విరాట్ కోహ్లీతో గొడవపడడం అంటే ఇష్టం, కానీ అతని బ్యాటింగ్... ఆస్ట్రేలియా కెప్టెన్ టీమ్ పైన్...

First Published 15, Nov 2020, 2:34 PM

INDvsAUS: ఐపీఎల్‌ను విజయవంతంగా ముగించిన తర్వాత విరాట్ కోహ్లీ అండ్ కో ప్రస్తుతం ఆస్ట్రేలియాలో క్వారంటైన్ పీరియడ్‌లో గడుపుతున్నారు. నవంబర్ 27 నుంచి మొదలయ్యే ఆస్ట్రేలియా టూర్‌కి సిద్ధమవుతోంది భారత క్రికెట్ జట్టు. ఈ సిరీస్ ముందు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఆసీస్ టెస్టు టీమ్ సారథి టీమ్ పైన్.

‘భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి, అతన్ని అవుట్ చేయడానికి అవలంబించబోయే వ్యూహాల గురించి నన్ను అందరూ అడుగుతున్నారు... నా దృష్టిల్లో మాత్రం అతను అందరిలాగే ఓ సాధారణ ప్లేయర్ మాత్రమే...

నేను వ్యక్తిగతంగా విరాట్ కోహ్లీని ద్వేషించడాన్ని బాగా ఇష్టపడతాను... నాకు కోహ్లీకి పెద్ద అనుబంధం లేదు. టాస్ వేసేటప్పుడు మాత్రమే కోహ్లీని దగ్గరగా చూశాను... నాకు కోహ్లీ నచ్చడు కానీ ఓ క్రికెట్ ఫ్యాన్‌గా విరాట్ బ్యాటింగ్ మాత్రం చాలా నచ్చుతుంది...

మా జట్టుపైన ఎక్కువ పరుగులు చేస్తే మాత్రం సహించలేను... ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని అంచనా వేస్తున్నా... గత సీజన్‌లో జరిగినట్టుగా ఆసీస్, భారత్ జట్ల మధ్య సెడ్జింగ్ వార్ ఉండదని ఆశిస్తున్నా... ’ అంటూ చెప్పుకొచ్చాడు టీమ్ పైన్

సీనియర్ బ్యాట్స్‌మెన్, మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌పై బ్యాన్ పడడంతో టిమ్ పైన్‌కి టెస్టు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది క్రికెట్ ఆస్ట్రేలియా... వన్డే, టీ20 కెప్టెన్సీ పగ్గాలను మాత్రం ఆరోన్ ఫించ్‌కి అప్పగించింది ఆసీస్.

అత్యుత్తమ టెస్టు ప్లేయర్లుగా స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లీ కొనసాగుతుంటే... టీ20ల్లో బాబర్ అజమ్, వన్డేల్లో రోహిత్ శర్మతో పోటీపడుతున్నాడు విరాట్ కోహ్లీ....

మూడు ఫార్మాట్లలో కలిసి గత దశాబ్ద కాలంలో 20వేలకు పైగా పరుగులు చేసిన విరాట్ కోహ్లీ... ఈ ఫీట్ సాధించిన ఒకే ఒక్క క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు...

ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరును ఛాంపియన్‌గా నిలపలేకపోయిన విరాట్ కోహ్లీ, ఆసీస్ టూర్‌లో భారత జట్టును విజయవంతంగా నడిపించాలని కసిగా ఉన్నాడు...

ఆసీస్ టూర్‌లో వన్డే,టీ20 సిరీస్‌ల్లో పాల్గొనే విరాట్ కోహ్లీ, మొదటి టెస్టు ముగిసిన తర్వాత స్వదేశం తిరిగి రానున్న విషయం తెలిసిందే..