- Home
- Sports
- Cricket
- Kohli vs Gambhir: ‘వాళ్లిద్దరూ గొడవపడితేనే ఐపీఎల్‌కు అందం.. లేకుంటే సప్పిడి కూడు ఎవడు తింటాడు..’
Kohli vs Gambhir: ‘వాళ్లిద్దరూ గొడవపడితేనే ఐపీఎల్‌కు అందం.. లేకుంటే సప్పిడి కూడు ఎవడు తింటాడు..’
Kohli vs Gambhir: ఐపీఎల్-16లో లాస్ట్ ఓవర్ థ్రిల్లర్‌లు, ఆఖరి బంతి ముగింపులతో పాటు ఈ లీగ్ ను మరింత రసవత్తరంగా మార్చింది కోహ్లీ - గంభీర్ వాగ్వాదం.

మూడేండ్ల తర్వాత హోం అండ్ అవే పద్ధతిలో జరుగుతున్న ఐపీఎల్ సీజన్ -16 ప్రేక్షకులకు ఊహించినదానికంటే వినోదాన్ని పంచుతున్నది. ఈ సీజన్ లో కొన్ని తప్ప ఇప్పటివరకు ముగిసిన మ్యాచ్ లలో దాదాపు 80 శాతం ఫలితాలు లాస్ట్ ఓవర్ ద్వారా వచ్చినవే. లాస్ట్ ఓవర్, లాస్ట్ బాల్ థ్రిల్లర్ లు ఐపీఎల్ -16 ను రసవత్తరంగా మార్చాయి.
ఆఖరి ఓవర్ థ్రిల్లర్ లతో పాటు మే 1న లక్నో - బెంగళూరు నడుమ లక్నో వేదికగా ముగిసిన మ్యాచ్ లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ - నవీన్ ఉల్ హక్ - గౌతం గంభీర్ మధ్య జరిగిన వాగ్వాదాలు ఈ లీగ్ లో మరింత ఉత్సుకతను పెంచాయనడంలో సందేహమే లేదు. వీళ్ల గొడవపై మాజీ క్రికెటర్లు, ఫ్యాన్స్ ఒకింత అసహనానికి లోనైనా చాలా మంది మాత్రం ఈ మాత్రం మసాలా ఉండాల్సిందేనని అభిప్రాయపడుతున్నారు.
ఈ జాబితాలో తాజాగా ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ కూడా కోహ్లీ - గంభీర్ వివాదంపై ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. కోహ్లీ, గంభీర్ లు వాదులాడుకోవడం తనకు బాగా నచ్చిందని.. ఇటువంటి లీగ్స్ లో అలాంటి వివాదాలు ఉంటేనే బాగుంటుందని, తానైతే వాటిని ఫుల్ ఎంజాయ్ చేస్తానని చెప్పుకొచ్చాడు.
జియో సినిమాలో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో స్వాన్ మాట్లాడుతూ.. ‘నా క్రికెట్ లో కెరీర్ లో కొన్నిసార్లు భావోద్వేగాలు చాలా హైలో ఉండేవి. ఇటువంటి (కోహ్లీ - గంభీర్ వివాదం)వి లీగ్ కు కూడా చాలా మంచిది. మీరు ఏ ప్లేయర్ ను కూడా అణిచివేయడానికి ప్రయత్నించకూడదు. వాళ్లం బానిసలు కాదు.
ఎవరెన్ని చెప్పినా ఆన్ ది ఫీల్డ్ లో కోహ్లీ కోహ్లీ మాదిరిగానే ఉంటాడు. తనను తాను మార్చుకోడు. ఎందుకంటే అతడికి ఆటపై ఉన్న మక్కువ అలాంటిది. అందుకే కోహ్లీ ఇప్పటికీ చాలా మంది బౌలర్లను తన ముఖ కవలికల ద్వారానే భయపెడుతున్నాడు. గంభీర్ - కోహ్లీలు ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగుతుంది. వాళ్లిద్దరూ కలిసి క్రికెట్ ఆడినా ఇది ఆగదు. గౌతమ్ తో విరాట్ ఎప్పుడూ వెనక్కి తగ్గడు. వాస్తవానికి ఈ గొడవ నాకు నవ్వు తెప్పించింది.
ఫాస్ట్ బౌలర్లు బౌలింగ్ చేసేప్పుడు బ్యాటర్ల వైపునకు కోపంగా చూడటం కూడా మంచిదే. బ్యాటర్లను ఔట్ చేసి వీడ్కోలు పలికేప్పుడు కూడా ఉరిమి చూడటాలు, హై సెలబ్రేషన్స్ కూడా మంచివే. నాకైతే దానితో ఎటువంటి సమస్యా లేదు. ఆట ముగిశాక ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటే ఎవరి మీద బ్యాడ్ ఇమేజ్ ఉండదు. నన్ను నమ్మండి. నా క్రికెట్ కెరీర్ లో యాషెస్ సిరీస్ (ఆసీస్ తో) లలో మొత్తం ఇలాగే గడిపా. దానితో పోలిస్తే ఇదేం పెద్దది కాదు..
ఇటువంటి వివాదాల వల్ల నాకైతే ఎలాంటి అభ్యంతరమూ లేదు. ఏ గొడవా లేకుంటే ఆట కూడా డల్ గా ఉంటుంది. నేను కబడ్డీ చూశాన. ఆ గేమ్ లో ఒకరి మీద ఒకరు పడి కొట్టుకున్నంత పని చేశారు. నాకైతే అది చాలా బాగా నచ్చింది..’అని చెప్పుకొచ్చాడు. కయ్యానికి కాలు దువ్వే స్వభావం ఉండే ఇంగ్లాండ్ క్రికెటర్లలో స్వాన్ నుంచి ఇటువంటి కామెంట్స్ ఊహించడం పెద్ద విషయమేమీ కాదు మరి..!