ధోనీ, టాపార్డర్‌లో ఆడి ఉంటే చాలా రికార్డులు బ్రేక్ చేసేవాడు... గౌతమ్ గంభీర్ కామెంట్స్...
2011 వన్డే వరల్డ్ కప్ విజయంలో క్రెడిట్ మొత్తం ధోనీయే కొట్టేశాడని చాలా సార్లు బహిరంగంగానే కామెంట్ చేశాడు గౌతమ్ గంభీర్. మాహీ కెప్టెన్సీకి క్రెడిట్ ఇచ్చిన ఫ్యాన్స్‌కి, క్రికెట్ ఎక్స్‌పర్ట్స్‌ని తిట్టినా.. ధోనీకి ఇవ్వాల్సిన క్రెడిట్ ఇస్తూనే వచ్చాడు గౌతీ...
Dhoni-Gambhir
ఆసియా కప్ 2023 టోర్నీకి కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న గౌతమ్ గంభీర్, టీమిండియా ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ వన్డేల్లో 10 వేల మార్కు అందుకున్న తర్వాత, ధోనీ గురించి ప్రస్తావించాడు..
‘రోహిత్ శర్మ ఈరోజు ఉన్న పొజిషన్‌కి మహేంద్ర సింగ్ ధోనీయే కారణం. కెరీర్ ఆరంభంలో రోహిత్ ఎన్ని సార్లు ఫెయిల్ అయినా, అతనికి వరుసగా అవకాశాలు ఇస్తూ వచ్చాడు. అతని ప్లేస్‌లో ఎవరున్నా రోహిత్ ఈ రోజు ఈ పొజిషన్‌లో ఉండేవాడు కాదు..’ అంటూ కామెంట్ చేశాడు గౌతమ్ గంభీర్..
తాజాగా మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ రికార్డుల గురించి వ్యాఖ్యానించాడు గంభీర్. ‘ఎమ్మెస్ ధోనీ వన్‌డౌన్ పొజిషన్‌లో బ్యాటింగ్ చేసి ఉంటే, చాలా బ్యాటింగ్ రికార్డులు బ్రేక్ చేసేవాడు. అయితే కెప్టెన్సీ వల్ల బ్యాటింగ్‌లో చాలా త్యాగాలు చేశాడు..
వ్యక్తిగత రికార్డుల కంటే టీమ్ పర్ఫామెన్స్ ముఖ్యమని భావించాడు. అందుకే అంతర్జాతీయ పరుగులను త్యాగం చేశాడు. ట్రోఫీల కంటే తన వ్యక్తిగత రికార్డులే ముఖ్యమనుకుంటే గొప్ప బ్యాటర్లలో ఒకడిగా కచ్ఛితంగా ఉండేవాడు..’ అంటూ వ్యాఖ్యానించాడు గౌతమ్ గంభీర్...
ఓపెనర్‌గా రెండు వన్డేలు ఆడిన మహేంద్ర సింగ్ ధోనీ, వన్‌డౌన్‌లో 16 ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇందులో 2 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు చేశాడు. ధోనీ కెరీర్‌ని మార్చేసిన 148 పరుగులు కూడా వన్‌డౌన్‌లోనే వచ్చాయి..
పాకిస్తాన్‌తో వైజాగ్ వన్డేలో 148 పరుగులు చేసిన మహేంద్ర సింగ్ ధోనీ, 2005లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 183 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వన్‌డౌన్‌లో ధోనీ యావరేజ్ 82.75గా ఉంది..
నాలుగో స్థానంలో 30 ఇన్నింగ్స్‌లో ఆడిన ధోనీ, ఓ సెంచరీ, 12 హాఫ్ సెంచరీలు చేశాడు. నాలుగో స్థానంలో ధోనీ యావరేజ్ 56.58గా ఉంది. అయితే ఐదు, ఆరు స్థానాల్లోలనే ఎక్కువ మ్యాచులు ఆడాడు ధోనీ..
ఐదో స్థానంలో 83 మ్యాచులు ఆడి 4 సెంచరీలు చేసిన ధోనీ, 129 మ్యాచుల్లో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చాడు. ఆరో స్థానంలో ఓ సెంచరీ, 30 హాఫ్ సెంచరీలు చేసిన మాహీ, ఏడో స్థానంలో 34 మ్యాచుల్లో బ్యాటింగ్‌కి వచ్చి 2 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు చేయడం విశేషం..
dhoni
మొత్తంగా 297 ఇన్నింగ్స్‌ల్లో 10 సెంచరీలు, 73 హాఫ్ సెంచరీలతో వన్డేల్లో 10,773 పరుగులు చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ. మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి వస్తూ వన్డేల్లో 10 వేల పరుగులు చేసిన మొట్టమొదటి ప్లేయర్‌గా నిలిచాడు ఎమ్మెస్ ధోనీ..