MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • నేనే సెలెక్టర్ అయితే అతడిని కచ్చితంగా తీసుకుంటా.. ఆర్సీబీ వికెట్ కీపర్ ఆటకు ఫిదా అయిన గవాస్కర్

నేనే సెలెక్టర్ అయితే అతడిని కచ్చితంగా తీసుకుంటా.. ఆర్సీబీ వికెట్ కీపర్ ఆటకు ఫిదా అయిన గవాస్కర్

Dinesh Karthik: టీమిండియా వెటరన్ బ్యాటర్, ప్రస్తుతం ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున దుమ్మురేపుతున్న  వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ ఆటకు  భారత మాజీ సారథి, దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ముగ్దులయ్యాడు. 

2 Min read
Srinivas M
Published : May 12 2022, 01:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

ఆర్సీబీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ఈసారి అంచనాలకు మించి రాణిస్తున్నాడు.  వికెట్ కీపర్ గా వికెట్ల వెనుక కీలక క్యాచులు, మ్యాచులను మలుపుతిప్పే స్టంపింగులు చేస్తున్న  దినేశ్ కార్తీక్.. బ్యాటర్ గా కూడా జోరుమీదున్నాడు. 

29

ఈ సీజన్ లో కార్తీక్..  12  ఇన్నింగ్స్ లో 274 పరుగులు చేశాడు. ఫినిషర్ గా వస్తున్న  కార్తీక్.. ఆడేది 15 నుంచి 20 బంతులే అయినా  సిక్సర్లు, బౌండరీలతో ప్రత్యర్థి బౌలర్లు, ఫీల్డర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. 

39

వరుసగా మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలతో ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న  కార్తీక్ పై  సునీల్ గవాస్కర్ ప్రశంసలు కురిపించాడు. ఒకవేళ తానే  సెలెక్టర్ అయితే మాత్రం కార్తీక్ ను తప్పకుండా భారత జట్టులోకి తీసుకుంటానని, త్వరలో జరుగబోయే టీ20 ప్రపంచకప్ తుదిజట్టులో అతడిని ఎంపికచేస్తానని చెప్పుకొచ్చాడు. 

49

సన్నీ మాట్లాడుతూ.. ‘గతేడాది ఇంగ్లాండ్ లో ముగిసిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ (ఇండియా వర్సెస్ న్యూజిలాండ్) కు కార్తీక్ తో కలిసి నేను కామెంటరీ చెప్పా. అతడికి జట్టులో చోటు దక్కకున్నా.. ఐపీఎల్ లో మాత్రం కసిగా ఆడుతున్నాడు. 

59

గతేడాది టీ20  ప్రపంచకప్ లో అతడికి చోటు దక్కాల్సింది. కానీ దక్కలేదు. ఒకవేళ నేనే సెలెక్టర్ అయితే మాత్రం  కార్తీక్ ను తప్పకుండా రాబోయే టీ20 వరల్డ్ కప్ కు ఎంపిక చేస్తా. తుది జట్టులో ఆడిస్తా...’ అని అన్నాడు. 

69

‘ఫామ్ ముఖ్యం కాదు క్లాస్ ముఖ్యమని క్రికెట్లో అంటుంటారు. అయితే ఫామ్ లో ఉన్న క్లాస్ ప్లేయర్ ను మాత్రం  మీరు తప్పకుండా తుది జట్టులోకి తీసుకోవాలి. కార్తీక్ ప్రస్తుతం అదే దశలో ఉన్నాడు. అతడు నాణ్యమైన బ్యాటరే గాక మంచి వికెట్ కీపర్ కూడా.. 

79

అతడి వయసు గురించి పట్టించుకోకండి. ఆటను చూడండి. ఫినిషర్ గా వచ్చినా.. జట్టుకు అవసరమైన సమయంలో క్రీజులోకి అడుగుపెట్టినా సమయానుకూలంగా ఆడుతున్నాడు. అది ముఖ్యం.  అతడి ఫామ్ ఆధారంగా అయినా డీకే ను తుది జట్టులోకి తీసుకోవాలి. 

89

డీకేతో పాటు  టీమిండియాకు కెఎల్ రాహుల్, రిషభ్ పంత్, ఇషాన్ కిషన్ రూపంలో మూడు వికెట్ కీపింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ఈ ఐపీఎల్ లో ఫామ్ పరంగా చూసినా ఆటపరంగా చూసినా వారికంటే కార్తీక్ మెరుగ్గానే ఆడుతున్నాడు. నిలకడగా ఆడుతూ  తన జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. 

99

ముగ్గురు వికెట్ కీపర్లను ఎంపిక చేయవద్దని ఏ క్రికెట్ రాజ్యాంగంలో కూడా రాసిలేదు. ఒక కీపర్ కేవలం కీపింగ్ మాత్రమే  కాదు.. అన్నీ చేయగలడు.  అందువల్ల కార్తీక్ ను టీ20 ప్రపంచకప్ కు ఎంపిక చేయడం మంచి ఆప్షన్..’ అని గవాస్కర్ తెలిపాడు. 

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL : సన్‌రైజర్స్ హైదరాబాద్ గూటికి విధ్వంసకర వీరుడు.. 2026 ఐపీఎల్ కోసం కొత్త సైన్యం రెడీ !
Recommended image2
IPL 2026 : కోట్లు కుమ్మరించిన సీఎస్కే ! ఎవరీ కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్?
Recommended image3
IPL చరిత్రలో అత్యంత ఖరీదైన టాప్-5 విదేశీ ఆటగాళ్లు వీరే.. లిస్టులో ఆసీస్ డామినేషన్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved