MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఆఫ్ఘాన్, ఇంగ్లాండ్‌ని కొట్టిన దెబ్బకు ఆఖరి స్థానంలో ఆస్ట్రేలియా... లంకపై గెలవకపోతే ఇంటికే..

ఆఫ్ఘాన్, ఇంగ్లాండ్‌ని కొట్టిన దెబ్బకు ఆఖరి స్థానంలో ఆస్ట్రేలియా... లంకపై గెలవకపోతే ఇంటికే..

ఫైవ్ టైమ్ వన్డే వరల్డ్ కప్ విన్నర్ ఆస్ట్రేలియా, 2023 వన్డే వరల్డ్ కప్‌లో ఇంకా బోణీ కొట్టలేదు. ఎంకి పెళ్లి, సుబ్బి చావుకి వచ్చిదన్నట్టు.. పసికూన ఆఫ్ఘాన్ చేతుల్లో ఇంగ్లాండ్ ఓటమి, ఆస్ట్రేలియాని ఆఖరి స్థానంలో పడేసింది..

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Oct 16 2023, 01:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతుల్లో ఓడిన ఆసీస్, రెండో మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతుల్లో 134 పరుగుల తేడాతో పరాజయం పాలైంది..

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
AUSTRALIA

AUSTRALIA

ఈ రెండు పరాజయాలతో -1.846 నెట్ రన్‌రేట్‌తో ఆఖరి స్థానంలో నిలిచింది ఆస్ట్రేలియా. మొదటి రెండు మ్యాచుల్లో ఓడిన శ్రీలంక, నెదర్లాండ్స్ కూడా మెరుగైన రన్‌రేట్‌తో ఆస్ట్రేలియా కంటే టాప్‌లో నిలిచాయి..

36

మొదటి రెండు మ్యాచుల్లో చిత్తుగా ఓడిన ఆఫ్ఘనిస్తాన్, డిఫెండింగ్ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌పై 69 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుని... టాప్ 6లోకి దూసుకెళ్లింది. దీంతో 9వ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా.. ఆఖరి స్థానానికి పడిపోవాల్సి వచ్చింది..

46

శ్రీలంకతో లక్నోలో మ్యాచ్ ఆడుతోంది ఆస్ట్రేలియా. ఈ మ్యాచ్ గెలవడం ఆస్ట్రేలియా పరువు సమస్య. ఈ మ్యాచ్ కూడా ఓడిపోతే 2023 వన్డే వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా సెమీ ఫైనల్ ఛాన్సులు పూర్తిగా ఆవిరైపోతాయి...

56

శ్రీలంక కూడా మొదటి రెండు మ్యాచుల్లో విజయాలు అందుకోలేకపోయింది. అయితే రెండు మ్యాచుల్లోనూ బ్యాటింగ్‌లో మంచి పోరాటం చూపించింది. సౌతాఫ్రికాపై 326 పరుగులు చేసిన లంక, పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో 344 పరుగుల భారీ స్కోరు చేసినా దాన్ని కాపాడుకోలేకపోయింది.

66

ఆస్ట్రేలియాపై టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌లో 280-320 స్కోరు చేస్తే, బౌలర్లు సరిగ్గా రాణిస్తే దాన్ని కాపాడుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. వానిందు హసరంగ గాయపడడం, భారీ ఆశలు పెట్టుకున్న మహీశ్ తీక్షణ, మతీశ పథిరాణా ఘోరంగా విఫలమవుతుండడం లంకను ఇబ్బందిపెడుతోంది.. 

About the Author

CR
Chinthakindhi Ramu
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Virat Kohli: విరాట్ కోహ్లీ విధ్వంసం.. ఒకే సెంచరీతో 10 సంచలన రికార్డులు బద్దలు
Recommended image2
IND vs WI 1st ODI: కోహ్లీ, గిల్ విశ్వ‌రూపం.. వెస్టిండీస్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం
Recommended image3
IND vs WI: విండీస్‌తో భారత్ తొలి వన్డే.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఖాతాలో బిగ్ రికార్డులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved