MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ICC Rankings 2026 : వరల్డ్ క్రికెట్లో హైదరబాద్ హవా.. ఐసిసి ర్యాంకింగ్స్ లో టాప్ లేపిన పట్నం పోటుగాళ్లు

ICC Rankings 2026 : వరల్డ్ క్రికెట్లో హైదరబాద్ హవా.. ఐసిసి ర్యాంకింగ్స్ లో టాప్ లేపిన పట్నం పోటుగాళ్లు

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) తాజాగా అన్ని జట్లు, ఆటగాళ్ల ర్యాంకింగ్స్ ప్రకటించింది. ఇందులో టీమిండియా సత్తా చాటింది. ముఖ్యంగా హైదరాబాద్ తరపున ఆడే ఆటగాళ్లు అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. 

3 Min read
Author : Arun Kumar P
Published : Jul 02 2026, 11:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఐసిసి మెన్స్ క్రికెట్ ర్యాంకింగ్స్
Image Credit : Getty

ఐసిసి మెన్స్ క్రికెట్ ర్యాంకింగ్స్

ICC Rankings 2026 : ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత బలమైన జట్టు భారత్. ఇటీవల పసికూన ఐర్లాండ్ చేతిలో ఓడినా టీమిండియా ప్రతిష్ఠ ఏమాత్రం తగ్గలేదు... ఈ విషయాన్ని స్వయంగా ఐసిసి విడుదల చేసిన ర్యాంకింగ్సే చెబుతున్నారు. కేవలం టీ20 లోనే కాదు వన్డే ఫార్మాట్ లోనూ 'మెన్స్ ఇన్ బ్లూ' మెరుగైన స్థానంలో నిలిచింది. ఇంకా ఆసక్తికర విషయం ఏంటంటే ఐపిఎల్ లో మన హైదరాబాద్ తరపున ఆడే ఆటగాళ్లు ఈ ఐసిసి ర్యాంకింగ్స్ దుమ్ములేపారు. ఇలా ఐసిసి తాజా ర్యాంకింగ్స్ లో టాప్ లో నిలిచిన ఆటగాళ్లు ఎవరో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఐసిసి మెన్స్ టీ20 ర్యాంకింగ్స్
Image Credit : ANI

ఐసిసి మెన్స్ టీ20 ర్యాంకింగ్స్

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్ లో టీమిండియా హవా కొనసాగింది. ఇంటర్నేషనల్ టీ20 ప్లేయర్లలో భారత ఆటగాళ్లు టాప్ లో నిలిచారు. టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్ లో యువ సంచలనం ఇషాన్ కిషన్ 876 రేటింగ్ పాయింట్స్ తో మొదటిస్థానంలో నిలిచాడు. ఇది అతడి కెరీర్ లోనే అత్యుత్తమ ర్యాంకు. ఇక చాలాకాలంగా టాప్ ర్యాంకులో కొనసాగుతున్న మరో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ అభిషేక్ 869 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు.. ఇలా టీ20 క్రికెట్లో టాప్ 2 ర్యాంకులు మన హైదరబాదీ ఆటగాళ్లవే. ఇంకా ఆసక్తికర విషయం ఏంటంటే తెలుగు ప్లేయర్ తిలక్ వర్మ 747 రేటింగ్ పాయింట్లతో ఆరో ర్యాంకును సొంతం చేసుకున్నాడు.

విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా, సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ తర్వాత ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానం దక్కించుకున్న ఐదో భారత ఆటగాడు ఇషాన్ కిషన్. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో 200 స్ట్రైక్ రేట్‌తో 317 పరుగులు చేసిన ప్రదర్శన కిషన్‌ను అగ్రస్థానంలో నిలబెట్టింది.

ఇక తాజా ర్యాంకింగ్స్ లో పాకిస్థానీ ప్లేయర్ షాహిబ్దాదా పర్హాన్ 848 పాయింట్లతో మూడోస్థానం, ఇంగ్లాండ్ ఆటగాడు పిలిప్ సాల్ట్ 792 పాయింట్లతో నాలుగో స్థానం, శ్రీలంక క్రికెటర్ పతుమ్ నిస్సంక 751 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచారు.

