- Home
- Sports
- Cricket
- వన్డేల్లో డబుల్ సెంచరీ, టీ20ల్లో సెంచరీ... ఇప్పుడు ఐసీసీ అవార్డు రేసులో శుబ్‌మన్ గిల్... సిరాజ్ మియాతో
వన్డేల్లో డబుల్ సెంచరీ, టీ20ల్లో సెంచరీ... ఇప్పుడు ఐసీసీ అవార్డు రేసులో శుబ్‌మన్ గిల్... సిరాజ్ మియాతో
టీమిండియా యంగ్ బ్యాట్స్‌మెన్ శుబ్‌మన్ గిల్‌కి ఈ ఏడాది బాగా కలిసి వచ్చింది. ఈ ఏడాది వన్డేల్లో డబుల్ సెంచరీ బాదేసిన శుబ్‌మన్ గిల్, టీ20ల్లో సెంచరీ బాదేసి మూడు ఫార్మాట్లలో తన ప్లేస్ ఫిక్స్ చేసుకున్నాడు. తాజాగా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ (జనవరి 2023) రేసులో నిలిచాడు శుబ్‌మన్ గిల్...

Image credit: PTI
జనవరిలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ద్వారా టీ20 అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన శుబ్‌మన్ గిల్, మొదటి రెండు మ్యాచుల్లో పెద్దగా మెప్పించలేకపోయాడు. తొలి రెండు టీ20ల్లో సింగిల్ డిజిట్ స్కోరుకే అవుటైన శుబ్‌మన్ గిల్, రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టీ20లో 46 పరుగులు చేశాడు...
Image credit: PTI
శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో 70, 21, 116 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 208 పరుగులు చేసి, వన్డేల్లో డబుల్ సెంచరీ బాదిన యంగెస్ట్ బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు...
రెండో వన్డేలో 40 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన శుబ్‌మన్ గిల్, మూడో మ్యాచ్‌లో 112 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ గెలిచాడు. మూడో టీ20 మ్యాచ్‌లో 63 బంతుల్లో 126 పరుగులు చేసి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచిన శుబ్‌మన్ గిల్, ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ (జనవరి) అవార్డు రేసులో నిలిచాడు...
Image credit: PTI
ఈసారి శుబ్‌మన్ గిల్‌తో పాటు భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ కూడా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేసులో ఉన్నాడు. శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో 9 వికెట్లు తీసిన మహ్మద్ సిరాజ్, న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో 5 వికెట్లు పడగొట్టాడు.
Image credit: PTI
ఐసీసీ నెం.1 వన్డే బౌలర్‌గా నిలిచి మహ్మద్ సిరాజ్... శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో 4, న్యూజిలాండ్‌తో హైదరాబాద్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌లో 4 వికెట్లు తీసి అదరగొట్టాడు...
శుబ్‌మన్ గిల్, మహ్మద్ సిరాజ్‌లతో పాటు న్యూజిలాండ్ ఓపెనర్ డివాన్ కాన్వే కూడా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ (జనవరి 2023) రేసులో నిలిచాడు. జనవరిలో పాకిస్తాన్‌తో జరిగిన రెండో టెస్టులో 122 పరుగులు చేసిన డివాన్ కాన్వే, వరుసగా రెండో ఏడాది కూడా మొట్టమొదటి అంతర్జాతీయ సెంచరీ బాదిన బ్యాటర్‌గా నిలిచాడు.
Devon Conway
పాక్‌తో వన్డే సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో డకౌట్ అయినా రెండో వన్డేలో 101, మూడో వన్డేలో 52 పరుగులు చేశాడు డివాన్ కాన్వే... ఇండియాతో జరిగిన సిరీస్‌లో 10, 7, 138, 51, 11 పరుగులు చేసిన కాన్వే, ఒకే నెలలో 3 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు..