రోహిత్ గాయం గురించి తెలీదు... ఆస్ట్రేలియాకు ఎందుకు రాలేదో తెలీదు... బీసీసీఐపై విరాట్ కోహ్లీ అసహనం...
First Published Nov 27, 2020, 4:33 PM IST
2020 సీజన్‌లో అత్యంత మిస్టరీగా మారుతున్న అంశం రోహిత్ శర్మ గాయం. ఐపీఎల్ 2020 సీజన్‌లో గాయపడిన రోహిత్ శర్మ, రీఎంట్రీ ఇస్తూ గాయం తగ్గిపోయిందని చెప్పాడు. ఐపీఎల్‌లో మూడు మ్యాచులు ఆడిన తర్వాత కూడా రోహిత్ గాయం పూర్తిగా నయం కాలేదని చెప్పాడు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ. ఓ వైపు రోహిత్, మరోవైపు బీసీసీఐ... ఒక్కోరూ ఒక్కోలా చెప్పడంతో అసలేం జరుగుతుందో అర్థం కావడం లేదు క్రికెట్ అభిమానులు. తాజాగా తనకి కూడా రోహిత్ శర్మ విషయంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని చెప్పాడు భారత సారథి విరాట్ కోహ్లీ.

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీతో విబేధాల కారణంగానే ఆస్ట్రేలియా టూర్‌లో రోహిత్ శర్మను దూరంగా పెట్టాలని వార్తలు వినిపించాయి. మొదట ఆసీస్ టూర్ మొత్తానికి రోహిత్‌ను పక్కనబెట్టిన బీసీసీఐ, ఆ తర్వాత అతనికి టెస్టుల్లో అవకాశం కల్పించింది.

తాజాగా సరైన సమయానికి ఆస్ట్రేలియా చేరుకోకపోవడంతో రోహిత్ శర్మను మొదటి రెండు టెస్టుల నుంచి తప్పిస్తున్నట్టు తెలిపింది బీసీసీఐ... డిసెంబర్ 8న ఇషాంత్ శర్మతో కలిసి రోహిత్ ఆస్ట్రేలియా చేరతాడని వార్తలు వినిపించాయి.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?