టీ20 టీమ్స్ ర్యాంకింగ్ లో కూడా టీమిండియానే టాప్ లో నిలిచింది. 14725 పాయింట్లు, 274 రేటింగ్ తో భారత జట్టు మొదటి స్థానంలో నిలిచింది. ఇక 262 రేటింగ్ తో ఇంగ్లాండ్ రెండో స్థానం, 260 రేటింగ్ తో ఆస్ట్రేలియా మూడో స్థానం, 247 పాయింట్లతో న్యూజిలాండ్ నాలుగో స్థానం, 244 పాయింట్లతో సౌతాఫ్రికా ఐదో స్థానంలో నిలిచాయి. ఆ తర్వాత ఆరో స్థానంలో పాకిస్థాన్ (240 రేటింగ్) నిలిచింది.

35
ఐసిసి మెన్స్ వన్డే ర్యాంకింగ్స్
Image Credit : ANI

ఐసిసి మెన్స్ వన్డే ర్యాంకింగ్స్

ఇంటర్నేషనల్ వన్డే క్రికెటర్లలో న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ 815 రేటింగ్ తో టాప్ ర్యాంకు సాధించాడు. ఆ తర్వాత 791 రేటింగ్ తో శుభ్ మన్ గిల్, 768 రేటింగ్ తో విరాట్ కోహ్లీ, 754 రేటింగ్ తో రోహిత్ శర్మ వరుసగా 2,3,4 స్దానాలు సాధించారు. ఇది వన్డే బ్యాటింగ్ లో టీమిండియా ఎంత బలంగా ఉందో తెలియజేస్తుంది.

ఇక వన్డే టీమ్ప్ ర్యాంకింగ్స్ లో కూడా టీమిండియాదే మొదటిస్థానం. 3623 పాయింట్లు, 121 రేటింగ్ తో అన్ని ఇంటర్నేషనల్ జట్లకంటే మెరుగైన స్థానంలో టీమిండియా ఉంది. ఇక 113 రేటింగ్ తో న్యూజిలాండ్, 102 రేటింగ్ తో ఆస్ట్రేలియా వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. సరిగ్గా 100 రేటింగ్ తో మన దాయాది టీం పాకిస్థాన్ ఐదో స్థానంలో నిలిచింది. అంటే ఈ వన్డే ర్యాంకింగ్స్ లో పాక్ కు అందనంత దూరంలో భారత్ నిలిచింది.

45
టెస్టుల్లో టాప్ బౌలర్ మనోడే..
Image Credit : Getty

టెస్టుల్లో టాప్ బౌలర్ మనోడే..

టెస్ట్ ఫార్మాట్ లో టాప్ బౌలర్ గా జస్ప్రీత్ బుమ్రా నిలిచాడు. ఐసిసి ర్యాంకింగ్స్ లో అతడు అత్యధికంగా 870 రేటింగ్ పాయింట్లు కలిగివున్నాడు. ఇక న్యూజిలాండ్ బౌలర్ హెన్రీ 861, ఆసిస్ బౌలర్లు స్టార్క్ 838, పాట్ కమ్మిన్స్ 832 రేటింగ్ పాయింట్లతో వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు.

టీ20 బౌలర్లలో అప్ఘానిస్తాన్ ప్లేయర్ రషీద్ ఖాన్ 753 రేటింగ్ తో టాప్ లో నిలిచాడు. తర్వాత పాకిస్థాన్ ప్లేయర్ అబ్రార్ అహ్మర్ 736 రేటింగ్ తో రెండో స్థానం, ఇండియన్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 725 రేటింగ్ తో మూడో స్థానంలో నిలిచారు.

55
టెస్టుల్లో టాప్ ఆల్రౌండర్ ఎవరో తెలుసా?
Image Credit : AFP

టెస్టుల్లో టాప్ ఆల్రౌండర్ ఎవరో తెలుసా?

అంతర్జాతీయ క్రికెట్ నుంచి అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, తన కెరీర్‌ను ఘనంగా ముగించాడు. టెస్ట్ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు మెరుగుపరుచుకుని మూడో స్థానంలో నిలిచి కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ఈ జాబితాలో భారత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అగ్రస్థానంలో ఉన్నాడు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Related Stories
Recommended image1
ICC Rankings: గిల్ ఖాతాలో అదిరిపోయే రికార్డ్.. బుమ్రా నంబర్ 1 కుర్చీ లాగేసుకున్న కీవీస్ ప్లేయర్
Recommended image2
Cricket Records: క్రికెట్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ షాక్.. 27 పరుగులకే ఆలౌట్.. కేవలం 5 బంతుల్లోనే మ్యాచ్ ఫినిష్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved