‘స్పైడర్ మ్యాన్’ రిషబ్ పంత్... భారత యంగ్ వికెట్ కీపర్‌పై ఐసీసీ ఫన్నీ ఫోటో, కవిత్వం...

First Published Jan 21, 2021, 11:24 AM IST

ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై పరుగులు సాధించడం అంటే... అంత తేలికైన పనికాదు. స్వదేశంలో పుల్లుల్లా గర్జించిన ఎందరో లెజెండరీ ప్లేయర్లు, ఆసీస్ గడ్డపై ఘోరంగా ఫెయిల్ అయ్యారు. అయితే భారత యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మాత్రం అక్కడ రికార్డు ప్రదర్శనతో అదరగొట్టాడు. ఆడిన 12 ఇన్నింగ్స్‌ల్లో 11 సార్లు 25+ స్కోరు నమోదుచేసిన మొట్టమొదటి ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేసిన రిషబ్ పంత్, నాలుగో టెస్టు నాలుగో ఇన్నింగ్స్‌లో టాప్ క్లాస్ ప్రదర్శనతో టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించాడు. పంత్‌ను పొగుడుతూ ఓ ఫన్నీ ఫోటో, కవిత్వాన్ని పోస్టు చేసింది ఐసీసీ.