టీ20 వరల్డ్ కప్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయా! మళ్లీ టీమ్‌లోకి వస్తే... హార్ధిక్ పాండ్యా కామెంట్స్...
గాయంతో రెండు సీజన్లలో ముంబై ఇండియన్స్ తరుపున ఒక్క బంతి కూడా వేయలేకపోయాడు హార్ధిక్ పాండ్యా. బౌలింగ్ చేసేందుకు ఫిట్‌గా లేని హార్ధిక్ పాండ్యాని టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి ఎంపిక చేయడం తీవ్ర వివాదాస్పదమయ్యింది...
బౌలింగ్ చేసేందుకు ఫిట్‌గా లేని హార్ధిక్ పాండ్యా ప్లేస్‌లో వెంకటేశ్ అయ్యర్‌ని ప్రయత్నించాలని సెలక్టర్లు భావించారు. అయితే టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి మెంటర్‌గా వ్యవహరించిన మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం హార్ధిక్ పాండ్యాకే ఓటు వేయడంతో అతనికి అవకాశం దక్కింది...
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో హాట్ ఫెవరెట్‌గా బరిలో దిగిన భారత జట్టు, వరల్డ్ కప్ చరిత్రలో మొదటి సారి పాకిస్తాన్ చేతుల్లో ఓడింది. అదీ అలా ఇలా కాదు, కనీస పోరాటం కూడా చూపించకుండా 10 వికెట్ల తేడాతో చిత్తుగా పరాజయం పాలైంది.. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లోనూ పూర్తిగా తేలిపోయింది..
అనుకున్నట్టుగానే టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత టీమ్‌కి దూరమయ్యాడు హార్ధిక్ పాండ్యా. నేరుగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఐపీఎల్ 2023 సీజన్ ఆడి, మొదటి సీజన్‌లోనే టైటిల్ గెలిచాడు.. 2022 సీజన్‌లో బౌలింగ్, బ్యాటింగ్‌లో ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్‌తో అదరగొట్టిన హార్ధిక్ పాండ్యాకి తిరిగి టీమ్‌లో చోటు దక్కింది..
గుజరాత్ టైటాన్స్ విజయంతో హార్ధిక్ పాండ్యా, టీమిండియాకి టీ20 కెప్టెన్‌గానూ ప్రమోషన్ దక్కించుకున్నాడు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే 2024 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలోనే ఆడనుంది భారత జట్టు.
‘2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత నేను అజ్ఞాతంలోకి వెళ్లిపోయాను. నాతో నేను సమయం గడిపేందుకు ప్రాధాన్యం ఇచ్చాను. ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసుకోవాలని అనుకున్నా...
భారత జట్టులోని అందరూ నేను అప్పటికే క్లియర్‌గా చెప్పేశాను.. నేను, టీమ్‌లోకి రీఎంట్రీ ఇస్తే, తిరిగి బౌలింగ్ చేసేందుకు కావాల్సిన ఫిట్‌నెస్ సాధించి, ఆల్‌రౌండర్‌గానే వస్తానని! లేకపోతే ఆడనని... నన్ను, నేను ఛాలెంజ్ చేసుకున్నా..
Image credit: Getty
ఇప్పుడు నేను బౌలింగ్ చేయగలుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఆల్‌రౌండర్‌గా టీమ్‌కి సేవలు అందించగలుగుతున్నందుకు సంతోషంగా ఉన్నా...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా వైట్ బాల్ వైస్ కెప్టెన్, టీ20 కెప్టెన్ హార్ధిక్ పాండ్యా..
మహ్మద్ సిరాజ్ గాయంతో స్వదేశానికి తిరిగి వెళ్లడంతో వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో మొదటి ఓవర్ వేసిన హార్ధిక్ పాండ్యా.. 3 ఓవర్లు బౌలింగ్ చేసి 17 పరుగులిచ్చి ఓ వికెట్ తీశాడు..