ICC WTC Final: విరాట్ కోహ్లీ, పూజారా అవుట్... టీమిండియా పరాజయం తప్పదా?
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో న్యూజిలాండ్ పట్టు బిగుస్తోంది. అసలు ఫలితం తేలుతుందా? లేదా? అనుకున్న మ్యాచ్‌ను న్యూజిలాండ్ బౌలర్లు, కివీస్ వైపు మలుపు తిప్పేసేలా ఉన్నారు... వెంటవెంటనే రెండు వికెట్లు తీసిన జెమ్మీసన్, టీమిండియాకి షాక్ ఇచ్చాడు.

ఓవర్ నైట్ స్కోరు 64/2 వద్ద ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా.. 71 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ వికెట్‌ను కోల్పోయింది. 29 బంతుల్లో 13 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, జెమ్మీసన్ బౌలింగ్‌లో వాట్లింగ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

తొలి ఇన్నింగ్స్‌లో జెమ్మీసన్ బౌలింగ్‌లోనే ఎల్బీడబ్ల్యూగా అవుటైన విరాట్ కోహ్లీ, మరోసారి అతని బౌలింగ్‌లోనే అవుటై పెవిలియన్ చేరాడు...

ఆ తర్వాత కొద్దిసేపటికే 80 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు చేసిన ఛతేశ్వర్ పూజారాను కూడా అవుట్ చేశాడు జెమ్మీసన్. జెమ్మీసన్ బౌలింగ్‌లో రాస్ టేలర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు పూజారా...

దీంతో 72 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది టీమిండియా. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌కి 32 పరుగుల ఆధిక్యం దక్కడంతో భారత జట్టు ఈ టెస్టు మ్యాచ్‌ను కాపాడుకోవాలంటే కనీసం తక్కువలో తక్కువ 250 స్కోరు చేయాల్సి ఉంటుంది...

లేదంటే రెండు సెషన్ల పాటు వికెట్లను కాపాడుకుంటూ ఇన్నింగ్స్ నిర్మించాల్సి ఉంటుంది. రెండో సెషన్ సగంలో ఆలౌట్ అయినా, 150-200 పరుగుల టార్గెట్‌ను చేధించడానికి న్యూజిలాండ్‌కి 45 ఓవర్లు దొరుకుతాయి...