అంత కష్టమైతే ఐపీఎల్ ఆడకండి... మెంటల్ ప్రెజర్‌పై కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు...
కొంత కాలంగా క్రికెట్‌లో మెంటల్ హెల్త్ గురించి చాలా చర్చ జరుగుతోంది. మెంటల్ హెల్త్ బాగోలేదనే కారణంగా ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్, కొన్ని నెలల పాటు క్రికెట్‌కి దూరంగా ఉన్నాడు. అలాగే ఇంగ్లాండ్‌తో సిరీస్ తర్వాత విరాట్ కోహ్లీ కూడా క్రికెట్‌కి కొంత కాలం దూరమయ్యాడు. ఈ విషయంపై తాజాగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు భారత మాజీ క్రికెటర్ కపిల్ దేవ్...

‘టీవీల్లో చాలా సార్లు విన్నాను, ప్లేయర్లపై చాలా ప్రెషర్ ఉంటోంది, ఐపీఎల్‌లో కూడా బాగా కష్టపడుతున్నాడని అంటున్నారు. నేను చెప్పేది ఒక్కటే... మీరు అంతగా కష్టపడుతూ ఉంటే ఐపీఎల్ ఆడడం మానేయండి. ఐపీఎల్ ఆడితేనే టీమిండయాకి ఆడాలనే రూల్ ఏమీ లేదుగా...
Image credit: PTI
మేం క్రికెట్‌ని ఎంజాయ్ చేస్తూ ఆడేవాళ్లు. ఆటని ఎంజాయ్ చేస్తే అక్కడ ప్రెషర్ ఎందుకు ఉంటుంది. అమెరికన్లు చెప్పే డిప్రెషన్, మెంటల్ హెల్త్ వంటి విషయాలు నాకైతే అస్సలు అర్థం కావు. ఎందుకంటే నేను ఓ రైతు కుటుంబం నుంచి వచ్చాను...
క్రికెట్‌ని ప్రేమించాను. ఆడాలని బలంగా కోరుకున్నాను. అందుకే ప్రతీ మ్యాచ్ ఎంతో ఎంజాయ్ చేశాను, అందులో ఎలాంటి ప్రెషర్ లేదు. ఆటపై ఇష్టం ఉంటే ప్రెషర్ అనే మాట రాకూడదు. ఆటను ఎంజాయ్ చేస్తే, ఆ ఎంజాయ్‌మెంట్‌లో ప్రెషర్ ఉండదు...
పిల్లలకు కూడా ఇదే చెబుతున్నారు. పదో క్లాస్ చదివే పిల్లలకు కూడా ప్రెషర్ ఉంది, డిప్రెషన్ అంటూ ఏవేమో మాటలు చెబుతున్నారు. నాకు అదే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మీరు ఏసీ స్కూల్‌లో చదువుతున్నారు...
అమ్మానాన్నలు లక్షలకు లక్షలు ఫీజులు కడుతున్నారు. టీచర్ మమ్మిల్ని కొట్టకూడదు.అయినా మీకు ప్రెషర్ ఉంటుంది.మా టైమ్‌లో ప్రెషర్ ఎలా ఉంటుందో అడగండి. టీచర్ ఓ దెబ్బ వేసిన తర్వాత ‘ఎక్కడికి వెళ్లావు’ అని అడిగేవాళ్లు....
ఎక్కడికి వెళ్లావ్ అని అడగడానికి కొట్టాల్సిన అవసరం ఏముంది. ఇప్పుడు చదువుతున్న పిల్లలపై టీచర్లు చెయ్యి వేయగలరా? చదువుకోవడం అనేది ఫన్‌గా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి అంతేకానీ ప్రెషర్ ఉండకూడదు. ఆ పదం తప్పు...
ఈ రోజు వర్షం పడకుంటే మేం ఆడుకోవచ్చని కోరుకంటే అది కోరిక, ప్రెషర్ కాదు... ప్రతీ విషయాన్ని ఎంజాయ్ చేయడం తెలుసుకుంటే ఒత్తిడి అనేది ఉండదు. ఆ విషయం ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్...