- Home
- Sports
- Cricket
- మేనేజ్‌మెంట్ సరిగ్గా ఉంటే ఉమ్రాన్ మాలిక్‌కి ఈ పరిస్థితి వచ్చేది కాదు... భారత మాజీ ప్లేయర్...
మేనేజ్‌మెంట్ సరిగ్గా ఉంటే ఉమ్రాన్ మాలిక్‌కి ఈ పరిస్థితి వచ్చేది కాదు... భారత మాజీ ప్లేయర్...
ఐపీఎల్ 2022 ద్వారా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన ప్లేయర్ ఉమ్రాన్ మాలిక్. ఐపీఎల్‌లో ప్రతీ మ్యాచ్‌లోనూ 150+ కి.మీ.లతో బౌలింగ్ చేసి మెప్పించిన ఉమ్రాన్ మాలిక్, సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌కి ఎంపికై, ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్ ద్వారా ఆరంగ్రేటం చేశాడు...

Image credit: Getty
ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో ఒకే ఒక్క ఓవర్ వేసిన ఉమ్రాన్ మాలిక్, రెండో టీ20లో 4 ఓవర్లు బౌలింగ్ చేసి 42 పరుగులు సమర్పించాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో 4 ఓవర్లలో 56 పరుగులిచ్చిన ఉమ్రాన్ మాలిక్, ఆ తర్వాత మిగిలిన రెండు టీ20ల్లో తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు...
తాజాగా వెస్టిండీస్ టూర్‌లో టీ20 సిరీస్‌కి ప్రకటించిన జట్టులో ఉమ్రాన్ మాలిక్‌కి చోటు దక్కకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. 2 టీ20 మ్యాచుల్లో మాత్రమే ఆడించిన టీమ్ మేనేజ్‌మెంట్, అతన్ని తప్పించడంపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆగ్రహం వ్యక్తం చేశాడు...
Image credit: PTI
‘ఉమ్రాన్ మాలిక్‌కి వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో చోటు లేకపోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. రెండు మ్యాచులు ఆడిన ఉమ్రాన్ మాలిక్‌కి రెస్ట్ ఇచ్చారా? లేక తప్పించారా?
Image credit: PTI
రెండు మ్యాచుల్లోనే అద్భుతం చేయాలంటే జరిగేది కాదు. కనీసం అతనితో మాట్లాడారా? కాస్త మంచి మేనేజ్‌మెంట్ ఉండి ఉంటే... ఉమ్రాన్ మాలిక్‌కి ఈ పరిస్థితి వచ్చేది కాదు...
తొలుత అతన్ని అన్నీ టీమ్స్‌లో అవకాశం ఇచ్చారు, ఇప్పుడు అన్నింటి నుంచి తప్పించారు. వెస్టిండీస్ టూర్‌కి పంపించకుండా జింబాబ్వే టూర్‌కి పంపాలని అనుకుంటున్నారా?...
భారత జట్టు తరుపున ఆడడానికి అతను రెఢీగా ఉన్నాడని మీరు భావిస్తే వరుస అవకాశాలు ఇవ్వండి... అతను రెఢీగా లేకపోతే జట్టుకి సెలక్ట్ చేయడం ఎందుకు? మళ్లీ టీమ్ నుంచి తప్పించడం ఎందుకు...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా...