- Home
- Sports
- Cricket
- ఇంకో సిక్స్ కొట్టావంటే, నిన్ను బ్యాటుతో కొడతా... వీరేంద్ర సెహ్వాగ్‌ని బెదిరించిన సచిన్ టెండూల్కర్...
ఇంకో సిక్స్ కొట్టావంటే, నిన్ను బ్యాటుతో కొడతా... వీరేంద్ర సెహ్వాగ్‌ని బెదిరించిన సచిన్ టెండూల్కర్...
సౌరవ్ గంగూలీ తర్వాత వీరేంద్ర సెహ్వాగ్‌తోనే ఎక్కువ మ్యాచులు కలిసి బ్యాటింగ్ చేశాడు సచిన్ టెండూల్కర్. వన్డేల్లో 114 మ్యాచుల్లో 4387 పరుగుల భాగస్వామ్యం జోడించారు టెండూల్కర్- సెహ్వాగ్...

Virender Sehwag
సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్ వంటి టెస్టు దిగ్గజాలు ఉన్నా టీమిండియా తరుపున టెస్టుల్లో త్రిబుల్ సెంచరీ చేసిన మొట్టమొదటి బ్యాటర్‌గా నిలిచాడు వీరేంద్ర సెహ్వాగ్.. 2004లో పాక్ టూర్‌లో ముల్తాన్ టెస్టులో ఈ ఫీట్ సాధించాడు సెహ్వాగ్...
1989లో పాక్‌లో పర్యటించిన టీమిండియా, ఆ తర్వాత 15 ఏళ్లకు పొరుగుదేశానికి వెళ్లి వన్డే, టెస్టు సిరీస్‌లను గెలిచింది.. ముల్తాన్ టెస్టులో జరిగిన సచిన్ టెండూల్కర్‌తో జరిగిన ఫన్నీ సంఘటనలను బయటపెట్టాడు భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్...
‘నేను టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడేవాడిని. నా మైండ్‌సెట్ అంతా ఎక్కువ బౌండరీలు కొట్టడంపైనే ఉండేది. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో కూడా నేను ఇదే బ్యాటింగ్ స్టైల్‌ని ఫాలో అయ్యాను. సింగిల్స్ తీయాలి, డబుల్స్ తీయాలంటే నాకు పెద్ద చిరాకు...
ఎప్పుడు క్రీజులోకి వెళ్లినా సెంచరీ చేయడానికి ఎన్ని బౌండరీలు కొట్టాలనే ఆలోచనతోనే బ్యాటింగ్‌కి వెళ్లేవాడిని. 90 పరుగుల వద్ద ఉన్నప్పుడు సెంచరీ చేయడానికి 10 సింగిల్స్ తీయాలనుకుంటే, ప్రత్యర్థికి నన్ను అవుట్ చేయడానికి 10 అవకాశాలు ఇచ్చినట్టు అవుతుంది...
అందుకే నేను ఎప్పుడూ 2 బంతుల్లో సెంచరీ మార్కును అందుకోవాలని అనుకునేవాడిని. బౌండరీలు బాదితే బౌలర్లకు నన్ను అవుట్ చేయడానికి 2 బంతుల్లోనే అవకాశం దొరుకుతుంది. అంటే రిస్క్ పర్సెంటేజ్ 100 నుంచి 20 శాతానికి తగ్గిపోతుంది..
అయితే నాకు రెండు సంఘటనలు బాగా గుర్తుండిపోయాయి. 2003 మెల్‌బోర్న్ టెస్టులో సిమన్ కటిచ్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదాను. అప్పటికి నా స్కోరు 195. ఇంకో సిక్సర్ కొట్టి డబుల్ సెంచరీ పూర్తి చేసుకోవాలని అనుకున్నా. కానీ క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయా.. ఆ మ్యాచ్‌లో మేం ఓడిపోయాం...
ఆ తర్వాత ముల్తాన్ టెస్టులో నేను సెంచరీ అందుకోవడానికి 6, 7 సిక్సర్లు కొట్టాను. ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ నా దగ్గరికి వచ్చాడు. నువ్వు ఇంకో సిక్స్ కొట్టావంటే నేను నా బ్యాటుతో కొడతా... అన్నాడు. నేను షాక్ అయ్యాను...
ఎందుకు అని అడిగాను. నువ్వు ఆస్ట్రేలియాతో టెస్టులో ఇలాగే సిక్సర్ కొట్టేందుకు పోయావు, మనం మ్యాచ్ ఓడిపోయాం. సచిన్ మాటలు విని, నేను 120 నుంచి 295 రీచ్ అయ్యే వరకూ ఒక్క సిక్స్ కూడా కొట్టలేదు. అయితే 295 దగ్గర ఉన్నప్పుడు సిక్సర్ కొడతానని సచిన్‌కి చెప్పాను...
‘‘నువ్వు పిచ్చోడివా... ఇప్పటిదాకా టీమిండియా నుంచి ఎవ్వరూ త్రిబుల్ సెంచరీ కొట్టలేదు. నీకా అవకాశం దొరికింది. పిచ్చి పనులు చేసి అవుట్ అవ్వకు’’ అన్నారు. నేను వెంటనే ఎవ్వరూ 295 కూడా కొట్టలేదు కదా.. అని చెప్పాను...
ఆ తర్వాత సఖ్‌లైన్ ముస్తాక్ బౌలింగ్‌లో సిక్సర్ బాది, త్రిబుల్ సెంచరీ మార్కుని అందుకున్నా. ఆ రోజు నాకంటే సచిన్ టెండూల్కర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అప్పుడు అవుట్ అయ్యి ఉంటే సచిన్ నన్ను నిజంగానే కొట్టేవాడు...’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్..