ఔట్
కొంతకాలం క్రితం కోహ్లీతో టెస్టు మ్యాచ్‌లు ఆడిన టీమిండియా బ్రిలియంట్ టెస్టు బ్యాట్స్‌మెన్ చెతేశ్వర్ పుజారా ఈసారి విరాట్ ను టార్గెట్ చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో జోష్ హేజిల్‌వుడ్ బౌన్సింగ్ బంతిని ఎదుర్కొనే క్రమంలో కోహ్లి ఉస్మాన్ ఖవాజా చేతికి చిక్కాడు. కోహ్లి కేవలం 12 బంతులు ఎదుర్కొని 5 పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు.
Cheteshwar Pujara
కోహ్లీ ఔట్ పై పుజారా ప్రశ్నలు
విరాట్ కోహ్లి క్రీజు వెలుపల కాకుండా వెనుక నిలబడి ఉన్నాడనీ, అందుకే అతను ఔటయ్యాడని పుజారా అన్నాడు. అలాంటి ఆట తీరు అక్కడ అవసరం లేదని చెతేశ్వర్ పుజారా స్పష్టంగా చెప్పాడు. విరాట్ క్రీజు వెలుపల నిలబడకుండా వెనుకగా ఉండాల్సిందని భారత బ్యాట్స్‌మెన్ పుజారా అభిప్రాయపడ్డాడు.
సర్దుకుపోయేంత సమయం లేనందున అతను బౌన్సీ బంతిని ఆడటానికి ఫర్ ఫెక్ట్ గా లేడు.. జోష్ హేజిల్‌వుడ్ అతని స్టాన్స్ చూసి తదనుగుణంగా బౌలింగ్ చేశాడు. పిచ్ బౌన్స్ కావడాన్ని సద్వినియోగం చేసుకుని విరాట్ ను ఔట్ చేశాడని పేర్కొన్నాడు.
Virat Kohli Out vs Australia
స్టార్ స్పోర్ట్స్‌లో ఛెతేశ్వర్ పుజారా మాట్లాడుతూ, "విరాట్ వెనుకగా ఉంటే అతను ఆ బంతిని సులభంగా ఆడగలడు. కానీ బంతి అతనిని చేరుకునే సమయానికి ఆడటానికి ఇబ్బంది పడ్డాడు" అని తెలిపాడు. న్యూజిలాండ్‌తో జరిగిన చివరి సిరీస్‌లో ఆరు ఇన్నింగ్స్‌లలో 93 పరుగులు మాత్రమే చేసిన కోహ్లీ గత ఐదేళ్లలో కేవలం మూడు టెస్టు సెంచరీలు మాత్రమే చేయడంతో అతని ఫామ్ పై ఆందోళన వ్యక్తమవుతోంది.
కుప్పకూలిన భారత్ టాప్ ఆర్డర్
తొలి రోజు మ్యాచ్‌లో భారత కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రోహిత్ శర్మ లేకపోవడంతో అతను జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. భారత జట్టు ప్రదర్శన గొప్పగా లేకపోయింది. తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు 150 పరుగులకే ఆలౌట్ అయింది. తొలి రోజు లంచ్‌కు 51 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.
యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్ ఖాతా తెరవలేకపోయారు. 26 పరుగుల వద్ద కేఎల్ రాహుల్, 5 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ ఔటయ్యారు. దీని తర్వాత 11 పరుగుల వద్ద ధ్రువ్ జురెల్ ఔట్ కాగా, 4 పరుగుల వద్ద వాషింగ్టన్ సుందర్ ఔటయ్యాడు. భారత్ స్కోరు 73/6. ఇక్కడి నుంచి టీమ్‌ఇండియా 100 పరుగులకు చేరువయ్యే అవకాశం లేదనిపించింది. కానీ, పంత్, నితీష్ లు ఇన్నింగ్స్ ను 150 పరుగులకు తీసుకెళ్లారు. పంత్ 37 పరుగులు, కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా 8 పరుగులు, హర్షిత్ రాణా 7 పరుగుల, నితీష్ రెడ్డి 41 పరుగులు చేశారు.