INDvsAUS: గిల్ అరుదైన రికార్డు... లంచ్ సమయానికి ఇంకా 105 పరుగుల దూరంలో..
First Published Dec 27, 2020, 7:26 AM IST
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా లంచ్ సమయానికి 3 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది. మొదటి టెస్టు ఆడుతున్న యంగ్ బ్యాట్స్‌మెన్ శుబ్‌మన్ గిల్ 45 పరుగులతో హాఫ్ సెంచరీ మిస్ చేసుకోగా... పూజారా 17 పరుగులు చేశాడు. ఈ ఇద్దరినీ ప్యాట్ కమ్మిన్స్ అవుట్ చేయడం విశేషం.

36/1 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన గిల్, పూజారా... రెండో వికెట్‌కి 61 పరుగుల భాగస్వామ్యం జోడించారు.

రెండో రోజు మొదటి బంతికే ఛతేశ్వర్ పూజారా అవుట్ కోసం అప్పీలు చేసింది ఆస్ట్రేలియా. అంపైర్ అవుట్ ఇవ్వకపోవడంతో రివ్యూకి కూడా వెళ్లింది. అయితే రివ్యూలో బంతి వికెట్లను మిస్ అవుతున్నట్టు స్పష్టంగా కనిపించడంతో భారత జట్టు ఊపిరి పీల్చుకుంది.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?