MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • కోహ్లీని త్వరగా అవుట్ చేస్తే, టీమిండియాని ఓడించడం చాలా తేలిక... ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ కామెంట్..

కోహ్లీని త్వరగా అవుట్ చేస్తే, టీమిండియాని ఓడించడం చాలా తేలిక... ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ కామెంట్..

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో టీమిండియా హాట్ ఫెవరెట్‌గా బరిలో దిగుతోంది. అంతకుముందు ఆసియా కప్ 2023 టోర్నీలో భాగంగా సెప్టెంబర్ 2న పాకిస్తాన్‌తో తలబడనుంది టీమిండియా. ఈ మ్యాచ్‌ కోసం క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Sep 01 2023, 01:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఆఫ్ఘాన్‌పై 3-0 తేడాతో వన్డే సిరీస్ గెలిచిన పాకిస్తాన్, నేపాల్‌తో జరిగిన ఆసియా కప్ మొదటి మ్యాచ్‌లో 238 పరుగుల భారీ తేడాతో విజయం అందుకుంది. దీంతో ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో ఓడినా పాకిస్తాన్, సూపర్ 4 రౌండ్‌కి చేరడం ఖాయం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

‘ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాను. ఇండియాలోనే కాదు, ప్రపంచంలో ప్రతీ చోట రాజకీయాలు, క్రీడలను ప్రభావితం చేస్తున్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లోనూ పరిస్థితి ఇదే..

38

రెండు శత్రుదేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే  ఫైట్ పీక్స్‌లో ఉంటుంది. ఈసారి కూడా ఇండియా- పాకిస్తాన్ మధ్య అలాంటి హై టెన్షన్ మ్యాచ్ ఆశిస్తున్నా. ఇండియాకి మంచి బ్యాటింగ్ ఆర్డర్ ఉంది. పాకిస్తాన్‌కి అద్భుతమైన బౌలింగ్ లైనప్ ఉంది. పాకిస్తాన్‌కే కాస్త ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయి..

48
Virat Kohli

Virat Kohli

ఎందుకంటే పాకిస్తాన్ బ్యాటింగ్ లైనప్ కూడా బలంగా ఉంది. పాక్ బౌలింగ్‌లో షాహీన్ ఆఫ్రిదీ కీలకంగా మారతాడు. ఎందుకంటే భారత బ్యాటర్లకు లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ల వీక్‌నెస్ ఉంది. షాహీన్ ఆఫ్రిదీ మంచి క్వాలిటీ బౌలర్, అద్భుతమైన పేస్‌తో బంతిని స్వింగ్ చేస్తాడు..

58
Virat Kohli and Rohit Sharma

Virat Kohli and Rohit Sharma

టీమిండియా బ్యాటింగ్ లైనప్‌లో రైట్ హ్యాండ్ బ్యాటర్లు ఎక్కువ. లెఫ్ట్ హ్యాండ్ పేసర్‌ని ఎదుర్కోవడం, రైట్ హ్యాండ్ బ్యాటర్లకు చాలా కష్టం. అయితే టీమిండియాకి విరాట్ కోహ్లీ కీ ప్లేయర్. సచిన్ టెండూల్కర్ తర్వాత అలాంటి రికార్డు, విరాట్ కోహ్లీకే ఉంది. అతని ఆకలి ఎప్పటికీ తీరదు..

68

మెల్‌బోర్న్‌ క్రికెట్ గ్రౌండ్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, హారీస్ రౌఫ్ కొట్టిన సిక్సర్లు... ఇప్పటికీ నాకు కళ్ల ముందే ఉన్నాయి. టెండూల్కర్ జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. విరాట్ కోహ్లీ జీవితంలో కూడా ఉన్నాయి. అయితే అతను ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉన్నాడు..

78

టీమిండియా బ్యాటింగ్ లైనప్‌లో ఎంత మంది ఉన్నా విరాట్ కోహ్లీని త్వరగా అవుట్ చేస్తే, ఆ ప్రభావం మిగిలిన బ్యాటర్లపై కచ్ఛితంగా పడుతుంది. భారత జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసి, వారిపై పైచేయి సాధించాలంటే విరాట్ వికెట్‌ తీస్తే సరిపోతుంది.. 

88

భారత బౌలింగ్ యూనిట్‌పై కూడా నాకు నమ్మకం లేదు. ఎందుకంటే జస్ప్రిత్ బుమ్రా నెలల తర్వాత రీఎంట్రీ ఇస్తున్నాడు. షమీ కూడా చాలా రోజులుగా వన్డేలు ఆడలేదు.. త్వరగా వికెట్ తీయకపోతే పాకిస్తాన్ ప్రమాదకరంగా మారుతుంది..’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్.. 

About the Author

CR
Chinthakindhi Ramu
విరాట్ కోహ్లీ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved