వానకాలంలో ఎవ్వడైనా వరల్డ్ కప్ పెడతాడా... ఇలా అయితే సగం మ్యాచులు వర్షార్ఫణం!...
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఘనంగా ప్రారంభమైంది. క్వాలిఫైయర్ మ్యాచుల దగ్గర్నుంచి ప్రతీ మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్‌కి కావాల్సినంత మజాని అందిస్తోంది. అసోసియేట్ దేశాలు కూడా టాప్ టీమ్స్‌కి షాక్ ఇస్తూ అంచనాలకు మించి అదరగొడుతున్నాయి. అయితే వానలు, పొట్టి ప్రపంచ కప్‌కి శాపంగా మారాయి...
virat kohli
ఇండియా- పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌కి వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలు వినిపించినా, మ్యాచ్ డే సమయానికి వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఎలాంటి అంతరాయం లేకుండా పూర్తిగా 40 ఓవర్ల పాటు సాగిన దాయాదుల సమరం, థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ అందించింది...
అయితే సౌతాఫ్రికా, జింబాబ్వే మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే రద్దయ్యింది. వర్షం కారణంగా మ్యాచ్‌ని 9 ఓవర్లకు కుదించినా జింబాబ్వే పెట్టిన 80 పరుగుల టార్గెట్ చేధనలో సౌతాఫ్రికా 3 ఓవర్లలోనే 51 పరుగులు చేసినా... మరోసారి వర్షం పలకరించడంతో మ్యాచ్ ఫలితం తేలకుండానే రద్దయ్యింది. ఇంకో 2 ఓవర్లు మ్యాచ్ సాగితే సౌతాఫ్రికాకి డీఎల్‌ఎస్ విధానం ద్వారా విజయం వరించి ఉండేది...
Zimbabwe
తాజాగా బంగ్లాదేశ్- సౌతాఫ్రికా మధ్య జరగాల్సిన మ్యాచ్‌ని కూడా వాన పలకరించింది. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టైటిల్ ఫెవరెట్‌గా బరిలో దిగిన సౌతాఫ్రికాకి ఇది ఊహించని షాకే. ఈ మ్యాచ్ కూడా ఫలితం తేలకపోతే... సఫారీ జట్టు సెమీస్ ఛాన్సులు భారీగా తగ్గిపోతాయి...
afghanistan
న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ కూడా వర్షం కారణంగా ఒక్క బంతి కూడా వేయకుండానే రద్దయ్యింది. నవంబర్‌లో ఆస్ట్రేలియాలో భారీ వర్షాలు ప్రారంభమవుతాయి. దీంతో మున్ముందు మ్యాచులు సజావుగా సాగడం చాలా కష్టమే...
Image credit: Getty
2019 వరల్డ్ కప్ సమయంలో కూడా ఇలాగే జరిగింది. వర్షం కారణంగా చాలా మ్యాచులకు అంతరాయం కలిగింది. ఇండియా- న్యూజిలాండ్ మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రెండు రోజుల పాటు సాగింది.. అలాగే ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ఆరు రోజుల పాటు సాగింది. ఈ రెండు సందర్భాలు కివీస్ విజయావకాశాలను పెంచాయి.
మార్చి- జూన్ మధ్యలో ఐపీఎల్ ఉండడంతో ఆ టైమ్‌లో ఏ ఐసీసీ టోర్నీ జరిగే ప్రశస్తి లేదు. ఇక మిగిలిన కాలంలో సరైన సమయాన్ని చూసి టోర్నీలకు షెడ్యూల్ చేయాల్సి వస్తోంది.
షెడ్యూల్ ప్రకారం 2020లో ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్, కరోనా కారణంగా 2022లో జరుగుతోంది. అంతా బాగానే ఉంది కానీ పోయి పోయి వానకాలంలో వరల్డ్ కప్ పెట్టాలని ఐసీసీ నిర్ణయం తీసుకోవడం ఏంటో అర్థం కావడం లేదంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్..
టైమ్ లేనప్పుడు వర్షం అంతరాయం కలిగించే అవకాశం లేని యూఏఈ వంటి దేశాల్లో టీ20 వరల్డ్ కప్ నిర్వహిస్తే సరిపోయేది కదా... అంటూ ఐసీసీ ధోరణిని తీవ్రంగా విమర్శిస్తున్నారు...