- Home
- Sports
- Cricket
- నా మాటలు అశ్విన్‌ని బాధపెట్టి ఉంటే, మంచిదే... టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కామెంట్స్...
నా మాటలు అశ్విన్‌ని బాధపెట్టి ఉంటే, మంచిదే... టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కామెంట్స్...
సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కి సిద్ధమవుతోంది టీమిండియా. డిసెంబర్ 26న ప్రారంభమయ్యే బాక్సింగ్ డే టెస్టులో భారత స్పిన్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కీలకంగా మారనున్నాడు. అయితే సఫారీ టూర్‌కి ముందు అశ్విన్ చేసిన కొన్ని కామెంట్లు హాట్ టాపిక్ అయ్యాయి...

కెరీర్ ఆరంభంలో సరైన సపోర్ట్ లేకపోవడం, టీమిండియా తరుపున ఎంతగా రాణిస్తున్నా ఎవ్వరూ గుర్తించకపోవడంతో చాలా బాధపడ్డానని కామెంట్ చేశాడు రవిచంద్రన్ అశ్విన్...
2018-19 ఆస్ట్రేలియా టూర్‌లో అదరగొట్టిన కుల్దీప్ యాదవ్‌ని మెచ్చుకున్న అప్పటి భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి, సిడ్నీలో ఐదు వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్‌ను విదేశాల్లో ప్రధాన స్పిన్నర్‌గా భావిస్తామని కామెంట్ చేశాడు...
ఆస్ట్రేలియాలో మంచి రికార్డు ఉన్నప్పటికీ తనకి తుది జట్టులో చోటు దక్కకపోవడం, రవిశాస్త్రి పబ్లిక్‌గా విదేశాల్లో కుల్దీప్ యాదవ్‌ను ప్రధాన స్పిన్నర్‌గా ఆడిస్తామని చెప్పడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యానని కామెంట్ చేశాడు రవిచంద్రన్ అశ్విన్...
తాజాగా అశ్విన్ చేసిన కామెంట్లపై స్పందించాడు భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి. ‘సిడ్నీ టెస్టులో రవిచంద్రన్ అశ్విన్ ఆడలేదు, ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ చక్కగా బౌలింగ్ చేశాడు.
అందుకే కుల్దీప్ యాదవ్‌కి మరో అవకాశం ఇవ్వడం సమంజసం. నా మాటలు అశ్విన్‌ని బాధపెట్టి ఉండొచ్చు. అయితే అది మంచిదే...
ఎందుకంటే నా మాటల వల్లే రవిచంద్రన్ అశ్విన్ మరింత భిన్నంగా ప్రయత్నించాలని కృషి చేసి ఉంటాడు. ప్రతీ ప్లేయర్‌ను సంతృప్తిపరచడం నా పని కాదు...
నా పని ఎంటంటే ఎలాంటి పక్షపాతం లేకుండా టీమిండియాకి ఏది మంచిదో దాన్ని చేయడం. కోచ్ నిన్ను ఛాలెంజ్ చేస్తే నువ్వేం చేస్తావ్...
ఇంటికెళ్లి ఏడుచుకుంటూ కూర్చొని, మళ్లీ క్రికెట్ ఆడనని అంటావా? ఓ ప్లేయర్‌గా కోచ్ కామెంట్లను ఛాలెంజ్‌గా స్వీకరించి, మరింత మెరుగ్గా రాణించడానికి ప్రయత్నిస్తావా...
కుల్దీప్ మీద నేను చేసిన కామెంట్లు, రవి అశ్విన్‌ని బాధపెట్టి ఉంటే, ఆ మాటలు అన్నందుకు గర్వపడుతున్నా. ఎందుకంటే ఆ మాటల వల్లే అశ్విన్ మరింత మెరుగ్గా రాటుతేలాడు...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి...
సిడ్నీ టెస్టు తర్వాత విదేశాల్లో ప్రధాన స్పిన్నర్‌గా ఉంటాడని రవిశాస్త్రి కామెంట్ చేసినా, కుల్దీప్ యాదవ్‌కి ఆ తర్వాత మరో అవకాశం దక్కలేదు...
ఆస్ట్రేలియా 2020-21 టూర్‌కి ఎంపికైనప్పటికీ కుల్దీప్ యాదవ్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అదే ఆసీస్ టూర్‌లో 14 వికెట్లు తీసిన అశ్విన్, సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో హనుమ విహారితో కలిసి వికెట్లకు అడ్డుగా నిలబడి, చారిత్రక డ్రాను అందించాడు...