INDvsAUS: ఆస్ట్రేలియాకి ఊరట విజయం... విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటం వృథా...
First Published Dec 8, 2020, 5:27 PM IST
INDvsAUS: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్ టీ20 అభిమానులకి కావాల్సినంత మజాని అందించింది. భారీ స్కోరింగ్ మ్యాచ్‌లో టీమిండియా ఓడినా... చాలా రోజుల తర్వాత విరాట్ కోహ్లీ నుంచి ‘కింగ్’ రేంజ్ ఇన్నింగ్స్ చూసే అదృష్టం దక్కింది. వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో ఆస్ట్రేలియా సొంతం చేసుకోగా, టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది. టీమిండియాకు టీ20ల్లో 11 మ్యాచుల తర్వాత ఇది తొలి ఓటమి కావడం విశేషం. 187 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలో దిగిన టీమిండియా 20 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్లు కోల్పోయి 174 పరుగులకి పరిమితమైంది. ఆసీస్‌కి 12 పరుగుల తేడాతో విజయం దక్కింది.

187 పరుగుల భారీ టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియాకు మొదటి ఓవర్‌లో షాక్ ఇచ్చాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్...

మ్యాక్స్‌వెల్ ఓవర్‌లో రెండో బంతికే డకౌట్ అయ్యాడు కెఎల్ రాహుల్. నాలుగేళ్ల క్రితం 2016లో టీ20ల్లో తాను ఆడిన మొదటి మ్యాచ్‌లో డకౌట్ అయిన రాహుల్, మళ్లీ పరుగులేమీ చేయకుండా పెవిలియన్ చేరడం ఇదే రెండోసారి...
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?