MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • మూడేళ్ల తర్వాత మళ్లీ అదే సీన్! టీ20 వరల్డ్ కప్ 2022లో సెమీస్ చేరే నాలుగు జట్లు ఏవి...

మూడేళ్ల తర్వాత మళ్లీ అదే సీన్! టీ20 వరల్డ్ కప్ 2022లో సెమీస్ చేరే నాలుగు జట్లు ఏవి...

ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఇప్పటికే అరడజను మ్యాచులు వర్షార్పణం అయ్యాయి. టైటిల్ ఫెవరెట్లలో ఒకటైన పాకిస్తాన్ వరుసగా రెండు మ్యాచుల్లో ఓడి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. దీంతో ఈసారి సెమీస్ చేరే జట్ల గురించి అప్పుడే చర్చ మొదలైపోయింది...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Oct 28 2022, 05:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Image credit: Getty

Image credit: Getty

గ్రూప్ 2లో ఉన్న భారత జట్టు ఇప్పటిదాకా జరిగిన రెండు మ్యాచుల్లో గెలిచి 4 పాయింట్లతో ఉంది. సూపర్ 12 రౌండ్‌లో మిగిలిన ఏ జట్టూ కూడా 4 పాయింట్లు సాధించలేదు. సౌతాఫ్రికా, జింబాబ్వేతో పాటు గ్రూప్ 1లో న్యూజిలాండ్, ఐర్లాండ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మూడేసి పాయింట్లతో ఉన్నాయి...

27
Image credit: Getty

Image credit: Getty

గ్రూప్ 1లో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ 2 పాయింట్లతో టేబుల్‌లో కింద ఉంటే గ్రూప్ 2లో బంగ్లాదేశ్ 2 పాయింట్లు సాధించింది. పాకిస్తాన్‌తో పాటు నెదర్లాండ్స్ ఇప్పటిదాకా ఒక్క విజయాన్ని కూడా అందుకోలేకపోయాయి. అయితే ఇకపై జరిగే మ్యాచులు టేబుల్‌ను తలకిందలు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి...

37
ireland

ireland

ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో ఓడిన ఇంగ్లాండ్ జట్టు, ఆఫ్ఘాన్‌పై మ్యాచ్ గెలిచింది. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయ్యింది. తర్వాతి మ్యాచుల్లో మ్యాచుల్లో న్యూజిలాండ్, శ్రీలంకలతో మ్యాచులు ఆడనుంది ఇంగ్లాండ్.  ఇంగ్లాండ్ సెమీస్ చేరడం వరుణుడి మీదే ఆధారపడి ఉంది...

47
Image credit: PTI

Image credit: PTI

2021 టీ20 వరల్డ్ కప్ విన్నర్ ఆస్ట్రేలియాని మొదటి మ్యాచ్‌లో ఓడించిన న్యూజిలాండ్, మంచి రన్‌రేట్ సాధించింది. ఆఫ్ఘాన్‌తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. తర్వాతి మ్యాచుల్లో శ్రీలంక, ఇంగ్లాండ్, ఐర్లాండ్‌లతో మ్యాచులు ఆడనుంది న్యూజిలాండ్ టీమ్...

57
Image credit: Getty

Image credit: Getty

న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌లతో పాటు ఐర్లాండ్ జట్టుకి కూడా సెమీస్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. నాలుగో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాతో మ్యాచ్ గెలిచినా, వర్షం కారణంగా రద్దయినా ఐర్లాండ్‌ పంట పండినట్టే. అప్పుడు న్యూజిలాండ్‌ జట్టుతో కలిసి ఐర్లాండ్ సెమీస్ రావచ్చు... 

67

అలా జరిగితే 2019 వన్డే వరల్డ్ కప్ మాదిరిగా సెమీ ఫైనల్‌లో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ జరగొచ్చు. ఐసీసీ టోర్నీల్లో కివీస్‌పై ఏ మాత్రం మంచి రికార్డు లేని భారత జట్టు, న్యూజిలాండ్‌ని మరోసారి ఎదుర్కోవాల్సి ఉంటుంది. 

77

మొత్తానికి 2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీని వర్షం ప్రభావితం చేసినట్టే, 2022 టీ20 వరల్డ్ కప్‌ విజేతను డిసైడ్ చేయడంలోనూ వరుణుడు కీలక పాత్ర పోషించబోతున్నాడు. టాస్, పిచ్, పర్ఫామెన్స్‌లతో పాటు వర్షం కూడా వరల్డ్ కప్ రిజల్ట్‌లను డిసైడ్ చేయనుంది...

About the Author

CR
Chinthakindhi Ramu
Latest Videos
Recommended Stories
Recommended image1
సూర్యకుమార్ ఔట్, అతడికే కెప్టెన్సీ పగ్గాలు.. టీ20 టీమ్ ప్రకటన
Recommended image2
IPL 2026: ఈసారి ఐపీఎల్ చాలా స్పెష‌ల్‌.. చ‌రిత్ర‌లోనే అతిపెద్ద సీజ‌న్‌, ఇంకా ఎన్నో మార్పులు
Recommended image3
Team India : వీరు కదా అసలైన హీరోలు.. గంభీర్ నమ్మిన పంచ పాండవులు !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved