MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఎల్లో జెర్సీ ఉందని ఆస్ట్రేలియాకి సపోర్ట్ చేస్తున్న చెన్నై ఫ్యాన్స్... వన్డే వరల్డ్ కప్‌లో ఐపీఎల్ పిచ్చి...

ఎల్లో జెర్సీ ఉందని ఆస్ట్రేలియాకి సపోర్ట్ చేస్తున్న చెన్నై ఫ్యాన్స్... వన్డే వరల్డ్ కప్‌లో ఐపీఎల్ పిచ్చి...

ఐపీఎల్ వల్ల ప్రపంచ క్రికెట్‌కి చాలా మంచి జరిగింది. అయితే భారత క్రికెట్‌కి మాత్రం జరిగిన మంచి కంటే చెడే ఎక్కువ. ఐపీఎల్‌కి ముందు ఎలాంటి తారతమ్యాలు చూపకుండా భారత జట్టును అభిమానించిన ఫ్యాన్స్, ఇప్పుడు ఫ్రాంఛైజీ పిచ్చిలో కొట్టుకు చస్తున్నారు..

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Oct 08 2023, 07:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఐపీఎల్ పర్ఫామెన్స్ కారణంగానే టీమ్‌కి ప్లేయర్లను సెలక్ట్ చేస్తోంది బీసీసీఐ. అభిమానులు కూడా ఇండియన్ టీమ్‌ని చూడకుండా భారత జట్టులోనూ ఐపీఎల్ ఫ్రాంఛైజీలను చూస్తున్నారు. ఫలానా ప్లేయర్ ఆడితే, ఈ ఐపీఎల్ టీమ్ వాడు బాగా ఆడాడని ఆనందపడే పరిస్థితికి వచ్చేశారు..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్‌గా వ్యవహరించే చెన్నై సూపర్ కింగ్స్‌లో ఈ వెర్రి మరింత ఎక్కువగా ఉంటుంది. తాజాగా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా చెన్నైలో భారత్, ఆస్ట్రేలియాతో తలబడింది. ఈ మ్యాచ్‌కి వచ్చిన భారతీయుల్లో చాలా మంది, ఆస్ట్రేలియా జెర్సీలో వచ్చి ఆసీస్‌కి సహకరించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది..
 

35

దీనికి కారణం ఒక్కటే.. ఆస్ట్రేలియా జెర్సీ ఎల్లో కలర్‌లో ఉంటుంది. సీఎస్‌కే కూడా ఎల్లో జెర్సీలో ఉంటుంది. దీంతో ఎల్లో లవ్ పేరుతో చాలామంది చెన్నై ఫ్యాన్స్, తమ దేశానికి కాకుండా ప్రత్యర్థి దేశానికి సపోర్ట్ చేస్తూ స్టేడియంలో హడావుడి చేశారు..

45

ఐపీఎల్ అంటే ఇష్టం ఉండొచ్చు. ధోనీ ఆడే ఫ్రాంఛైజీ అంటే పిచ్చి ఉండొచ్చు. కానీ దేశం కంటే ఏదీ ముందు కాదు, ఏదీ ముఖ్యం కాదు. అదీ ప్రపంచ కప్ లాంటి టోర్నీలో సొంత దేశానికి కాకుండా కేవలం ఎల్లోజెర్సీ వేసుకున్నారని ప్రత్యర్థికి సపోర్ట్ చేయడం అంటే అంత కంటే వెర్రితనం ఉండదు..

55

అయితే ఎల్లో జెర్సీలో వచ్చిన భారత అభిమానులను చూసి, ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ మురిసిపోతోంది. ఇండియాలో తమకి ఇలాంటి సపోర్ట్ దక్కడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది... ఇదే కొనసాగితే, ఈ ఐపీఎల్ పిచ్చి మరిన్ని వైపరిత్యాలకు దారి తీయొచ్చని భయపడుతున్నారు నిజమైన భారత క్రికెట్ ఫ్యాన్స్..

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: వరల్డ్ కప్ పోయింది.. ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ కొట్టాల్సిందే.. ఐదుగురు కొత్త ప్లేయర్లకు బంపర్ ఛాన్స్ !
Recommended image2
Ben Stokes: సడన్ షాక్ ఇచ్చిన ఇంగ్లండ్ కెప్టెన్.. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు బెన్ స్టోక్స్ సడన్ రిటైర్మెంట్ ఎందుకిచ్చాడు?
Recommended image3
IND vs IRE: అబ్బా ఏం మ్యాచ్ రా బాబు.. లాస్ట్ బాల్‌కి సిక్స్ కొట్టినా ఓడిపోయిన ఇండియా.. అసలు కారణాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved