INDvsAUS: మొదటి వన్డేల్లో టీమిండియా ఓటమి... ధావన్, పాండ్యాల పోరాటం వృధా
First Published Nov 27, 2020, 5:40 PM IST
INDvAUS: ఆసీస్ టూర్‌ని ఓటమితో ప్రారంభించింది భారత జట్టు. బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ విభాగాల్లో విఫలమై మొదటి వన్డేలో చెత్త ప్రదర్శన కనబర్చింది. 375 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 308 పరుగులకి పరిమితమైంది. ఆస్ట్రేలియా జట్టు 66 పరుగుల తడాతో ఘనవిజయం అందుకుంది. 101 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన టీమిండియాకు శిఖర్ ధావన్, హార్ధిక్ పాండ్యా కలిసి అద్భుత భాగస్వామ్యం నిర్మించి ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే కీలక సమయంలో ఈ ఇద్దరూ అవుట్ కావడంతో టీమిండియా విజయాన్ని అందుకోలేకపోయింది. మూడు వన్డేల సిరీస్‌ను ఓటమితో ఆరంభించిన టీమిండియా, రెండో వన్డేను ఇదే సిడ్నీ స్టేడియంలో ఆదివారం తలబడబోతోంది.

375 పరుగుల టార్గెట్ చేధనను ధాటిగా ఆరంభించింది టీమిండియా. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్ బౌండరీల మోతతో ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. 5.3 ఓవర్లలోనే మొదటి వికెట్‌కి 53 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు ఈ ఇద్దరూ.

అయితే మయాంక్ అగర్వాల్ 22 పరుగులు చేసి అవుట్ కాగా వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ 21, శ్రేయాస్ అయ్యర్ 2 పరుగులు చేసి వెంటవెంటనే పెవిలియన్ చేరారు. ఈ ముగ్గురినీ అవుట్ చేసిన జోష్ హజల్‌వుడ్ టీమిండియాని కోలుకోలేని దెబ్బ తీశాడు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?