బాక్సింగ్ డే టెస్టు: భారత్-ఆస్ట్రేలియా టెస్టు.. ఎంసీజీ పిచ్ రిపోర్ట్, రికార్డులు ఇవే
India vs Australia: మెల్‌బోర్న్ వేదికగా భారత్ - ఆస్ట్రేలియా జట్లు నాలుగో టెస్ట్ మ్యాచ్ ఆడనున్నాయి. ఈ మ్యాచ్ ఎవరికి అనుకూలంగా ఉంటుంది? పిచ్ రిపోర్టు, రికార్డుల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
బాక్సింగ్ డే టెస్టు
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా భారత్-ఆస్ట్రేలియాలు మెల్‌బోర్న్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్లు నాలుగో టెస్టు ఆడనున్నాయి. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో ఇండియా 295 పరుగుల తేడాతో చారిత్రాత్మక విజయం సాధించింది. ఈ విజయాన్ని ఇండియన్లు జరుపుకునే లోపే ఆస్ట్రేలియా రెండో మ్యాచ్ లో భారత్ కు బిగ్ షాకిచ్చింది. రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. దీంతో సిరీస్ 1-1తో సమం అయ్యింది.
బుమ్రా
మూడో టెస్ట్‌లో కూడా ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగింది. కానీ, వర్షం కారణంగా 5 రోజుల మ్యాచ్‌లో చాలా సమయం ఆటం నిలిచిపోయింది. దీన్ని అనుకూలంగా మార్చుకున్న ఇండియా గట్టిగా పోరాడి మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. 3 మ్యాచ్‌ల తర్వాత సిరీస్ 1-1తో సమంగా ఉంది.
నాలుగో టెస్ట్ బాక్సింగ్ డే టెస్ట్‌గా డిసెంబర్ 26 నుంచి ఎంసీజీలో ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 5 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగే ఈ మ్యాచ్ ఇండియాకు చాలా కీలకం. ఈ మ్యాచ్ గెలిస్తేనే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు అర్హత సాధించే అవకాశం ఉంది. అందుకే ఇండియా ఎలాగైనా విజయాన్ని అందుకోవాలని చూస్తోంది. ఆసీస్ కు కూడా ఈ మ్యాచ్ కీలకం. దీంతో భారత్-ఆసీస్ బాక్సిండ్ డే టెస్టుపై ఉత్కంఠ నెలకొంది.
రోహిత్ శర్మ
మెల్‌బోర్న్ పిచ్ ఎలా ఉంటుంది?
మెల్‌బోర్న్ పిచ్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటికీ అనుకూలంగా ఉంటుంది. గత రికార్డుల గణాంకాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. రెండు జట్ల బ్యాట్స్‌మెన్లు, బౌలర్లు తమ ప్రతిభను చూపించడానికి పిచ్ అనుకూలంగా ఉంటుంది. పిచ్ రిపోర్ట్ ప్రకారం మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ మొదట్లో బౌలర్లకు సహకరిస్తుంది. బౌన్సర్లు ఎక్కువగా ఉండొచ్చు. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు అనుకూలంగా మారుతుంది. కాబట్టి రెండు జట్లు కూడా ఇదే వ్యూహాంతో బరిలోకి దిగే అవకాశముంది.
భారత్ ఆస్ట్రేలియా టెస్టు క్రికెట్
టాస్ కీలకం
మొదటి ఇన్నింగ్స్ బౌలింగ్‌కు, రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో టాస్ గెలిచిన జట్టుకు మ్యాచ్ గెలిచే అవకాశాలు ఎక్కువ. మెల్ బోర్న్ లో జరిగే బాక్సింగ్ డే టెస్టులో టాస్ కీలకంగా ఉండనుంది. ఇరు జట్లు టాస్ గెలవాలని కోరుతున్నాయి. దీంతో మ్యాచ్ ను తమ చేతుల్లోకి తెచ్చుకోవచ్చని భావిస్తున్నాయి.
మొదట బ్యాటింగా? బౌలింగా?
ఈ మైదానంలో జరిగిన మొత్తం 117 టెస్ట్‌లలో 57 మ్యాచ్‌ల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది. 42 మ్యాచ్‌ల్లో రెండో బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది. మొత్తం 18 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.
విరాట్ కోహ్లీ
BGT 2014-15
గత మూడు టూర్లలో ఒకే ఒక్క టెస్టు మ్యాచ్ డ్రా అయింది. గేమ్‌లో మొదట బౌలింగ్ చేసిన భారత్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 192 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్ రాణించడంతో ఇబ్బందుల్లో పడింది. విరాట్ కోహ్లి, అజింక్యా రహానే జంట సెంచరీలతో బదులిచ్చారు. ఆస్ట్రేలియా 530కి ప్రతిస్పందనగా 465 పరుగులు చేయడంలో భారత్‌కు సహాయపడింది. ఆస్ట్రేలియా 318/9కి డిక్లేర్ చేసింది. మళ్లీ కోహ్లి, రహానేతో పాటు పుజారా, ధోనీ, అశ్విన్‌లు రాణించడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
BGT 2018-19
విరాట్ కోహ్లి సారథ్యంలో బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో చెతేశ్వర్ పుజారా (106), విరాట్ కోహ్లీ (82) రాణించడంతో భారత్ 443/7 డిక్లేర్ చేసింది. బుమ్రా దెబ్బకు (9 వికెట్లు) ఆస్ట్రేలియా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ తడబడింది. దీంతో భారత్ 137 పరుగుల తేడాతో విజయం సాధించింది.
BGT 2020-21
ఇక్కడ జస్ప్రీత్ బుమ్రా, అజింక్యా రహానేలు భారత్ కు విజయాన్ని అందించారు. బుమ్రా మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను కేవలం 195 పరుగులకే ఆలౌట్ చేశాడు. తర్వాత రహానే తన ఓపికతో కూడిన సెంచరీతో రాణించాడు. మహ్మద్ సిరాజ్, బుమ్రా, ఉమేష్ యాదవ్‌ల సూపర్ బౌలింగ్ తో ఆస్ట్రేలియా మరోసారి బ్యాట్‌తో తడబడింది. దీంతో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సెంచరీకి, కెప్టెన్సీకి గాను రహానే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.